Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 13:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 ఎంతకాలం నా మనస్సులో నేను ఆందోళన చెందాలి? ఎంతకాలం నా హృదయంలో పగలంతా నేను దుఃఖపడాలి? ఎంతకాలం నా శత్రువుకు నా మీద పైచెయ్యి అవుతుంది?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖా క్రాంతుడనై యుందును? ఎంతవరకు నాశత్రువు నామీద తన్ను హెచ్చించు కొనును?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి? ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి? ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 ఎంతకాలం నా ఆలోచనలతో నేను పెనుగులాడాలి? ఎంతకాలం నా హృదయంలో నేను దుఃఖపడాలి? ఎంతకాలం నా శత్రువు నాపై విజయం సాధిస్తాడు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 ఎంతకాలం నా ఆలోచనలతో నేను పెనుగులాడాలి? ఎంతకాలం నా హృదయంలో నేను దుఃఖపడాలి? ఎంతకాలం నా శత్రువు నాపై విజయం సాధిస్తాడు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 13:2
44 ပူးပေါင်းရင်းမြစ်များ  

రాజు నాతో “నీకు అనారోగ్యమేమీ లేదు గదా, నీ ముఖం విచారంగా ఉందేమిటి? నీకేదో మనోవేదన ఉన్నట్టుంది” అన్నాడు. నేను చాలా భయపడ్డాను.


ఎస్తేరు “మా విరోధి అయిన ఆ శత్రువు, దుష్టుడైన ఈ హామానే” అంది. అప్పుడు రాజు, రాణి ముందు హమానుకు ముచ్చెమటలు పోశాయి.


నేను గనక పాప క్రియలు జరిగిస్తే అవి నన్నెంతో బాధిస్తాయి. నేను నిర్దోషిని అయినప్పటికీ నా తల ఎత్తుకోలేను. ఎందుకంటే నేను అవమానంతో నిండి పోయి నాకు కలిగిన బాధను తలంచుకుంటూ ఉంటాను.


ఏ మనిషీ మళ్ళీ ఎన్నడూ భయభ్రాంతులు కలగజేయకుండా ఉండేలా తండ్రి లేని వాళ్ళను, పీడితులను నువ్వు రక్షిస్తావు.


మరణబంధాలు నన్ను చుట్టుకున్నాయి. పాతాళ వేదనలు నన్ను పట్టుకున్నాయి. బాధ, దుఃఖం నాకు కలిగింది.


నా మీద దాడి చేసే దుర్మార్గులనుంచి, నన్ను చుట్టుముట్టిన నా శత్రువులనుంచి నన్ను కాపాడు.


అబద్ధాలాడే పెదాలు మూతబడి పోనీ. వారు గర్వంతో నీతిమంతులను చిన్నచూపు చూస్తూ వారిపై కఠినంగా మాట్లాడతారు.


నేను పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నిరంతర వేదనలో ఉన్నాను.


జన సమూహంతో కలసి వాళ్ళని దేవుని మందిరానికి తీసుకు వెళ్ళిన సంగతినీ, వాళ్ళతో కలసి సంతోష గానంతో, స్తుతులతో పండగ చేసుకున్న సంగతినీ జ్ఞాపకం చేసుకుంటుంటే నా ప్రాణం కరిగి నీరైపోతున్నది.


యెహోవా, ఇక విడిచిపెట్టు. నా ఆత్మను విడిపించు. నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నన్ను రక్షించు.


లేకపోతే, వాళ్ళు సింహంలా నన్ను చీల్చేస్తారు. నాకు క్షేమం కలిగించడం ఎవరివల్లా కానంతగా నన్ను చీల్చివేస్తారు.


దేవా, శత్రువులు ఎంతకాలం నిన్ను నిందిస్తారు? శత్రువులు నీ నామాన్ని ఎల్లకాలం దూషిస్తారా?


యెహోవా, శత్రువులు నీపైనా బుద్ధిహీనులు నీ నామంపైనా చేసిన దూషణలు నీ మనసుకు తెచ్చుకో.


శత్రువునూ, ప్రతీకారం చేసేవాణ్ణీ నోరు మూయించడానికీ, నీ విరోధుల కారణంగా, పసికందుల, చంటి పిల్లల నోటిలో నువ్వు స్తుతిని సృష్టించావు.


తమ పట్టణాలను నువ్వు జయించినప్పుడు శిథిలాలు కూలినట్టు శత్రువు కూలిపోయాడు. వాళ్ళ గుర్తులన్నీ చెరిగిపోయాయి.


ఆనందంగా ఉండే హృదయం వదనాన్ని వికసించేలా చేస్తుంది. మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది.


ఇది కూడా మనస్సుకు బాధ కలిగించేదే. తన జీవితమంతా అతడు చీకటిలో భోజనం చేస్తాడు. అతడు రోగంతో, ఆగ్రహంతో నిస్పృహలో గడుపుతాడు.


నా బాధకు అంతం లేదెందుకు? నా గాయం ఎందుకు ఘోరమై నయం కాకుండా ఉంది? నువ్వు నాకు మోసజలం లాగా, ఇంకిపోయే ఊటలాగా ఉంటావా?”


‘అయ్యో, నాకు ఎంత శ్రమ! యెహోవా నా బాధకి తోడు వేదనను జోడించాడు. మూలుగులతో అలసిపోయాను. నాకు విశ్రాంతి దొరకడం లేదు’ అని నువ్వు అనుకుంటున్నావు.


నా గుండె నా లోపల సొమ్మసిల్లి పోతున్నది. నాకు దుఃఖ నివారణ ఎలా దొరుకుతుంది?


దాని విరోధులు అధికారులయ్యారు. దాని శత్రువులు వర్ధిల్లుతున్నారు. దాని పాపం అధికమైన కారణంగా యెహోవా దాన్ని బాధకు గురి చేశాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని వెళ్ళారు.


దాని చెంగులకు మురికి అంటింది. దాని ఎదుట ఉన్న శిక్ష అది గుర్తు చేసుకోలేదు. అది ఎంతో వింతగా పతనం అయ్యింది. దాన్ని ఆదరించేవాడు ఒక్కడూ లేడు. యెహోవా, నాకు కలిగిన బాధ చూడు. శత్రువులు ఎంత బలంగా ఉన్నారో చూడు!


నువ్వు మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు మర్చిపోతావు? మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టేస్తావా?


అప్పుడు ఆయన వారితో, “నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువగా ఉండండి” అని చెప్పాడు.


నేను ప్రతిరోజూ మీ దగ్గర దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ సమయం, చీకటి ఆధిపత్యం” అన్నాడు.


నేను ఈ సంగతులు మీతో చెప్పినందుకు మీ హృదయం నిండా దుఃఖం ఉంది.


అతడు చావుకు దగ్గరగా వెళ్ళాడు, కానీ దేవుడు అతని మీద జాలి చూపించాడు. అతని మీదే కాదు, దుఃఖం వెంట దుఃఖం కలగకుండా నా మీద కూడా జాలి చూపాడు.


సౌలు దావీదు అంటే మరింత భయం పెంచుకున్నాడు, దావీదుపై శత్రుభావం పెంచుకున్నాడు.


ఒకరికి తన శత్రువు దొరికినప్పుడు మేలు చేసి పంపివేస్తాడా? ఇప్పుడు నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకు మేలు చేస్తాడు గాక.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ