Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 దిన 16:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

29 యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకు చెల్లించండి. అర్పణను తీసుకుని ఆయన సన్నిధికి రండి. తన పవిత్రత యొక్క వైభవంతో యెహోవాను ఆరాధించండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

29 యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయనయెదుట సాగిలపడుడి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

29 యెహోవా నామానికి తగిన మహిమను ఆయనకు చెల్లించండి. నైవేద్యాలు చేత పట్టుకుని ఆయన సన్నిధిలో చేరండి. పవిత్రత అనే ఆభరణాలు ధరించుకుని ఆయన ముందు సాగిలపడండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

29 యెహోవా మహిమను కొనియాడండి ఆయన నామాన్ని ఘనపర్చండి! మీ అర్పణలను యెహోవా సన్నిధికి తీసుకొని రండి యెహోవాను, అతిశయించిన ఆయన పవిత్ర సౌందర్యాన్ని ఆరాధించండి!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

29 యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకు చెల్లించండి. అర్పణను తీసుకుని ఆయన సన్నిధికి రండి. తన పవిత్రత యొక్క వైభవంతో యెహోవాను ఆరాధించండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 దిన 16:29
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి, మహిమను బలాన్ని యెహోవాకు చెల్లించండి.


సమస్త భూలోకమా! ఆయన ఎదుట వణకాలి, లోకం స్థిరంగా స్థాపించబడింది, అది కదలదు.


ప్రజలతో మాట్లాడిన తర్వాత యెహోషాపాతు, యెహోవాకు ఇలా పాడటానికి, ఆయన పవిత్రత యొక్క వైభవాన్ని స్తుతించడానికి మనుష్యులను నియమించాడు, వారు సైన్యానికి ముందుగా నడిచారు: “యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.”


కృతజ్ఞతతో ఆయన ద్వారాల గుండా ప్రవేశించండి, స్తుతితో ఆయన ఆవరణంలోకి ప్రవేశించండి; ఆయనకు వందనాలు చెల్లించండి, ఆయన నామమును స్తుతించండి.


మీ యుద్ధ దినాన మీ దళాలు ఇష్టపూర్వకంగా వస్తాయి. పవిత్ర వైభవాన్ని ధరించుకున్నవారై ఉదయపు గర్భం నుండి మంచులా మీ యువకులు మీ దగ్గరకు వస్తారు.


దేవ కుమారులారా, యెహోవాకు ఆపాదించండి, మహిమను బలాన్ని యెహోవాకు ఆపాదించండి.


యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే ఆపాదించండి; ఆయన పరిశుద్ధ వైభవాన్ని బట్టి యెహోవాను ఆరాధించండి.


సౌందర్యంలో పరిపూర్ణమైన, సీయోను నుండి, దేవుడు ప్రకాశిస్తారు.


తర్షీషు రాజులు దూర దేశపు రాజులు, ఆయనకు పన్నులు చెల్లిస్తారు. షేబ సెబా రాజులు కానుకలు తెస్తారు.


రాజు దీర్ఘకాలం జీవించును గాక! షేబ నుండి ఆయనకు బంగారం ఇవ్వబడును గాక. ప్రజలు నిత్యం ఆయన కోసం ప్రార్థించుదురు గాక. రోజంతా ఆయనను స్తుతించుదురు గాక.


కృతజ్ఞతార్పణతో ఆయన సన్నిధికి వద్దాం, సంగీత గానంతో ఆయనను కీర్తిద్దాము.


వైభవం, ప్రభావం ఆయన ఎదుట ఉన్నాయి; బలం, మహిమ ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాయి.


ప్రజల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి, మహిమను బలాన్ని యెహోవాకు చెల్లించండి.


తన పవిత్రత యొక్క వైభవంతో యెహోవాను ఆరాధించండి; సమస్త భూలోకమా! ఆయన ఎదుట వణకాలి.


సీయోనూ, మేలుకో మేలుకో, నీ బలాన్ని ధరించుకో! పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా! నీ సుందరమైన వస్త్రాలను ధరించుకో. సున్నతి పొందనివారు గాని అపవిత్రులు గాని నీ లోనికి మరలా ప్రవేశించరు.


వారు ఒకరితో ఒకరు, “సైన్యాల యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు; సమస్త భూమి ఆయన మహిమతో నిండి ఉంది” అని పాడుతున్నారు.


“మనుష్యకుమారుడా, నేను వారి ఆశ్రయాన్ని, వారి ఆనందాన్ని కీర్తిని, వారి కళ్లకు ఇష్టమైన దానిని, వారి హృదయ ఆశలను అలాగే వారి కుమారులను కుమార్తెలను తీసివేసే రోజు వస్తుంది.


అందమైన ఆభరణాల బట్టి గర్వించి హేయమైన విగ్రహాలను తయారుచేయడానికి వాటిని ఉపయోగించారు. వారు దానిని నీచమైన చిత్రాలుగా మార్చారు; కాబట్టి నేను దానిని వారి కోసం ఒక అపవిత్రమైనదానిగా చేస్తాను.


ఇలా అన్నారు: “ఆమేన్! మా దేవునికి స్తుతి, మహిమ, జ్ఞానం, కృతజ్ఞతాస్తుతులు, ఘనత, శక్తి, ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.”


మీకు వచ్చిన గడ్డలకు దేశాన్ని పాడు చేస్తున్న ఎలుకలకు సూచనగా ఈ గడ్డలు, ఎలుకల రూపాలు తయారుచేసి పంపించి ఇశ్రాయేలు దేవున్ని మహిమపరచాలి. అప్పుడు మీమీద నుండి, మీ దేవుళ్ళ మీద నుండి, మీ దేశం మీద నుండి ఆయన తన హస్తాన్ని తీసివేయవచ్చు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ