Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 10:11 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 వాళ్ళు దుఃఖసముద్రం దాటవలసి వచ్చినప్పుడు సముద్రపు అలలు అణగారి పోతాయి. నైలునదిలోని లోతైన స్థలాలను ఆయన ఇంకిపోయేలా చేస్తాడు. అష్షూరీయుల గర్వం అణిగి పోతుంది, ఐగుప్తీయుల నుండి రాజరికం తొలిగి పోతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 యెహోవా దుఃఖసముద్రమునుదాటి సముద్రతరంగములను అణచి వేయును, నైలునదియొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును, అష్షూరీయుల అతిశయాస్పదము కొట్టివేయబడును, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 దేవుడు వారిని ఈజిప్టు (ఐగుప్తు) నుండి బయటకు తీసికొని వచ్చినప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు పరిస్థితి ఉంటుంది. ఆయన సముద్రపు అలలను కొట్టగా, సముద్రం రెండు పాయలు అయ్యింది. ప్రజలు ఆ కష్టాల సముద్రం మధ్యనుండి నడిచి వచ్చారు. యెహోవా నదీ ప్రవాహాలను ఇంకిపోయేలా చేస్తాడు. అష్షూరు గర్వాన్ని, ఈజిప్టు (ఐగుప్తు) అధికారాన్ని ఆయన నాశనం చేస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 వారు దుఃఖ సముద్రాన్ని దాటుతారు; సముద్రపు అలలు అణచివేయబడతాయి నైలు నదిలోని లోతైన స్థలాలన్నీ ఎండిపోతాయి. అష్షూరు యొక్క గర్వం అణచివేయబడుతుంది, ఈజిప్టు రాజదండం తీసివేయబడుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 వారు దుఃఖ సముద్రాన్ని దాటుతారు; సముద్రపు అలలు అణచివేయబడతాయి నైలు నదిలోని లోతైన స్థలాలన్నీ ఎండిపోతాయి. అష్షూరు యొక్క గర్వం అణచివేయబడుతుంది, ఈజిప్టు రాజదండం తీసివేయబడుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 10:11
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవుడు నోవహును, అతనితోపాటు ఓడలో ఉన్న ప్రతి జంతువునూ, పశువునూ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద గాలి విసిరేలా చేయడంవల్ల నీళ్ళు తగ్గుముఖం పట్టాయి.


నేల మీద పడిన ఎలీయా పైవస్త్రాన్ని పట్టుకుని దానితో నీటిని కొట్టి “ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అన్నాడు. అతడు ఆ పైవస్త్రంతో నీటిని కొట్టగానే నది అటూ ఇటూగా విడిపోయింది. ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచి పోయాడు.


అప్పుడు ఏలీయా తన పైవస్త్రాన్ని తీసుకుని, దాన్ని చుట్టి దానితో నీటి మీద కొట్టాడు. దాంతో నది అటూ ఇటూగా విడిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరూ పొడినేల పైన నడుస్తూ దాటిపోయారు.


ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల దేవుని మందిరం పని విషయంలో యెహోవా అష్షూరురాజు మనసు మార్చి వారికి ధైర్యం కలిగించి వారు ఆనందభరితులయ్యేలా చేశాడు.


సముద్రం దాన్ని చూసి పారిపోయింది. యొర్దాను నది వెనక్కి మళ్ళింది.


ఓ సముద్రం, పారిపోయావేమిటి? యొర్దానూ, నీవు వెనక్కి మళ్లావేమిటి?


నా దేశంలో అష్షూరును విరగ్గొడతాను. నా పర్వతాల మీద అతన్ని నా కాళ్ళ కింద తొక్కుతాను. అప్పుడు అతని కాడి నా ప్రజల మీద నుంచి తొలగిపోతుంది. అతని భారం వాళ్ళ భుజాల మీద నుంచి తేలిపోతుంది.


ఆ రోజున ఐగుప్తు ప్రజలంతా స్త్రీల వలే ఉంటారు. సేనల ప్రభువు అయిన యెహోవా వారిపై తన చెయ్యి ఎత్తుతాడు. దాని కారణంగా వాళ్ళు భయపడి వణుకుతారు.


నువ్వు ప్రవాహాలను దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నదులగుండా వెళ్ళేటప్పుడు అవి నిన్ను ముంచివేయవు. నువ్వు అగ్నిగుండా నడచినా కాలిపోవు, జ్వాలలు నీకు కీడు చేయవు


నీ లోతైన సముద్రాలను ‘ఎండిపో’ అని చెప్పి వాటిని ఇంకిపోయేలా చేసేది నేనే.


చాలా లోతైన నీళ్లున్న సముద్రాన్ని ఇంకిపోయేలా చేసింది నువ్వే గదా? విడుదల పొందినవాళ్ళు దాటిపోయేలా సముద్ర లోతుల్లో దారి చేసింది నువ్వే గదా?


యెహోవా హస్తమా లే! బలం ధరించుకో. పూర్వకాలంలో పురాతన తరాల్లో లేచినట్టు లే. భయంకరమైన సముద్ర జంతువును నరికివేసింది నువ్వే గదా? డ్రాగన్ను పొడిచేసింది నువ్వే గదా?


యెహోవా ఇలా చెబుతున్నాడు. “విగ్రహాలను నేను నాశనం చేస్తాను. మెంఫిస్ పట్టణపు పనికిరాని విగ్రహాలను లేకుండా చేస్తాను. ఇక ఐగుప్తు దేశంలో రాజు ఉండడు. దేశమంతటా నేను భయం పుట్టిస్తాను.


ఆయన ఉత్తరదేశం మీద తన హస్తం చాపి అష్షూరు దేశాన్ని నాశనం చేస్తాడు. నీనెవె పట్టణాన్ని పాడు చేసి దాన్ని ఆరిపోయిన ఎడారిలాగా చేస్తాడు.


ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానదిపై కుమ్మరించాడు. దాంతో తూర్పు దిక్కునున్న రాజులకు మార్గం సిద్ధం చేయడానికి ఆ నది నీళ్ళు ఎండిపోయాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ