5 పడ్తొ జాచి నిర్డె గుట్టుచి ఏక్ నావ్ రెగ్డ తిలి. ‘వెల్లి బబులోను పట్నుమ్, లంజె జల తేర్‍బోదల్‍క అయ్యసి, బూలోకుమ్‍చ వెట్కారల్‍క అయ్యసి’ మెలి నావ్ రెగ్డ తిలి.
జేఁవ్ నాసెనుమ్‍తె గెచ్చుల, జోవయించి పెట్టి జోవయింక దేముడు, జోవయించి పాపుమ్‍చి రిసొ జోవయింక సర్ద, ఈంజయ్ లోకుమ్‍తె తతిసి ఎత్కికయ్ జోవయింక ఆస.
మదెనె జో మూర్కుడుచి బుద్ది ఈంజ లోకుమ్‍తె జేఁవ్‍చి పాపుమ్ లుంక, చోరు తిరీమ్ తిరీమ్ కెర్తయ్, గని జోక అడ్డు కెర్తొసొ అడ్డు కెరుక ములిలెకయ్, జా బాద ఎదార్దుమ్ జా పూర్తి అల్లర్ కెరెదె.
పడ్తొ అంచొ ఉజిల్ అత్తి తిల సత్తు సుక్కల్, చి బఙర్‍క తెయార్ కెర్ల సత్తు దీవుకంబల్‍చి అర్దుమ్, సత్తు సుక్కల్ సత్తు సంగుమ్‍లుచ దూతల్ జవుల, చి సత్తు దీవుకంబల్, జేఁవ్ సత్తు సంగుమ్‍లుయి జవుల” మెలన్.
ప్రబుక సిలువతె టీఁవొ కెర మార్లి వెల్లి పట్నుమ్‍తె ఇన్నెయించ పీనుమ్‍లు సేడ తవుల. జా పట్నుమ్‍క టాలిక ‘సొదొమ’ చి ‘ఐగుప్తు’ మెన సంగుక జయెదె.
అన్నెక్ దూత, జలె, ఇన్నెతెన్ దొన్నిచొ, జో అగ్గెచొ చి పట్టి ఉడ్డ గెచ్చ, కిచ్చొ మెలన్ మెలె, “వెల్లి బబులోను పట్నుమ్ సేడ అస్సె. ఎత్కి ప్రెజల్‍క జాచి లంజె ఆస, రగుమ్‍చి ద్రాచ రస్సుమ్ పియడ్లిసి జా.” మెన సాడుప కెర్లన్.
జా బూకంపుమ్ జతికయ్, వెల్లి పట్నుమ్ తిన్ని వాటల్ జా గెలి, చి దేముడుక నేన్ల మాన్సుల్‍చ రాజిమ్‍ల్‍చ పట్నల్ పాడ్ జల. చి జోచి ఎదివాట్ కోపుమ్‍చి సిచ్చచి గిన్నయ్ తిలిసి జా వెల్లి బబులోను పట్నుమ్‍చ మాన్సుల్ పూర్తి పియ గెల్తి రితి, దేముడు నే పఁవ్సితె జర్గు కెర్లన్.
తెదొడి, సత్తు గిన్నల్ దెర తిల సత్తు దూతల్‍తె ఏక్ దూత అంచితె జా కెర కిచ్చొ సంగిలన్ మెలె, “తుయి ఇన్నె వెగ జే! ఒగ్గర్ పానివొచి ఉప్పిరి వెస తిలి వెల్లి లంజె జలి తేర్‍బోద సిచ్చ జతిసి దెకయిందె.
జాచి తెన్ బూలోకుమ్‍చ రానల్ లంజె జా అస్తి, చి జాచి లంజెచి ద్రాచ రస్సుమ్ పియ పియ, బూలోకుమ్‍తె జితస మచ్చయి అస్తి” మెన సంగిలన్.
గని దూత అంక, “కిచ్చొక ఆచారిమ్ జతసి? జా తేర్‍బోదచి రిసొ, చి సత్తు బోడివొ దెస్సు కొమ్ముల్ తిలి, జా వెసిలొ జంతుచి రిసొచి గుట్టుచి అర్దుమ్ తుక సంగిందె.
పడ్తొ గట్టిఙ అవాడ్ కెరన కిచ్చొ మెన ఒర్స దిలొ మెలె, “వెల్లి బబులోను సేడ గెచ్చ అస్సె, సేడ గెచ్చ అస్సె. జా బూతల్ జితి టాన్ జా అస్సె; ఎత్కి వెట్కారుమ్‍చి బూతుమ్ రకితి టాన్, ఎత్కి గర్చి పిట్ట రకితి టాన్ జా అస్సె.
తెదొడి, సత్తుచొ ఏక్ దూత ఎక్కిలొ తిర్వేలిచి ఎదిలి జాడుచి ఏక్ పత్తురు ఉక్కుల, సముద్రుమ్‍తె గల కిచ్చొ మెన సంగిలన్ మెలె, “ఓ బబులోను వెల్లి పట్నుమ్, తుయి ఇసి డీస గలి జా అన్నె కెయ్యఁక కి డీసె నాయ్.
“జోచ తీర్పులు సిచ్చలు సత్తిమ్‍చ, సరిగచ. జేఁవ్‍చ లంజె కమొక ఒండి లోకుమ్‍క నాసెనుమ్ కెర్లి జా వెల్లి లంజెక జో తీర్పు కెర సిచ్చతె గల అస్సె, చి జోచ సేవ కెర్తసచి లొఁయి జా సువ దిలి రిసొచి సిచ్చ జో నెరవెర్సుప కెర అస్సె.” మెన కేక్ గల,
“అమ్‍చొ దేముడుచ సేవ కెర్తస ఎత్కిజిన్‍చ నిర్డెలె జోచి ముద్ర గల్తె ఎదక, బుఁయిక, సముద్రుమ్‍క, రుకాలె కిచ్చొ అల్లర్ కెర నాయ్!” మెన కేక్ గల్లొ.