Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




పరమగీతము 4:14 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 కుంకుమ, నిమ్మగడ్డి, దాల్చిన చెక్క, అన్ని రకాల పరిమళతైల వనస్పతులున్నాయి. బోళం, అగరు, వివిధ సుగంధ ద్రవ్యాలు అందులో లభిస్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్టయు వివిధమైన పరిమళతైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళద్రవ్యములు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 కుంకుమ పువ్వు, నిమ్మగడ్డి, లవంగ, సాంబ్రాణి బోళం, అగరు యిత్యాది అతి శ్రేష్ట సుగంధ ద్రవ్యాలనిచ్చే తరులతాదులతో నిండిన సుందర వనాన్ని పోలినది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 జటామాంసి కుంకుమ పువ్వు, వోమ దాల్చిన చెక్క, ప్రతి విధమైన పరిమళ చెట్టుతో, బోళం కలబంద, అన్ని సుగంధద్రవ్యాలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 జటామాంసి కుంకుమ పువ్వు, వోమ దాల్చిన చెక్క, ప్రతి విధమైన పరిమళ చెట్టుతో, బోళం కలబంద, అన్ని సుగంధద్రవ్యాలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




పరమగీతము 4:14
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారి తండ్రి ఇశ్రాయేలు, వారితో “అలాగైతే మీరిలా చేయండి. ఈ దేశంలోని మేలైన వస్తువులను మీ సంచుల్లో వేసుకుని తీసుకెళ్ళండి. కొంచెం సుగంధ ద్రవ్యాలు, కొంచెం తేనె, మసాలా దినుసులు, బోళం, పిస్తా కాయలు, బాదం కాయలు మీ సంచుల్లో వేసుకుని అతనికి కానుకగా తీసుకెళ్లండి.


షేబ దేశపు రాణి సొలొమోనుకు సుమారు నాలుగున్నర వేల బంగారం, బహు విస్తారమైన సుగంధ ద్రవ్యాలు, రత్నాలు ఇచ్చింది. రాజైన సొలొమోనుకు ఆమె ఇచ్చినంత విస్తారమైన సుగంధ ద్రవ్యాలు ఇంకెప్పుడూ రాలేదు.


ఆమె రాజుకు 4,000 కిలోగ్రాముల బంగారాన్ని, విస్తారమైన సుగంధ ద్రవ్యాలనూ రత్నాలనూ ఇచ్చింది. షేబదేశపు రాణి సొలొమోను రాజుకి ఇచ్చిన సుగంధ ద్రవ్యాలతో మరేదీ సాటి రాదు.


నువ్వు ధరించే బట్టలన్నీ బోళం, అగరు, దాల్చినచెక్క పరిమళాల వాసనే. ఏనుగు దంతపు భవనాల నుండి వినిపించే తీగ వాయిద్యాల నాదాలు నిన్ను సంతోషపెడుతున్నాయి.


“నువ్వు సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైన వాటిని తీసుకుని అభిషేకం చెయ్యాలి. పవిత్ర స్థలానికి సంబంధించిన కొలతల ప్రకారం స్వచ్ఛమైన గోపరసం 500 షెకెల్, సుగంధం గల దాల్చిన చెక్క సగం అంటే 250 షెకెల్,


నా పరుపు మీద బోళం, అత్తరు, దాల్చిన చెక్క చల్లాను.


(ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) రాజు విందుకు కూర్చుని ఉంటే నా పరిమళం వ్యాపించింది.


[మూడవ భాగం] (ఆ యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) ధూమ స్తంభంలాగా ఎడారి దారిలో వచ్చేది ఏంటది? బోళం, సాంబ్రాణి పరిమళాలతో వర్తకులమ్మే రకరకాల సుగంధ చూర్ణాలతో గుబాళిస్తూ వచ్చేది ఎవరు?


తెల్లారే లోపు చీకటి నీడలు తొలిగి పోయేలోగా నేను బోళం కొండకు వెళ్తాను. సాంబ్రాణి కొండకు వెళ్తాను.


(యువతి ప్రియుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు). నా సోదరీ, చెలీ, నేను నా తోటలోకి వచ్చాను. నా జటామాంసిని నా సుగంధాలతో తెచ్చుకున్నాను. తేనె, తేనెపట్టుతో తిన్నాను. నా ద్రాక్షారసాన్ని నా పాలతో తాగాను. నేస్తమా, తిను. నేస్తం, తిను. ప్రియా, బాగా తాగు.


(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) మేపడానికీ లిల్లీలు ఏరడానికీ నా ప్రియుడు తన తోటలోకి వెళ్ళాడు. సుగంధ వనస్పతులున్న తోటలోకి వెళ్ళాడు.


ఉజ్జాలు నుంచి దాను, యావాను వాళ్ళు ఇనప పనిముట్లు, దాల్చిన చెక్క, వాము తెచ్చి నీ సరుకులు కొన్నారు.


అవి లోయలు వ్యాపించినట్టు, నదీతీరంలో తోటల్లా, యెహోవా నాటిన అగరు చెట్లలా నీళ్ళ దగ్గరున్న దేవదారు వృక్షాల్లా ఉన్నాయి.


విశ్రాంతి దినం అయిపోగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి కలిసి వెళ్ళి యేసు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు.


మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరికి వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్ఫై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమాన్ని తనతో తీసుకు వచ్చాడు.


దాల్చిన చెక్క, సుగంధ ద్రవ్యాలు, ధూపం కోసం వాడే వస్తువులూ, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, నూనె, మెత్తని పిండి, గోదుమలు, పశువులు, గొర్రెలు మొదలైనవి. ఇంకా గుర్రాలూ, రథాలూ, బానిసలూ, మనుషుల ప్రాణాలు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ