Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 14:18 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 ఐగుప్తీయుల కుటుంబాలవారు బయలు దేరకుండా, రాకుండా ఉన్నట్టయితే వారికి వాన కురవకుండా పోతుంది. పర్ణశాల పండగ ఆచరించడానికి రాని ఇతర దేశాల ప్రజలను యెహోవా తాను నియమించిన తెగుళ్ళతో హింసిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 ఐగుప్తీయుల కుటుంబపువారు బయలుదేరకయు రాకయు ఉండినయెడల వారికి వర్షము లేకపోవును, పర్ణశాలలపండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవావారిని మొత్తును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

18 ఈజిప్టు (ఐగుప్తు) నుండి ఏ వంశంవారైనా పర్ణశాలల పండుగ జరుపుకోటానికి రాకపోయినట్లయితే, యెహోవా శత్రు దేశాలకు సంభవింపజేసిన ఆ భయంకర వ్యాధి వారికి సోకేలా చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 ఒకవేళ ఈజిప్టు కుటుంబాలు బయలుదేరి వెళ్లి పాల్గొనకపోతే వారికి వర్షం ఉండదు. గుడారాల పండుగ ఆచరించడానికి రాని దేశాలకు యెహోవా నియమించిన తెగులును ఆయన వారికి సోకేలా చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 ఒకవేళ ఈజిప్టు కుటుంబాలు బయలుదేరి వెళ్లి పాల్గొనకపోతే వారికి వర్షం ఉండదు. గుడారాల పండుగ ఆచరించడానికి రాని దేశాలకు యెహోవా నియమించిన తెగులును ఆయన వారికి సోకేలా చేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 14:18
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

నిన్ను సేవించడానికి నిరాకరించే ప్రజలు గానీ రాజ్యం గానీ నాశనం అవుతుంది. ఆ రాజ్యాలు తప్పకుండా నాశనం అవుతాయి.


ప్రతి నెలా ప్రతి విశ్రాంతిరోజున నా ముందు సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రజలంతా వస్తారు” అని యెహోవా చెబుతున్నాడు


“నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఈ ఏడో నెల పదిహేనో దినం మొదలు ఏడు దినాలు యెహోవాకు పర్ణశాలల పండగ జరపాలి.


యాకోబు సంతానంలో మిగిలినవారు రాజ్యాల మధ్య, అనేక ప్రజల మధ్య అడవి జంతువుల్లోని సింహం లాగా, గొర్రెల మందల్లోని కొదమ సింహం లాగా ఉంటారు. అది మందల్లో దూరి వాటిని తొక్కుతూ వాటిని చీల్చేస్తుంది.


యెహోవా యెరూషలేముపై దండెత్తి యుద్ధం చేసిన ప్రజలపై తెగుళ్లు రప్పించి వాళ్ళను హింసిస్తాడు. ఆ ప్రజలు నిలబడి ఉండగానే వారి శరీరాలు కుళ్లిపోతాయి. వారి కళ్ళు వాటి కుహరాల్లోనే కుళ్లిపోతాయి. వారి నాలుకలు వారి నోళ్లలోనే కుళ్లిపోతాయి.


అదే విధంగా గుర్రాల మీదా, కంచర గాడిదల మీదా, ఒంటెల మీదా, గాడిదల మీదా, మందలో ఉన్న పశువులన్నిటి మీదా తెగుళ్లు వచ్చి పడతాయి.


ఐగుప్తీయులకు, పర్ణశాల పండగ ఆచరించడానికి రాని ఇతర దేశాల ప్రజలందరికీ సంభవించబోయే శిక్ష ఇదే.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ