ప్రకటన 1:18 - నొవ్వి ప్రమానుమ్18 ఆఁవ్ జీవ్ తిలొసొ జీవ్ దెతొసొ. ఆఁవ్ మొర్లయ్, గని అన్నె జీవ్ జా కెఁయఁక తెఁయఁక జివ్వి తయిందె, అన్నె మొర్నుక చి మొర్లస్‍క రకితి టాన్‍కచి తాలుమ్ అంచి అత్తి అస్సె. အခန်းကိုကြည့်ပါ။ |
నిజుమి, జో మాన్సు జెర్మున్ జలిస్‍క అవ్కు తతికయ్, సిలువతె జోక మార్ల, గని దేముడుచి సెక్తిక జో జీవ్ జా ఉట్ట జితయ్. అన్నె, జో తెన్ ఆమ్ కి అవ్కు అస్సుమ్, గని తుమ్‍క ‘చెంగిల్ జతు’ మెనయ్ అమ్ తుమ్‍క బుద్ది సంగుక సిచ్చ కెరుక మెలె, యేసుక జియడ్లొ దేముడుచి సెక్తికయ్ జర్గు కెరుమ్‍దే. క్రీస్తు తెన్ జయి సెక్తిక జితసుమ్.
జో పుత్తుస్‍తె దేముడుచి పరలోకుమ్‍చి ఉజిడి గవురుమ్ పూర్తి డీస్తయ్, చి నిజుమ్ దేముడు కీసొ అస్సె గే, పుత్తుసి కిచ్చొ నే పిట్తె దస్సొయి అస్సె. జో పుత్తుసి జోచి సెక్తి కోడుకయ్ లోకుమ్‍లు ఎత్కి కి జొయ్యి ఏలుప కెర్తయ్. అన్నె, పాపల్ పుంచి జతి మాన్సుల్ సుద్ది జతి వాటు జో తెయార్ కెర తా, పరలోకుమ్‍తె దేముడుచి ఉజెతొ పక్క వెసిలన్.
అన్నె దెకిలయ్, చి ఆదె! కిచ్చొ రంగుగె సంగుక నే బెదిలిసి రితొ ఏక్ గోడొ. జాతె వెసిలొసొచి నావ్, ‘మొర్ను’, చి మొర్లస్‍క రకితి లోకుమ్ జోచి పట్టి గెతయ్. అన్నె, ‘మొర్ను’ మెలొసొక చి మొర్లస రకితి లోకుమ్‍క కిచ్చొ సెలవ్ తిలి మెలె, యుద్దుమ్ వాట్, కకుర్తి వాట్, జబ్బుల్ వాట్ చి డొంగ్రెచ జంతువుల్ గెతి వాట్ మాన్సుల్‍క మార్తి సెలవ్ తిలి. ఒండి లోకుమ్‍క చెత్తర్ వాటల్ తిలె, జేఁవ్ చెత్తర్ వాటల్‍తె ఏక్ వాటతె మాన్సుల్‍క దస్సి మారుక సెలవ్ జా తిలి.