3 యేసు జోవయింక, “ఈంజొ పాపుమ్ కెర్లిసి నెంజె, అయ్యస్ అబ్బొస్ పాపుమ్ కెర్లిసి కి నెంజె. జలె, ఇన్నెక చెంగిల్ కెర్తిస్ తెన్ దేముడుచి గవురుమ్ జోచితె దెకయ్ జతి రిసొయి దస్సి జెర్మిలన్.
గుడ్డి జా తిల మాన్సుల్ దెకితతి, సొట్ట జా తిల మాన్సుల్ ఇండితతి, వెల్లి రోగుమ్ సేడ తిలస చెంగిల్ జా సుద్ది జతతి, బొయ్‍రొ జా తిల మాన్సుల్ సూన్‍తతి, మొర గెలస జీవ్ జతతి, సుబుమ్ కబుర్ బీద మాన్సుల్‍క సూనయ్‍తసి.
గని యేసు ఈంజ కబుర్ సూన, “ఈంజ జబ్బు సేడ్లిసి జో మొర్తి రిసొయి నాయ్, గని దేముడుచి నావ్ గవురుమ్ జతి రిసొయి, ఆఁవ్ జోచొ పుత్తుస్‍చి అదికారుమ్ దెకయ్‍తి రిసొయి” మెన, సిస్సుల్‍క సంగిలన్.
యేసు జాక “ఆఁవ్ తుక కిచ్చొ సంగిలయ్ గే, తుయి నంప తెన్ తిలెగిన, దేముడుచి గవురుమ్ సెక్తిచి రుజ్జు దెకితె.” మెన ఇదిల్ గోల కెర్లన్.
జోచి ఆతు తెంతొ అయి ఒడొయ్ జా అస్సె మెన జేఁవ్ మెలితే డిబ్బచ మాన్సుల్ దెక కెర, “ఒహొ, ఈంజొ మాన్సు అత్య కెర్తొసొ జా తయెదె. సముద్రుమ్‍తె నే మొర్లె కి, ఇన్నెచి పాపుమ్‍క మొరుక అస్సె, కిచ్చొగె” మెన సంగిల.
‘యేసుచి అదికారుమ్‍చి తెడి జో సొట్టొ మాన్సు చెంగిల్ జలొ’ మెన ప్రెజల్ ఎత్కిజిన్ దేముడుచి గవురుమ్ సంగితె తిల. జేఁవ్‍చి రిసొ, ‘జేఁవ్ దొగులక అమ్ సిచ్చ కెర్లె ప్రెజల్ అమ్‍క అల్లర్ కెరుల’ మెన కిచ్చొ సిచ్చ కెరుక నెత్ర కెర, ఎక్కి కోడ్‍కయ్ జోవయింక అన్నె బియఁడ కెర, వెల్లెల మాన్సుల్ జోవయింక విడ్దల్ కెర్ల.
దస్సి, దేముడు అమ్‍చి ఉప్పిరి ప్రేమ తిలిసి, అమ్‍చి ఉప్పిర్‍చి జోచి ప్రేమ, జానుమ్ నంపజా అస్సుమ్. దేముడు ప్రేమయి, చి కో ప్రేమయ్‍చి తెడి తత్తయ్ ప్రేమ ఇండితయ్ గే, దేముడుచి తెడి తత్తయ్, జోచి జీవ్‍కయ్ జితయ్, చి దేముడు జో మాన్సుచి పెట్టి తత్తయ్.
కిచ్చొతె దేముడుచి ప్రేమ డీస అమ్‍క రుజ్జు జలి మెలె, జో దేముడు జోచొ సొంత పుత్తుస్‍క ఈంజ లోకుమ్‍తె తెద్రయ్‍లన్. జో బలి జలిస్‍క అమ్‍చి పాపుమ్ గెచ్చవ పరలోకుమ్‍తె బెదితి జీవ్ అమ్‍క దెతి రిసొ.