Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెఫన్యా 1:18 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేకపోతాయి. రోషాగ్నిచేత భూమంతా దహనం అవుతుంది. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వ నాశనం చేయబోతున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 యెహోవా ఉగ్రతదినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వనాశనము చేయబోవుచున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

18 వారి బంగారం, వెండి వారికి యెహోవా ఉగ్రత దినంలో సహాయం చేయవు! ఆ సమయంలో యెహోవా చాలా చికాకుపడి కోపంగా ఉంటాడు. యెహోవా మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. భూమిమీద ప్రతి ఒక్కరినీ యెహోవా సర్వనాశనం చేస్తాడు!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేవు.” ఆయన రోషాగ్ని చేత లోకమంతా దగ్దమవుతుంది, ఆయన హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 యెహోవా ఉగ్రత దినాన వారి వెండి బంగారాలు వారిని తప్పించలేవు.” ఆయన రోషాగ్ని చేత లోకమంతా దగ్దమవుతుంది, ఆయన హఠాత్తుగా భూనివాసులందరినీ సర్వనాశనం చేయబోతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెఫన్యా 1:18
40 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాబట్టి యెహోవా “నేను సృష్టించిన మనుషులను ఈ భూమిమీద లేకుండా చేస్తాను. మనుషులతో పాటు జంతువులను, పాకే జీవులను, ఆకాశపక్షులను భూమిమీద లేకుండా తుడిచి వేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను” అన్నాడు.


యూదావారు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు. తమ పూర్వీకులకంటే ఎక్కువ పాపం చేస్తూ ఆయనకు రోషం పుట్టించారు.


ఆ విషయాలేమిటంటే, ఆపద కలిగిన రోజున దుర్మార్గులు తప్పించుకుంటారు. ఉగ్రత దిగి వచ్చే రోజున వాళ్ళు దాని నుండి పక్కకు తొలగించబడతారు.


బంగారం సంపాదించుకుని, తమ ఇంటినిండా వెండిని నింపుకున్న అధికారుల్లాగా నేను కన్నుమూసి ఉండేవాణ్ణి.


వారు ఉన్నత స్థలాల్లో దేవస్థానాలు నిలిపి ఆయనకు కోపం పుట్టించారు. విగ్రహాలు నిలబెట్టి ఆయనకు రోషం కలిగించారు.


యెహోవా, ఎంతకాలం నీకు మా మీద కోపం? నీ కోపం శాశ్వతంగా ఉంటుందా? నీ రోషం ఎంతకాలం మంటలాగా మండుతూ ఉంటుంది?


దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు ఉపయోగపడవు. నీతిమంతులు మరణం నుండి తప్పించు కుంటారు.


ధనవంతుడి ఆస్తి అతనికి దిట్టమైన కోట. అది పటిష్టమైన ప్రాకారం అని అతని భ్రమ.


కాబట్టి ప్రభువూ, ఇశ్రాయేలు బలిష్టుడూ, సైన్యాల అధిపతీ అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. “వాళ్లకు బాధ! నా విరోధులపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నా శత్రువుల మీద నేను పగ తీర్చుకుంటాను.


ఇశ్రాయేలు దేవుని వెలుగు ఒక అగ్ని అవుతుంది. దాని పరిశుద్ధ దేవుడు ఒక జ్వాల అవుతాడు. అది అష్షూరు దేశపు బలురక్కసి చెట్లకూ, గచ్చపొదలకూ అంటుకుని ఒక్క రోజులో వాటిని మింగేస్తుంది.


తీర్పు రోజున, దూరం నుంచి వచ్చే నాశనదినాన మీరేం చేస్తారు? సాయం కోసం ఎవరి దగ్గరికి పారిపోతారు? మీ ఐశ్వర్యం ఎక్కడ ఉంచుతారు?


కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం మీదా, ఈ మనుషుల మీదా, జంతువుల మీదా, పొలాలమీదా, చెట్ల మీదా, పంటల మీదా నా కోపాన్ని, నా ఉగ్రతను కుమ్మరిస్తాను. అది ఎన్నటికీ ఆరదు, మండుతూనే ఉంటుంది.


ఈ దేశం తప్పకుండా పాడైపోతుంది. యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో ఆనంద ధ్వనులు, కేరింతలు, పెళ్ళికొడుకు, పెళ్ళికూతుళ్ళ స్వరాలు వినబడకుండా చేస్తాను.”


యెరూషలేమును పాడుదిబ్బగా నక్కల నివాసంగా చేస్తాను. యూదా పట్టణాలను ఎవరూ నివసించలేకుండా పాడు చేస్తాను.


నువ్వు చేసిన వ్యభిచారాన్ని బట్టి, నువ్వు చిందించిన రక్తాన్ని బట్టి నా కోపంతో నా రోషంతో కూడిన రక్తపాతం నీ మీదకు తెప్పిస్తాను.


ఉగ్రతతో వాళ్ళు నిన్ను శిక్షించేలా నా కోపం నీకు చూపిస్తాను. వాళ్ళు నీ ముక్కూ, చెవులూ కోస్తారు. నీలో మిగిలిన వాళ్ళు కత్తివాత పడి చస్తారు. నీ సంతానం అగ్నికి ఆహుతి అయ్యేలా, నీ కొడుకులనూ, నీ కూతుళ్ళనూ వాళ్ళు బందీలుగా పట్టుకుంటారు.


బలాత్కారం ప్రారంభం అయి దుర్మార్గులను శిక్షించే దండం అయింది. వాళ్ళలో గానీ, వాళ్ళ మూకలో గానీ ఎవరూ మిగలరు. వాళ్ళ సంపదలో గానీ, వాళ్ళ ప్రాముఖ్యతలో గానీ ఏదీ మిగలదు.


వాళ్ళు తమ దగ్గర ఉన్న వెండిని వీధుల్లో పారేస్తారు. బంగారం వాళ్లకి వ్యర్ధపదార్ధంలా ఉంటుంది. యెహోవా కోప దినాన వెండిబంగారాలు వాళ్ళను కాపాడలేవు. వాళ్ళ దోషం పెను ఆటంకంగా ఉంటుంది గనక వాళ్ళ జీవితాలకు రక్షణ ఉండదు. వాళ్ళ కడుపులకు పోషణ ఉండదు.


ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. వినాశనం! వినాశనం వెనుకే మరో వినాశనం. చూడండి! అది వచ్చేస్తూ ఉంది.


కనానీయులంతా నాశనమయ్యారు. డబ్బు సమకూర్చుకున్న వారందరూ నిర్మూలమైపోయారు. కాబట్టి మక్తేషు లోయ నివాసులారా, విలపించండి.


ఆ దినం ఉగ్రత దినం. బాధ, ఉపద్రవం మహానాశనం కమ్ముకు వచ్చే దినం. అంధకారం, మసక కమ్మే రోజు. మేఘాలు ముసిరి గాఢాంధకారం పొదిగే రోజు.


విధి నిర్ణయం కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే, మిమ్మల్ని శిక్షించడానికి యెహోవా ఉగ్రత దినం రాకమునుపే కూడి రండి.


కాబట్టి యెహోవా సెలవిచ్చేవాక్కు ఏమంటే, “నా కోసం ఎదురు చూడండి. నేను లేచి ఎర పట్టుకునే దినం కోసం కనిపెట్టి ఉండండి. నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటినీ వారిపై కుమ్మరించడానికి, అన్యజనులను పోగు చేయడానికి, గుంపులు గుంపులుగా రాజ్యాలను సమకూర్చడానికి, నేను నిశ్చయించుకున్నాను. నా రోషాగ్ని చేత భూమంతా కాలిపోతుంది.


ఒక మనిషి ఈ ప్రపంచమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికేం లాభం? తన ప్రాణానికి బదులుగా మనిషి దేనిని ఇవ్వగలడు?


ప్రభువుకు రోషం కలిగిస్తామా? మనం ఆయనకంటే బలవంతులమా?


అప్పుడు వారిమీద నా కోపం రేగుతుంది. నేను వాళ్ళని వదిలిపెడతాను. వారికి నా ముఖం చాటు చేస్తాను. వాళ్ళు నాశనమైపోతారు. ఎన్నో విపత్తులూ కష్టాలూ వాళ్లకు సంభవిస్తాయి. ఆ సమయంలో వాళ్ళు, మన దేవుడు మన మధ్య లేనందువల్లనే మనకు ఈ విపత్తులు వచ్చాయి గదా! అనుకుంటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ