Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 10:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 ఆ వంశంలో నుంచి మూలరాయి పుడుతుంది. గుడారపు మేకు, యుద్ధ ధనుస్సు వారి నుండి పుడతాయి. యుద్ధ నేర్పు గలవాడు వారిలో నుండి పుడతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 వారిలోనుండి మూల రాయి పుట్టును, మేకును యుద్ధపువిల్లును వారిచేత కలుగును, బాధించువాడు వారిలోనుండి బయలుదేరును,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 “పునాదిరాయి, గుడారపు గుంజ, యుద్ధ విల్లు, ముందుకు చొచ్చుకువచ్చే సైన్యం అన్నీ యూదానుండి కలిసి వస్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 యూదా నుండి మూలరాయి వస్తుంది, అతని నుండి డేరా మేకు, అతని నుండి యుద్ధ విల్లు వస్తాయి, అతని నుండి ప్రతి పాలకుడు వస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 యూదా నుండి మూలరాయి వస్తుంది, అతని నుండి డేరా మేకు, అతని నుండి యుద్ధ విల్లు వస్తాయి, అతని నుండి ప్రతి పాలకుడు వస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 10:4
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది. అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి. ఎందుకంటే, ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన, ఇశ్రాయేలు ఆధార శిల, కాపరి పేరున అయింది.


అయితే ఇప్పుడు మా దేవుడైన యెహోవా మా కళ్ళను వెలిగించి, మా బానిసత్వం నుండి మేము సేదదీరేలా, మాలో కొందరిని జీవించి ఉండేలా చేసి, ఆయన పరిశుద్ధ స్థలం లో మేము స్థిర నివాసం ఏర్పరచుకొనేలా కొంతవరకూ మా విషయంలో దయ చూపించాడు.


ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది.


సోయను అధిపతులు మూర్ఖులయ్యారు. నోపు పట్టణ అధిపతులు మోసపోయారు. ఐగుప్తు జాతులకు మూల స్తంభాలుగా ఉన్న వీళ్ళు ఐగుప్తును తప్పుదారి పట్టించారు.


దానికి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “చూడండి, నేను సీయోనులో ఒక పునాది రాయి వేస్తాను. అది పరిశోధనకి గురైన రాయి. ఒక ప్రశస్తమైన మూలరాయిని వేస్తాను. అది దృఢమైన పునాది రాయి. విశ్వాసం ఉంచే వాడు సిగ్గుపడడు.


ఆయన నా నోటిని పదునైన కత్తిలాగా చేశాడు. తన చేతి నీడలో నన్ను దాచాడు. ఆయన నన్ను మెరుగుపెట్టిన బాణంలాగా చేశాడు. తన అంబులపొదిలో నన్ను దాచాడు.


ఇదిగో విను! నిప్పులు ఊదే కమ్మరిని నేనే చేశాను. అతడు అక్కడ ఆయుధాలను చేస్తాడు. నాశనం చేయడానికి నాశనం చేసేవాణ్ణి చేసింది నేనే.


యూదా రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, యాజకుల దగ్గరికి, దేశ ప్రజల దగ్గరికి, ఈ దేశంలో నీవెక్కడికి పోయినా, నిన్ను ఒక ప్రాకారం ఉన్న పట్టణంగా, ఇనప స్తంభంగా, ఇత్తడి గోడగా ఉండేలా ఈ రోజు నియమించాను.


నువ్వు నాకు యుద్ధంలో ప్రయోగించే గద లాంటి వాడివి. యుద్ధంలో నువ్వు నా ఆయుధం. నీ ద్వారా నేను జనాలనూ జాతులనూ ధ్వంసం చేస్తాను. రాజ్యాలను నాశనం చేస్తాను.


నేను ఎఫ్రాయిములో రథాలుండకుండా చేస్తాను. యెరూషలేములో గుర్రాలు లేకుండా చేస్తాను. యుద్ధపు విల్లు లేకుండా పోతుంది. నీ రాజు సమాధానవార్త అన్యప్రజలకు తెలియజేస్తాడు. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకూ యూఫ్రటీసు నది మొదలు భూదిగంతం వరకూ అతడు పరిపాలిస్తాడు.


నేను కన్నులారా చూశాను గనక బాధించేవారు ఇకపై సంచరించకుండా, తిరుగులాడే సైన్యాలు నా మందిరం మీదికి రాకుండా దాన్ని కాపాడుకోడానికి నేనొక సైనిక శిబిరాన్ని ఏర్పాటు చేస్తాను.


నేను ఆయన్ని చూస్తున్నాను, కాని ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు. నేను ఆయన్ని గమనిస్తున్నాను కాని ఆయన ఇప్పుడు సమీపంగా లేడు. ఒక నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది. రాజదండం ఇశ్రాయేలులోనుంచి వస్తుంది. అతడు మోయాబు నాయకులను పడగొడతాడు. అతడు షేతు వంశస్తులందరినీ నాశనం చేస్తాడు.


కాబట్టి తన కోతకు కూలి వారిని పంపమని కోత యజమానిని బ్రతిమాలండి” అని తన శిష్యులతో చెప్పాడు.


ఆయన వారిని చూసి, “అలాగైతే, ‘ఇల్లు కట్టేవారు పనికి రాదని తీసివేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది’ అని రాసి ఉన్న మాట సంగతి ఏమిటి?


క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డారు.


సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన జీవితంలో ఇతర వ్యాపకాల్లో చిక్కుకోకుండా తనను సైన్యంలో చేర్చుకున్నవాణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నిస్తాడు.


ఎందుకంటే లేఖనంలో ఇలా రాసి ఉంది, “నేను సీయోనులో మూల రాయి వేస్తున్నాను. అది విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ. ఆయనను నమ్మేవారెవరూ సిగ్గు పడరు.”


వీళ్ళు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు కానీ ఆయన వారిని ఓడిస్తాడు. ఎందుకంటే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయనతో ఉన్నవారు పిలుపునందుకున్న వారు, ఎన్నిక అయినవారు, నమ్మకమైన వారు.”


అందుకు సౌలు “ప్రజల పెద్దలు నా దగ్గరకి వచ్చి ఈ రోజు ఎవరి ద్వారా తప్పిదం జరిగిందో దాన్ని కనుక్కోవాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ