Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 11:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 కనుక “నేను ఇకపై మీకు కాపరిగా ఉండను. చావబోయేవారు చనిపోవచ్చు, నాశనం అయ్యేవారు నశించిపోవచ్చు. మిగిలిన వారు ఒకరి శరీరం ఒకరు తినవచ్చు” అని చెప్పాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 కాబట్టి నేనికను మిమ్మును కాపుకాయను; చచ్చునది చావవచ్చును, నశించునది నశింపవచ్చును, మిగిలినవి యొకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 అప్పుడు నేను ఇలా అన్నాను: “నేను వదిలి వేస్తాను! నేను మిమ్మల్ని గురించి శ్రద్ధ తీసుకోను! చావు కోరేవారిని నేను చనిపోనిస్తాను. నాశనమైపోవాలని కోరుకొనేవారిని నేను నాశనం కానిస్తాను. ఇంకా మిగిలినవారు ఒకరినొకరు నాశనం చేసుకుంటారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 “నేను మీ కాపరిగా ఉండను. చచ్చేవారు చావవచ్చు, నశించేవారు నశించవచ్చు. మిగిలి ఉన్నవారు ఒకరి మాంసాన్ని ఒకరు తింటే తినవచ్చు” అన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 “నేను మీ కాపరిగా ఉండను. చచ్చేవారు చావవచ్చు, నశించేవారు నశించవచ్చు. మిగిలి ఉన్నవారు ఒకరి మాంసాన్ని ఒకరు తింటే తినవచ్చు” అన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 11:9
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

వాళ్ళు తమ కొడుకుల, కూతుళ్ళ శరీరాలను తినేలా చేస్తాను. తమ ప్రాణం తీయాలని చూసే శత్రువులు ముట్టడి వేసి బాధించే కాలంలో వాళ్ళు ఒకరి శరీరాన్ని ఒకరు తింటారు.


ఈ ప్రజలు గానీ ప్రవక్త గానీ యాజకుడు గానీ నిన్ను “యెహోవా సందేశం ఏమిటి?” అని అడిగితే నువ్వు వారితో ఇలా చెప్పు. “ఏ సందేశం? నేను మిమ్మల్ని వదిలేశాను.” ఇది యెహోవా సందేశం.


కాబట్టి నేను మిమ్మల్ని ఏరి నా దగ్గర నుంచి పారవేస్తాను. మీకూ మీ పూర్వీకులకూ నేనిచ్చిన పట్టణాన్నీ పారవేస్తాను.


అతడు వచ్చి ఐగుప్తు పై దాడి చేస్తాడు. చావుకు నిర్ణయమైన వాళ్ళు చనిపోతారు. బందీలుగా వెళ్ళడానికి నిర్ణయమైన వాళ్ళు బందీలుగా వెళ్తారు. కత్తి మూలంగా చావడానికి నిర్ణయమైన వాళ్ళు కత్తి మూలంగానే చనిపోతారు.


దాని మూలంగా మీలో తండ్రులు తమ పిల్లలను తింటారు. కొడుకులు తమ తండ్రులను తింటారు. నా తీర్పును నేను అమలు పరుస్తాను. మీలో మిగిలిన వాళ్ళందరినీ నలు దిక్కులకూ చెదరగొడతాను.


నా ప్రజలు అజ్ఞానం వల్ల నశిస్తున్నారు. ఎందుకంటే వారు జ్ఞానాన్ని తిరస్కరించారు. నాకు యాజకుడివి కాకుండా నేను కూడా నిన్ను తోసిపుచ్చుతాను. ఎందుకంటే నీవు నీ దేవుడినైన నా చట్టాన్ని విస్మరించావు. నీ పిల్లలను కూడా నేను పట్టించుకోను.


దేశమంతటిలో మూడింట రెండు వంతులవారు నశిస్తారు. మూడవ భాగం మిగిలి ఉంటారు.


వారి జోలికి వెళ్ళవద్దు. వారు గుడ్డివారు. వేరే గుడ్డివారికి దారి చూపించడానికి ప్రయత్నిస్తారు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా” అన్నాడు.


అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూరు చెట్టును చూశాడు. ఆయన దాని దగ్గరికి వెళ్ళి చూస్తే, దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆయన దానితో, “ఇక ముందు నీవు ఎప్పటికీ కాపు కాయవు!” అన్నాడు. వెంటనే ఆ అంజూరు చెట్టు ఎండిపోయింది.


“కాబట్టి దేవుని రాజ్యాన్ని మీ నుండి తీసివేసి, దాని ఫలాలను తిరిగి ఇచ్చే ప్రజలకు ఇస్తారు అని మీతో చెబుతున్నాను.


అప్పుడు యేసు వారితో, “వెలుగు మీ మధ్య ఉండేది ఇంకా కొంత కాలం మాత్రమే. చీకటి మిమ్మల్ని కమ్ముకోక ముందే, ఇంకా వెలుగు ఉండగానే, నడవండి. చీకట్లో నడిచే వాడికి, తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికే తెలియదు.


మరోసారి ఆయన, “నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళాక మీరు నాకోసం వెతుకుతారు. కానీ మీ పాపాల్లోనే మీరు మరణిస్తారు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు” అని వారితో చెప్పాడు.


కాబట్టి మీరు మీ పాపాల్లోనే మరణిస్తారని చెప్పాను. ఎందుకంటే నేనే ఆయననని మీరు నమ్మకపోతే మీరు మీ పాపాల్లోనే మరణిస్తారు” అని వారితో చెప్పాడు.


అన్యాయం చేసేవాణ్ణి అన్యాయం చేస్తూనే ఉండనియ్యి. అపవిత్రుణ్ణి ఇంకా అపవిత్రుడిగానే ఉండనియ్యి. నీతిమంతుణ్ణి ఇంకా నీతిమంతుడిగానే ఉండనియ్యి. పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధుడిగా ఉండనియ్యి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ