ప్రకటన 13:16 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 ఇంకా తమ కుడి చేతిపై గానీ నుదిటిపై గానీ ముద్ర వేయించుకోవాలని ప్రముఖులనూ, అనామకులనూ, ధనవంతులనూ, నిరుపేదలనూ, స్వతంత్రులనూ, బానిసలనూ అందర్నీ వాడు బలవంతం చేశాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16-17 కాగా కొద్దివారుగాని గొప్పవారుగాని, ధనికులుగాని దరి ద్రులుగాని, స్వతంత్రులుగాని దాసులుగాని, అందరును తమ కుడిచేతిమీదనైనను తమ నొసటియందైనను ముద్ర వేయించుకొనునట్లును, ఆ ముద్ర, అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్యయైనను గలవాడు తప్ప, క్రయ విక్రయములు చేయుటకు మరి యెవనికిని అధికారములేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్16 అంతేకాక చిన్నా, పెద్దా, ధనికుడూ, పేదవాడు, బానిస, స్వతంత్రుడు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కడూ తన కుడి చేతి మీదగాని, నుదుటిమీదగాని, ఒక ముద్ర వేసుకోవాలని నిర్బంధం చేసింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 ఇంకా ఆ రెండవ మృగం ఘనులైనా అల్పులైనా, ధనవంతులైనా పేదవారైనా, స్వతంత్రులైనా దాసులైనా సరే అందరు తమ కుడిచేతి మీద గాని నుదుటి మీద గాని ముద్ర వేసుకోవాలని వారిని బలవంతం చేస్తుంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 ఇంకా ఆ రెండవ మృగం ఘనులైనా అల్పులైనా, ధనవంతులైనా పేదవారైనా, స్వతంత్రులైనా దాసులైనా సరే అందరు తమ కుడిచేతి మీద గాని నుదుటి మీద గాని ముద్ర వేసుకోవాలని వారిని బలవంతం చేస్తుంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము16 ఇంకా ఆ రెండవ మృగం ఘనులైనా అల్పులైనా, ధనవంతులైనా పేదవారైనా, స్వతంత్రులైనా దాసులైనా అందరూ వారి కుడి చేతి మీద లేక నుదుటి మీద ముద్ర వేసుకోవాలని వారిని బలవంతం చేస్తుంది. အခန်းကိုကြည့်ပါ။ |
అప్పుడు సింహాసనాలు చూశాను. వాటిపై కూర్చున్న వారికి తీర్పు చెప్పే అధికారం ఇచ్చారు. యేసును గురించి తాము చెప్పిన సాక్ష్యం కోసమూ, దేవుని వాక్కును ప్రకటన చేసినందుకూ తల నరికించుకున్న భక్తుల ఆత్మలు చూశాను. వారు క్రూర మృగాన్ని గానీ, వాడి విగ్రహాన్ని గానీ పూజించలేదు. వారి నుదుటి మీద గానీ చేతి మీద గానీ ముద్ర వేయనీయలేదు. వారిప్పుడు సజీవులై క్రీస్తుతో కలిసి వెయ్యేళ్ళు పరిపాలించారు.