ଗାଲାତିୟ 1:4 - Konda: కొండ బాసదు నెగ్గి కబ్రు4 మాటు కిత్తి తప్పు పణిఙ్ మఙి తప్రిస్తెఙ్, యా లోకమ్‌దు మని సెఇ బాణిఙ్ డిఃస్పిస్తెఙ్ క్రీస్తు మా పాపమ్‌క వందిఙ్ వన్నిఙ్ వాండ్రె ఒపజెపె ఆతండ్రె సాతాన్. మా బుబ్బ ఆతి దేవుణు ఎత్తు కిత్తి వజనె వాండ్రు యా లెకెండ్ మా వందిఙ్ సాతాన్. အခန်းကိုကြည့်ပါ။ମାପୁରୁଦି ସତ୍ ବାକ୍ୟ ପୁନି ନିୟମ୍4 ଇଲେଇତି ଇୟା ପାପ୍ ଦୁନିଆଦାନ୍ ମାଙ୍ଗିଁ ରକିୟା କିଦେଙ୍ଗ୍ଁ ଇଜି, ମା ବୁବା ମାପୁରୁଦି ବଦା ମାନାଜି, କ୍ରିସ୍ତ ମା ପାପ୍ ଉଣ୍ତିଙ୍ଗ୍ଁ ନିଜେଦିଙ୍ଗ୍ଁ ସର୍ପେ କିତାନ୍ । အခန်းကိုကြည့်ပါ။ |
యా లోకమ్‌దికార్ బత్కిని వజ దేవుణుదిఙ్ పడిఃఏండ బత్కిదెఙ్ ఆఏద్. గాని మీ బత్కు ఆనివందిఙ్, మీ మన్సు పూర్తి కొత్తాఙ్ కిదెఙ్ దేవుణుదిఙ్ సరి సీదు. ఆహె కిత్తిఙ మీరు ఇనిక కిదెఙ్ ఇజి దేవుణు కోరిజినాండ్రొ అక్క ఎమేణిక ఇజి నెసి ఒప్పుకొండెఙ్ ఆనిదెర్. దేవుణు మీ వందిఙ్ కోరిజినిక నెగ్గికాదె, వన్నిఙ్ ఇస్టం ఆతికాదె, ఇని తక్కు సిల్లికాదె.
మాటు ఒడొఃల్‌ది సెఇ అసెఙాణిఙ్ మహిఙ్ పాపమ్‌దాన్ గెల్పిస్తెఙ్ దేవుణు సిత్తి రూలుఙ్ అట్‌ఏండ మహాద్. ఎందానిఙ్ ఇహిఙ, ఒడొఃల్‌ది సెఇ అసెఙ్ అడ్డు కిత్తాద్. గాని దేవుణు మఙి డిఃబిస్తాన్. ఎలాగ ఇహిఙ, మా పాపమ్‌కాఙ్ వందిఙ్ వన్ని సొంత మరిసిఙ్ యా లోకమ్‌దు పోక్తాండ్రె, ఒడొఃల్‌ది సెఇ ఆసెఙ్ మా ముస్కు ఏలుబడిః కినిదన్నిదటాన్ మఙి డిఃబిస్తాన్. వన్ని మరిసి మా లెకెండ్ ఒడొఃల్‌దాన్ పుట్తాండ్రె మా పాపమ్‌కాఙ్ వందిఙ్ సాతాన్.
నాను క్రీస్తు వెట సిలువాదు కుటిఙాణిఙ్ డెయె ఆతి లెకెండ మన. నాను బత్కిజి మహి లెకెండ్ మరి బత్కిఎ. క్రీస్తునె నా మన్సుదు బత్కిజినాన్. ఏలు నాను ఆఎ నా ముస్కు అతికారం కిజినాన్. గాని క్రీస్తు నా లొఇ మంజి నా ముస్కు అతికారం కిజినాన్. నాను యా లోకమ్‌దు బత్కిజిని బత్కు దేవుణు మరిసిఙ్ నమ్మిజి బత్కిజిన. వాండ్రు నఙి ప్రేమిసి నా వందిఙ్ వన్ని పాణం సితాన్.
అహిఙ, క్రీస్తు నల ఎసొ నెగ్రెండ సుబ్బరం కినాద్ ఇజి ఎత్తు కిదు. ఎలాకాలం మన్ని ఆత్మసత్తుదాన్, క్రీస్తు మా పాపమ్‌కాఙ్ వందిఙ్ వన్నిఙ్ వాండ్రె దేవుణుదిఙ్ ఒపజెపె ఆతాన్. ఇని పాపం సిల్లి పూజ లెకెండ్, వన్నిఙ్ వాండ్రె ఒపజెపె ఆతాన్. సావు తపిస్ని సెఇ పణిఙాణిఙ్ వన్ని నల మా గర్బం మఙి గదిస్‌ఏండలెకెండ్ సుబ్బరం కినాద్. ఎందనిఙ్ ఇహిఙ బత్కిజిని దేవుణుదిఙ్ మాటు పొగ్‌డిఃజి మాడిఃస్తెఙ్.
నమ్మకమాతికాన్ ఆతి సాసి, సాతి వరిబాణిఙ్ తొలిత నిఙిత్తికాన్, బూమి ముస్కు ఏలుబడిః కిజిని విజు రాజురిఙ్ ముస్కు రాజు ఆతి యేసుక్రీస్తుబా వన్ని దయదార్మమ్‌దాన్ మీరు నిపాతిదాన్ మండ్రెఙ్ సాయం కిపిన్. మఙి ప్రేమిస్తాండ్రె వన్ని నలదాన్, మా పాపమ్‌కాఙ్ మఙి విడుదల కిజి, వన్ని బుబ్బాతి దేవుణుదిఙ్ ఉండ్రి రాజ్యం లెకెండ్‌ని, వన్నిఙ్ పణి కిని పుజేరిఙ్ లెకెండ్ కిత్తిమన్ని యేసుక్రీస్తుఙ్ గొప్ప గవ్‌రమ్‌ని అతికారం అంతు సిల్లెండ ఎలాకాలం మనీద్. ఆమెన్.
దన్ని వెనుక నాను సుడ్ఃతిఙ్, విజు దేసమ్‌కాణిఙ్, విజు జాతిఙణిఙ్, విజేరె లోకుర్ బాణిఙ్, విజు బాసెఙ్ వర్గిని వరిబాణిఙ్ వాతి ఎయెన్‌బా లెక్క కిదెఙ్ అట్‌ఇనన్ని గొప్ప మంద లోకుర్ అయ సింహాసనం ఎద్రుని గొర్రెపిల్ల ఎద్రు నిల్సి మంజినిక సుడ్ఃత. వారు తెల్లాని సొక్కెఙ్ తొడిఃగిజి ఈత మరాతి మటెఙ్ కికాఙ్ అస్త మహార్.