దేవుణు మెసె వెట మఙి రూలుఙ్ సిత మనాన్. అయా రూలుఙ్ వజ, లేవి తెగ్గదు పుట్తికార్ పుజెరిఙు ఆదెఙ్‌వలె. ఏలు, లేవి తెగ్గదు మని పుజెరిఙు ఇహిఙ ఆరోను కుటుమ్‌దికార్ దేవుణు ఎత్తు కితి ఉపదేసమ్‌కు పూర్తి కిదెఙ్ అట్తార్ ఇహిఙ, మరి ఒరెన్ పుజెరి వాదెఙ్ అవ్‌సరం సిలెతాద్ మరి. అహరోను కుటుమ్‌దు మనికాన్ ఆఏండ, మెల్కిసెదెకు మహి లెకెండ్ ఒరెన్ వన్నిఙ్ పోక్తెఙ్ అవ్‌సరం సిల్లెద్.