Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 14:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఆ రోజున వెలుగు ఉండదు. ప్రకాశించేవన్నీ మసకబారిపోతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 ఆ యెహోవా, దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6-7 అది ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజున వెలుతురుగాని, చలిగాని, మంచుగాని వుండవు. అప్పుడు పగలూ వుండదు, రాత్రీ వుండదు. అది ఎట్లాగో యెహోవా ఒక్కనికే తెలుసు. అప్పుడు మామూలుగా చీకటి పడేటప్పడు ఇంకా కొంత వెలుతురు ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 ఆ రోజున సూర్యకాంతి ఉండదు, చలి ఉండదు, చీకటి ఉండదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 ఆ రోజున సూర్యకాంతి ఉండదు, చలి ఉండదు, చీకటి ఉండదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 14:6
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

యథార్థవంతులకు చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. వారు కృపాభరితులు, దయాపరులు, న్యాయవంతులు.


ఆకాశ నక్షత్రాలు, నక్షత్రరాసులు తమ వెలుగును ఇయ్యవు. ఉదయం నుంచే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు ప్రకాశించడు.


చంద్రుడు వెలవెలబోతాడు. సూర్య బింబం మారిపోతుంది. సేనల ప్రభువైన యెహోవా సీయోను కొండ మీదా యెరూషలేములో రాజవుతాడు. పెద్దల ఎదుట ఆయన ప్రభావం కనబడుతుంది.


మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినే వాడెవడు? వెలుగు లేకుండా చీకటిలో నడిచేవాడు యెహోవా నామాన్ని ఆశ్రయించి ఆయన్ని నమ్ముకోవాలి.


నేను భూమిని చూశాను. అది ఆకారం కోల్పోయి శూన్యంగా ఉంది. ఆకాశాన్ని చూశాను, అక్కడ వెలుగు లేదు.


నేను నీ దీపాన్ని ఆర్పివేసినప్పుడు ఆకాశాన్ని మూసేసి, నక్షత్రాలను చీకటి చేస్తాను. సూర్యుణ్ణి మబ్బుతో కమ్ముతాను. చంద్రుడు వెన్నెల ఇవ్వడు.


నిన్నుబట్టి ఆకాశంలో ప్రకాశించే జ్యోతులన్నిటినీ చీకటి చేస్తాను. నీ దేశం మీద చీకటి కమ్ముతుంది.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.


యెహోవాను తెలుసుకుందాం రండి. యెహోవాను తెలుసుకోడానికి తీవ్ర ప్రయత్నం చేద్దాం. ఆయన్ని అనుసరించుదాము రండి. పొద్దు పొడవడం ఎంత కచ్చితమో ఆయన రావడం అంత కచ్చితం. వర్షం చినుకుల్లాగా భూమిని తడిపే తొలకరి వర్షంలాగా ఆయన మన దగ్గరికి వస్తాడు.


అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు. కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు. పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు బలమైన గొప్ప సేన వస్తూ ఉంది. అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు. తరతరాల తరువాత కూడా అది ఉండదు.


ఆకాశంలో అద్భుతాలు చూపిస్తాను. భూమ్మీద రక్తం, మంటలు, ఎత్తయిన పొగ కలిగిస్తాను.


యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి.


ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది. చీకటి ఆ వెలుగును లొంగదీసుకోలేక పోయింది.


నాలో నమ్మకం ఉంచేవాడు చీకట్లో ఉండిపోకూడదని, ఈ లోకంలోకి నేను వెలుగుగా వచ్చాను.


యోవేలు ప్రవక్త చెప్పిన సంగతి ఇదే,


పైన ఆకాశంలో మహత్కార్యాలనూ కింద భూమ్మీద సూచకక్రియలనూ రక్తం, అగ్ని, పొగ, ఆవిరినీ చూపిస్తాను.


వెలుగు నివాసులుగా తనకోసం ప్రత్యేకించబడిన వారి వారసత్వంలో భాగం పంచుకోడానికి మనలను అర్హులుగా చేసిన తండ్రికి మీరు సంతోషంతో కృతజ్ఞతలు చెల్లించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.


ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్కు మనకు ఉంది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వాక్కు చీకట్లో వెలుగు ఇచ్చే దీపంలా ఉంది. ఆ వెలుగును మీరు లక్ష్యపెడితే మీకు మేలు.


ఏడవ దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలు ఇలా పలికాయి, “ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యమూ, ఆయన క్రీస్తు రాజ్యమూ అయింది. ఆయన యుగయుగాలు పరిపాలన చేస్తాడు.”


“నా ఇద్దరు సాక్షులు గోనెపట్ట కట్టుకుని 1, 260 రోజులు దేవుని మాటలు ప్రకటించడానికి వారికి అధికారం ఇస్తాను.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ