రూతు 4:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 బోయజు బేత్లెహేము పురద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇంతకు ముందు బోయజు ప్రస్తావించిన బంధువు అటుగా వెళ్తున్నాడు. బోయజు అతణ్ణి పేరు పెట్టి పిలిచాడు “ఏమయ్యా, ఇలా వచ్చి కూర్చో” అన్నాడు. అతడు ఆ పిలుపు విని వచ్చి కూర్చున్నాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు–ఓయి, యీతట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్1 పట్టణ ద్వారము దగ్గర ప్రజలు సమావేశమయ్యే చోటికి బోయజు వెళ్లాడు. బోయజు చెప్పిన దగ్గర బంధువు అటుపైపు వచ్చేంతవరకు బోయజు అక్కడే కూర్చున్నాడు. “మిత్రమా, ఇలా రా! ఇక్కడ కూర్చో” అని బోయజు అతడిని పిల్చాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 బోయజు పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లి అక్కడ కూర్చున్నప్పుడు, అతడు చెప్పిన సమీపబంధువు అక్కడికి వచ్చాడు. “నా స్నేహితుడా, ఇక్కడకు వచ్చి కూర్చో” అని బోయజు అన్నాడు. కాబట్టి అతడు వెళ్లి కూర్చున్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 బోయజు పట్టణ ద్వారం దగ్గరకు వెళ్లి అక్కడ కూర్చున్నప్పుడు, అతడు చెప్పిన సమీపబంధువు అక్కడికి వచ్చాడు. “నా స్నేహితుడా, ఇక్కడకు వచ్చి కూర్చో” అని బోయజు అన్నాడు. కాబట్టి అతడు వెళ్లి కూర్చున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |
పొద్దున్నే లేచి బయలుదేరి పట్టణ ద్వార గుమ్మం దారి దగ్గర ఒకవైపున కూర్చుని ఉండేవాడు. తమ వివాదాల పరిష్కారం కోసం తీర్పుల కోసం రాజు దగ్గర వచ్చే ప్రజలను కనిపెట్టి వారిని పిలిచేవాడు. వారిని “నువ్వు ఏ ఊరివాడివి?” అని క్షేమ సమాచారాలు తెలుసుకొనేవాడు. “నీ దాసుడనైన నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఫలానా గోత్రానికి చెందినవాణ్ణి” అని వాడు చెప్పినప్పుడు,