2 తిమోతి 2:10 - నొవ్వి ప్రమానుమ్10 జాకయ్ దేముడు నిసాన్లసక ‘సూన నంపజా క్రీస్తు జలొ యేసుచి నావ్ తెన్ పాపుమ్ తెంతొ రచ్చించుప జా పరలోకుమ్‍తె గెచ్చ కెఁయఁక తెఁయఁక చెంగిల్ తత్తు’ మెనయ్, కిచ్చొ స్రెమల్ జలెకి ఆఁవ్ ఓర్సుప జతసి. အခန်းကိုကြည့်ပါ။ |
కీసి మెలె, కెద్ది గ్యానుమ్ కలుగు జలెకి, ఈంజ లోకుమ్‍చ మాన్సుల్ దేముడుక నేన్ల. ‘మాన్సుచి సొంత గ్యానుమ్ జోవయించి సొంత సెక్తిక జేఁవ్ నెతిర్లెకయ్ చెంగిలి’ మెన, జోచి పెట్టిచి గ్యానుమ్‍క దేముడు జానయ్ దస్సి జర్గు కెర్లన్. జాకయ్, అమ్ బోదన కెర్తి సుబుమ్ కబుర్ ‘గ్యానుమ్ నెంజె’ మెన జోవయించి సొంత సెక్తి మాన్సుల్ ఉచర్లె కి, జా సుబుమ్ కబుర్ తెయి మాన్సుల్‍క రచ్చించుప కెరుక జో దేముడు సర్ద జలొ. గని సుబుమ్ కబుర్ నంప కెర్తిస్‍క ‘తెలివి నాయ్’ మెన మాన్సుల్ సంగితతి.
ఆఁవ్ జలె, ‘తుమ్‍క లాబుమ్ దొర్కు జవుస్’ మెన ఆఁవ్ అల్లర్ సేడ్లె కి, అంక సర్ద. కిచ్చొక మెలె, ఆఁవ్ ఇస అల్లర్ సేడ్తిసి కీసి జతయ్ మెలె, క్రీస్తు సేడ్ల అల్లర్‍తె ఆఁవ్ బెద ఒత్త సేంసిలిసి ఆఁవ్ ఓర్సుప జా కుట్టయ్‍లి రితి జతయ్. కిచ్చొక మెలె, జోచి ఆఁగ్ జల జోచయ్ సంగుమ్‍క ‘జోచి కబుర్ సూన్‍తు’ మెనయ్, ఆఁవ్ ఈంజేఁవ్ స్రెమల్ సేడ్తసి.
తుమ్‍తె తెద్రయిందె మెన యూదుల్‍క దేముడు సంగ తిలొ దొర్కు జలొ రచ్చించుప కెర్తొసొ జలొ క్రీస్తు, ఉజిడ్ తిలి గవురుమ్‍చి ఆస తుమ్ యూదుల్ నెంజిలసచి పెట్టి కి అస్సె. పరలోకుమ్‍తె గెతి వరుమ్‍చి దయిరిమ్ తుమ్‍కయ్ కి దొర్కు కెర అస్సె. జయ్యి కోడు జోచి గుట్టు జా తిలి. జా రచ్చన కెత్తిజిన్ యూదుల్ నెంజిలసక కెద్ది సొమ్సారుమ్ కెర్తయ్! కెద్ది వెల్లి కోడు, ఈంజ. జయ్యి గుట్టు జోచయ్ జల మాన్సుల్‍కయ్ జో జానవుక ఇస్టుమ్ జలొ!
ప్రేమ తిలొ అంక పుత్తు జలొ రితొ తిమోతిక, దేముడుచి సెలవ్‍చి రిసొ యేసుక్రీస్తుచి రిసొ సుబుమ్ కబుర్ కామ్ కెర్తి రిసొ జోచొ బారికి జలొ ఆఁవ్ పవులు రెగిడ్లి ఉత్రుమ్. “అంచొ పుత్తు జలొ యేసుక్రీస్తుక కో నంపజవుల గే, జేఁవ్ పరలోకుమ్‍చి రాజిమ్‍తె బెద, మొర్లె అంచి తెన్ జింక ఆఁవ్ వరుమ్ దెతసి” మెన ప్రమానుమ్ కెలొ దేముడు అంక జోవయించి కామ్‍క నిసాన అదికారుమ్ దా అస్సె. జలె, దేముడు అబ్బొస్‍చి అమ్‍క ప్రబు జలొ క్రీస్తు జలొ యేసుచి దయ కన్కారుమ్ సేంతుమ్ తుచి ఉప్పిరి తవుస్!