పరమగీతము 1:7 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 (ఆ యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) నా ప్రాణ ప్రియా! నీ మందను నీవెక్కడ మేపుతావో నాకు చెప్పు. మధ్యాహ్నం నీ మందను నీడలో ఎక్కడ ఉంచుతావు? నీ స్నేహితుల మందల దగ్గర అటూ ఇటూ తిరిగే దానిగా నేనెందుకుండాలి? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకువేసికొనినదాననై నీ జతకాండ్ల మందలయొద్ద నేనెందుకుండవలెను? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 నా ప్రాణం అంతటితో నిన్ను ప్రేమిస్తాను! నీ గొర్రెల్ని ఎక్కడ మేపుతావో, మధ్యాహ్నం వాటిని ఎక్కడ పడుకో బెడతావో నాకు చెప్పు. నీతో ఉండటానికి నేను రావాలి లేకపోతే నీ మిత్రుల గొర్రెల కోసం పాటుపడే అద్దెకు తీసుకున్న స్త్రీని అవుతాను! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 నేను ప్రేమిస్తున్నవాడా, నీ గొర్రెల మందను ఎక్కడ మేపుతున్నావో మధ్యాహ్నం మీ మందను విశ్రాంతికి ఎక్కడ ఉంచుతున్నావో చెప్పు. మీ స్నేహితుల మందల ప్రక్కన నేను ముసుగు వేసుకున్న స్త్రీలా ఎందుకు ఉండాలి? အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 నేను ప్రేమిస్తున్నవాడా, నీ గొర్రెల మందను ఎక్కడ మేపుతున్నావో మధ్యాహ్నం మీ మందను విశ్రాంతికి ఎక్కడ ఉంచుతున్నావో చెప్పు. మీ స్నేహితుల మందల ప్రక్కన నేను ముసుగు వేసుకున్న స్త్రీలా ఎందుకు ఉండాలి? အခန်းကိုကြည့်ပါ။ |