Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 7:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 మీరు ఆహారం తీసుకున్నప్పుడు స్వప్రయోజనానికే గదా తీసుకున్నారు? మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనానికే గదా పానం చేశారు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే గదా పుచ్చుకొంటిరి; మీరు పానము చేసి నప్పుడు స్వప్రయోజనమునకే గదా పానము చేసితిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 మరియు మీరు తినటం, తాగటం కూడ నా కొరకేనా? కాదు! అది మీ మంచి కొరకు మాత్రమే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 మీరు తినేటప్పుడు త్రాగేటప్పుడు కేవలం మీ కోసం మాత్రమే విందు చేసుకోలేదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 మీరు తినేటప్పుడు త్రాగేటప్పుడు కేవలం మీ కోసం మాత్రమే విందు చేసుకోలేదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 7:6
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ రోజు వాళ్ళు యెహోవా సన్నిధిలో ఎంతో సంతోషంతో అన్నపానాలు పుచ్చుకున్నారు. దావీదు కొడుకు సొలొమోనుకు రెండో సారి పట్టాభిషేకం చేసి, యెహోవా సన్నిధిలో అతన్ని పరిపాలకుడిగా, సాదోకును యాజకునిగా, అభిషేకించారు.


దహనబలుల కోసం నీ గొర్రెల్నీ మేకల్నీ నా దగ్గరికి తేలేదు. బలులర్పించి నన్ను ఘనపరచలేదు. నైవేద్యాలు చేయాలని నేను నీపై భారం మోపలేదు. ధూపం వేయమని నిన్ను విసిగించలేదు.


“మేమెందుకు ఉపవాసమున్నాం? నువ్వెందుకు చూడవు? మమ్మల్ని మేము ఎందుకు తగ్గించుకున్నాం? నువ్వు గమనించలేదు” అని వాళ్ళు అంటారు. మీ ఉపవాస దినాన మీరు మీకిష్టం వచ్చినట్టు చేస్తూ మీ పనివాళ్ళను కఠినంగా చూస్తారు.


నాకు అర్పించిన పశువుల విషయానికి వస్తే, వారు వాటిని వధించి ఆ మాంసం వారే తింటారు. అలాటి బలులను నేను, అంటే యెహోవాను అంగీకరించను. వారి దోషాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తాను. వారు మళ్లీ ఐగుప్తుకు వెళ్లవలసి వస్తుంది.


యెహోవాకు ద్రాక్షారస పానార్పణం అర్పించరు. వారు అర్పించేవి ఆయనకి ఇష్టం లేదు. వారు ఆహారంగా పుచ్చుకొనేది ప్రలాపం చేసేవారి ఆహారం వలే ఉంటుంది. దాన్ని తినే వారంతా అపవిత్రులైపోతారు. వారి ఆహారం వారికే సరిపోతుంది. అది యెహోవా మందిరంలోకి రాదు.


“దేశప్రజలందరికీ, యాజకులకు నీవీ మాట తెలియజేయాలి. జరిగిన ఈ డెబ్భై సంవత్సరాలు ఏటేటా ఐదవ నెలలో ఏడవ నెలలో మీరు ఉపవాసం ఉండి దుఃఖపడుతూ వచ్చారుగదా? నా పట్ల భక్తితోనే ఉపవాసం ఉన్నారా?


యెరూషలేములోనూ, దాని చుట్టూ ఉన్న పట్టణాల్లోనూ దక్షిణ దేశంలోనూ, పడమటి మైదాన భూముల్లోను ప్రజలు విస్తరించి క్షేమంగా ఉన్న కాలంలో పూర్వపు ప్రవక్తల ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీరు మనస్సుకు తెచ్చుకో లేదు గదా?”


కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి.


అక్కడే మీరు, మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఇచ్చిన మీ కుటుంబాలు యెహోవా సన్నిధిలో భోజనం చేసి మీ పనులన్నిటిలో సంతోషించాలి.


ఎద్దులు, గొర్రెలు, ద్రాక్షారసం, మద్యం, వీటిలో మీరు కోరిన దానికి ఆ వెండిని ఇచ్చి, అక్కడ మీ దేవుడు యెహోవా సన్నిధిలో భోజనం చేసి, మీరు, మీ ఇంటివారు, మీ ఇంట్లో ఉండే లేవీయులు సంతోషించాలి.


మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.


అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు. “అతడి అందాన్నీ ఎత్తునూ చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతణ్ణి నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గానీ యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ