పరమగీతము 6:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
1 (యెరూషలేము స్త్రీలు యువతితో మాట్లాడుతూ ఉన్నారు.) జగదేక సుందరీ, నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు? అతడేవైపుకు వెళ్ళాడు? అతన్ని వెదకడానికి మీతో పాటు మేము కూడా వస్తాము.
నీతో నన్ను తీసుకుపో. మనం పారిపోదాం. (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) రాజు, తన గదుల్లోకి నన్ను తెచ్చాడు. (ఆ యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది.) నేను సంతోషంగా ఉన్నాను. నీ గురించి నేను ఆనందిస్తున్నాను. నీ ప్రేమను నన్ను ఉత్సవంలా జరుపుకోనీ. అది ద్రాక్షారసం కంటే ఉత్తమం. మిగతా స్త్రీలు నిన్ను పొగడడం సహజం.
(పట్టణ స్త్రీలు యువతితో మాట్లాడుతూ ఉన్నారు.) జగదేక సుందరీ, వేరే ప్రియుల కంటే నీ ప్రియుడి విశేషమేంటి? నువ్వు మాచేత ఇలా ప్రమాణం చేయించుకోడానికి వేరే ప్రియుల కంటే నీ ప్రియుడు ఏవిధంగా గొప్ప?
యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిస్తాడు గాక, ఎవరి నీడన నువ్వు క్షేమంగా ఉన్నావో ఆ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నీకు నిండైన ప్రతిఫలం ఇస్తాడు గాక!” అన్నాడు.