జెఫన్యా 1:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఆ రోజుల్లో నేను దీపాలు చేబూని యెరూషలేమును గాలిస్తాను. పేరుకుపోయిన మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసం లాంటివారై “యెహోవా మేలుగానీ కీడుగానీ చేసేవాడు కాడు” అని మనస్సులో అనుకొనే వారిని శిక్షిస్తాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారై–యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షింతును. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్12 “ఆ సమయంలో నేను దీపం పట్టుకొని యెరూషలేము అంతటా వెదకుతాను. వారి ఇష్టానుసారంగా జీవిస్తూ తృప్తిపడుతోన్న మనుష్యులందరినీ నేను కనుగొంటాను. ఆ ప్రజలు, ‘యెహోవా ఏమీ చేయడు. ఆయన సహాయం చేయడు, ఆయన బాధించడు’ అని అంటారు. అలాంటి వారిని నేను కనుగొని, వారిని శిక్షిస్తాను! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ఆ కాలంలో నేను దీపాలు పట్టుకుని యెరూషలేమును సోదా చేస్తాను, మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసం లాంటివారై ‘యెహోవా మేలు గాని కీడు గాని ఏదీ చేయడు’ అనుకుంటూ, ఆత్మసంతృప్తితో ఉన్నవారిని నేను శిక్షిస్తాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ఆ కాలంలో నేను దీపాలు పట్టుకుని యెరూషలేమును సోదా చేస్తాను, మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసం లాంటివారై ‘యెహోవా మేలు గాని కీడు గాని ఏదీ చేయడు’ అనుకుంటూ, ఆత్మసంతృప్తితో ఉన్నవారిని నేను శిక్షిస్తాను. အခန်းကိုကြည့်ပါ။ |