Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 11:16 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 ఎందుకంటే నేను దేశంలో ఒక కాపరిని నియమించబోతున్నాను. అతడు నశించిపోయే గొర్రెలను లక్ష్యపెట్టడు. చెదరిపోయిన వాటిని వెదకడు. గాయపడిన వాటిని బాగుచేయడు. ఆరోగ్యంగా ఉన్నవాటిని పోషించడు. అయితే కొవ్విన వాటి డెక్కలు చీల్చి వాటి మాంసం తింటూ ఉంటాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 ఏలయనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోవుచున్నాను; అతడు నశించుచున్న గొఱ్ఱెలను కనిపెట్టడు, చెదరిపోయినవాటిని వెదకడు, విరిగిపోయినదాని బాగుచేయడు, పుష్టిగా ఉన్నదాని కాపుకాయడు గాని క్రొవ్వినవాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునియలగా చేయుచుండును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 ఈ దేశానికి ఒక కొత్త కాపరిని నేను తెస్తానని ఇది చూపుతుంది. కాని ఈ యువకుడు నాశనం కాబడుతున్న గొర్రెలపట్ల జాగ్రత్త తీసుకోలేడు. గాయపడిన గొర్రెలను అతడు బాగు చేయలేడు. బతికివున్న వాటికి అతడు గ్రాసం ఇవ్వలేడు. ఆరోగ్యంగా ఉన్నవి పూర్తిగా తినబడతాయి. కేవలం వాటి గిట్టలు మాత్రం వదిలివేయబడతాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 ఎందుకంటే ఈ దేశంలో నేను నియమించబోయే కాపరి తప్పిపోయిన వాటిని పట్టించుకోడు, పిల్లలను వెదకడు, గాయపడ్డ వాటిని బాగు చేయడు, ఆరోగ్యకరమైన వాటిని పోషించడు, కాని క్రొవ్విన వాటి డెక్కలు చీల్చి వాటి మాంసాన్ని తింటాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 ఎందుకంటే ఈ దేశంలో నేను నియమించబోయే కాపరి తప్పిపోయిన వాటిని పట్టించుకోడు, పిల్లలను వెదకడు, గాయపడ్డ వాటిని బాగు చేయడు, ఆరోగ్యకరమైన వాటిని పోషించడు, కాని క్రొవ్విన వాటి డెక్కలు చీల్చి వాటి మాంసాన్ని తింటాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 11:16
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఈ ఇరవై సంవత్సరాలూ నేను నీ దగ్గర ఉన్నాను. నీ గొర్రెలైనా మేకలైనా ఏవీ పిల్లలు కనకుండా పోలేదు, నీ మంద పొట్టేళ్ళను దేనినీ నేను తినలేదు.


అతడు “నాదగ్గర ఉన్న పిల్లలు పసిపిల్లలనీ, గొర్రెలు, మేకలు, పశువులు పాలిచ్చేవి అని నా ప్రభువుకు తెలుసు. ఒక్క రోజే వాటిని వేగంగా తోలితే ఈ మంద అంతా చస్తుంది.


ఒక గొర్రెల కాపరిలాగా ఆయన తన మందను మేపుతాడు. తన చేతులతో గొర్రెపిల్లలను ఎత్తి రొమ్మున ఆనించుకుని మోస్తాడు. పాలిచ్చే గొర్రెలను ఆయన నెమ్మదిగా నడిపిస్తాడు.


ఇశ్రాయేలు దేవుడు యెహోవా తన ప్రజలను మేపే కాపరులను గురించి ఇలా చెబుతున్నాడు. “మీరు నా గొర్రెలను చెదరగొట్టి వెళ్ళగొట్టారు. మీరు వాటిని అసలేమీ పట్టించుకోలేదు. మీరు చేసిన చెడ్డ పనులను బట్టి మిమ్మల్ని శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు.


ఒకవేళ వాళ్ళు నా సలహా మండలిలో నిలబడి ఉంటే, వాళ్ళు నా మాటలు నా ప్రజలకు తెలియజేసే వాళ్ళే. వాళ్ళ చెడ్డ మాటల నుంచి, వాళ్ళ దుర్మార్గపు అలవాట్ల నుంచి వాళ్ళను తప్పించి ఉండే వాళ్ళే.”


“యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నా జీవం తోడు. నేను ఆ కాపరులకు విరోధినయ్యాను. నా గొర్రెలను గురించి వారి దగ్గర లెక్క అడుగుతాను. వారిక గొర్రెలు మేపడం మాన్పిస్తాను. కాపరులు తమ కడుపు నింపుకోకుండేలా చేస్తాను. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట్లో నుంచి వాటిని తప్పిస్తాను.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.


“తప్పిపోయిన వాటిని నేను వెదకుతాను. తోలివేసిన వాటిని మళ్ళీ తీసుకొస్తాను. గాయపడిన వాటికి కట్టుకడతాను. బలంలేని వాటికి బలం కలిగిస్తాను. అయితే కొవ్విన వాటినీ బలంగా ఉన్న వాటినీ నాశనం చేస్తాను. మందను న్యాయంతో కాస్తాను.


మీరు భుజాలతో పక్కతో తోస్తూ ఉంటే, నీరసించిపోయిన వాటన్నిటినీ కొమ్ములతో పొడుస్తూ చెదరగొట్టేస్తున్నారు.


ఆ రాజు ఇష్టానుసారముగా ప్రవర్తిస్తాడు. తన్ను తానే హెచ్చించుకుంటూ, విర్రవీగుతూ దేవాధిదేవునికి వ్యతిరేకంగా నిర్ఘాంతపోయేలా చేసే మాటలు వదరుతాడు. ఉగ్రత ముగిసే దాకా అతడు వర్ధిల్లుతాడు. ఆపైన జరగవలసింది జరుగుతుంది.


మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ