Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




పరమగీతము 4:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 నీ మెడ, వరసల్లో రాళ్ళు పేర్చి కట్టిన దావీదు గోపురంలా ఉంది. దాని మీద వెయ్యి డాలులు వేలాడుతూ ఉన్నాయి. అవన్నీ సైనికుల డాలులే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వేయి డాలులును, శూరుల కవచములన్నియును వ్రేలాడు ఆ గోపురముతోను నీ కంధర సమానము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 నీ మెడ పొడుగ్గా సన్నగా జయ సూచకాల్ని ఉంచే దావీదు గోపురంలా ఉంది శక్తిమంతులైన సైనికుల డాళ్లు వెయ్యి డాళ్ళు దాని గోడల మీద అలంకరించడం కోసం ఆ గోపురాన్ని కట్టారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 నీ మెడ అందంగా నిర్మించబడిన దావీదు గోపురంలా ఉన్నది; దాని మీద వేయి డాళ్లు వ్రేలాడుతున్నాయి; అవన్నీ శూరుల డాళ్లు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 నీ మెడ అందంగా నిర్మించబడిన దావీదు గోపురంలా ఉన్నది; దాని మీద వేయి డాళ్లు వ్రేలాడుతున్నాయి; అవన్నీ శూరుల డాళ్లు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




పరమగీతము 4:4
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

గిల్బోవ పర్వతాల్లారా, మీ మీద మంచైనా వర్షమైనా పడకపోవు గాక. అర్పణకు పనికి వచ్చే ధాన్యం పండే చేలు లేకపోవు గాక. పరాక్రమవంతుల డాలు అవమానం పాలయింది. సౌలు డాలు తైలం చేత అభిషేకం పొందనిదైనట్టు అయిపోయింది.


తాను నియమించిన రాజుకు ఆయన గొప్ప విజయాన్నిస్తాడు. తాను అభిషేకించిన దావీదుకు అతని సంతానానికి నిబంధన విశ్వసనీయత చూపే వాడు ఆయన.


దాని పక్కన మిస్పాకు అధిపతి అయిన యేషూవ కొడుకు ఏజెరు ఆయుధాగారం దారికి ఎదురుగా ఉన్న గోడ మలుపు ప్రక్కన, మరో భాగం బాగు చేశాడు.


యవ్వనంలో ఉన్న మా కొడుకులు మొక్కల్లాగా ఏపుగా ఎదగాలి. మా కూతుళ్ళు రాజభవనం కోసం చెక్కిన మూల స్తంభాల్లాగా ఉండాలి.


ఆభరణాలతో నీ చెక్కిళ్లు, హారాలతో నీ మెడ ఎంత అందంగా ఉంది!


నీ మెడ దంతగోపురంలా ఉంది. నీ కళ్ళు బత్ రబ్బీం ద్వారం దగ్గరున్న హెష్బోను జలాశయాల్లా ఉన్నాయి. నీ నాసిక దమస్కు వైపు చూస్తున్న లెబానోను శిఖరంలా ఉంది.


నీ తల కర్మెలు పర్వతంలా ఉంది. నీ జుట్టు ముదురు ఊదా రంగు. నొక్కులు తిరిగిన ఆ జుట్టుకు రాజు వశమైపోయాడు.


(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) నేను గోడలా ఉండేదాన్ని. అయితే ఇప్పుడు నా స్తనాలు గోపురాల్లా ఉన్నాయి. కాబట్టి నేను పూర్తిగా అతని దృష్టికి సిద్ధంగా ఉన్నా.


మందల గోపురమా, సీయోను కుమార్తెకు కొండగా ఉన్న నీకు పూర్వపు అధికారం వస్తుంది. యెరూషలేము కుమార్తెమీద నీకు ప్రభుత్వం వస్తుంది.


అలాంటి వాడు శిరస్సుగా ఉన్న క్రీస్తు యేసును అంటి పెట్టుకుని ఉండడు. ఆ శిరస్సు వల్లనే శరీరానికి పోషణ జరుగుతుంది. ఆ శిరస్సు వల్లనే కీళ్లతో, నరాలతో శరీరం ఒక్కటిగా ఉంటుంది. దేవుడు ప్రసాదించే ఎదుగుదలతో శరీరం అభివృద్ధి చెందుతుంది.


ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం, విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ