1 దిన 17:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 మీ కోసం మీరు విడిపించిన మీ ప్రజలైన ఇశ్రాయేలు వంటి ప్రజలు ఎవరు ఉన్నారు? వారి దేవుడవైన మీరు వారిని ఈజిప్టులో నుండి విడిపించి, మీ ప్రజల ఎదుట నుండి ఇతర దేశాలను వెళ్లగొట్టినప్పుడు గొప్ప అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేసి మీకు గొప్ప పేరు తెచ్చుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 నీ జనులైన ఇశ్రాయేలీయులవంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులోనుండి నీవు విమోచించిన నీ జనులయెదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 నీ ప్రజలైన ఇశ్రాయేలీయుల్లాంటి జాతి భూలోకంలో ఏది? ఐగుప్తులోనుంచి నువ్వు విమోచించిన నీ ప్రజల ముందు నిలబడనివ్వకుండా నువ్వు అనేక జాతులను తోలివేసినందువల్ల మహా భీకరమైన పేరు తెచ్చుకొన్నావు. వాళ్ళు నీ సొంత ప్రజలయ్యేలా వాళ్ళను విమోచించడానికి దేవుడవైన నువ్వు బయలుదేరావు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్21 ఇశ్రాయేలు వంటి మరో దేశం వున్నదా? లేదు! ఈ అద్భుతకార్యాలు నీవు జరిపించిన దేశం భూమి మీద ఇశ్రాయేలు ఒక్కటే. నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చి మాకు స్వేచ్ఛ కలుగజేశావు. ఆ విధంగా నీ ఘనతను చాటావు! నీ ప్రజలకు ముందుగా నీవు నడిచి అన్యులు మా కొరకు వారి రాజ్యాన్ని విడిచి పోయేలా చేశావు! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 మీ కోసం మీరు విడిపించిన మీ ప్రజలైన ఇశ్రాయేలు వంటి ప్రజలు ఎవరు ఉన్నారు? వారి దేవుడవైన మీరు వారిని ఈజిప్టులో నుండి విడిపించి, మీ ప్రజల ఎదుట నుండి ఇతర దేశాలను వెళ్లగొట్టినప్పుడు గొప్ప అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను చేసి మీకు గొప్ప పేరు తెచ్చుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |