Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 9:15 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 మందిరాన్ని నిలబెట్టిన రోజున మేఘం నిబంధన శాసనాల గుడారాన్ని కమ్ముకుంది. సాయంత్రానికి మేఘం మందిరం పైగా కనిపించింది. అది మర్నాటి ఉదయం వరకూ అగ్నిలా కనిపించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను; సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అగ్నివంటి ఆకారము మందిరముమీద నుండెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 పవిత్ర గుడారం (ఒడంబడిక గుడారం) నిలబెట్టిన రోజున ఒక మేఘం దానిమీద నిలిచింది. రాత్రి పూట ఆ మేఘం అగ్నిలా కనబడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 నిబంధన గుడారమైన సమావేశ గుడారం సిద్ధపరచబడిన రోజున దాన్ని మేఘం కమ్మింది. సాయంత్రం నుండి ఉదయం వరకు సమావేశ గుడారం మీద మేఘం అగ్నిలా కనిపించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 నిబంధన గుడారమైన సమావేశ గుడారం సిద్ధపరచబడిన రోజున దాన్ని మేఘం కమ్మింది. సాయంత్రం నుండి ఉదయం వరకు సమావేశ గుడారం మీద మేఘం అగ్నిలా కనిపించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 9:15
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

అంతే కాక, పగటివేళ మేఘ స్తంభంలా ఉండి, రాత్రివేళ వాళ్ళు నడిచే మార్గంలో వెలుగు ఇవ్వడానికి అగ్నిస్తంభంలా ఉండి వాళ్ళను తీసుకువెళ్లావు.


వారు ఎడారిలో ప్రయాణిస్తుంటే పగటివేళ మేఘస్తంభం, రాత్రివేళ వారికి వెలుగు ఇచ్చేందుకు అగ్నిస్తంభం వారిపై నిలిచి ఉండేలా చేసి నీ అత్యంత కృప చూపించి వారిని కాపాడావు.


వారికి నీడగా ఆయన మేఘాన్ని కల్పించాడు. రాత్రి వెలుగివ్వడానికి అగ్నిని కలగజేశాడు.


పగలు మేఘంలో నుండీ రాత్రి అగ్ని వెలుగులో నుండీ ఆయన వారిని నడిపించాడు.


పగలు, రాత్రి ప్రయాణాల్లో యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. పగటి వేళ స్తంభాకార మేఘంలో రాత్రి వేళ వెలుగు ఇవ్వడానికి స్తంభాకార మంటల్లో ఉండి ఆయన వారికి ముందుగా నడిచాడు.


దేవుడు ప్రజల కోసం ఉంచిన పగటి మేఘస్తంభాన్ని, రాత్రి వేళ వెలుగిచ్చే అగ్నిస్తంభాన్ని తొలగించకుండా ప్రయాణం కొనసాగేలా చేశాడు.


తెల్లవారుతుండగా యెహోవా ఆ అగ్ని స్తంభం నుండీ మేఘ స్తంభం నుండీ ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్ళను కలవరానికి గురి చేశాడు.


“మొదటి నెల మొదటి రోజున నువ్వు సన్నిధి గుడారం ఉన్న మందిరాన్ని నిలబెట్టాలి.


అప్పుడు మేఘం యెహోవా సన్నిధి గుడారాన్ని కమ్ముకుంది. దైవ నివాసం యెహోవా మహిమా ప్రకాశంతో నిండింది.


ఆ మేఘం యెహోవా సన్నిధి గుడారంపై నిలిచి ఉండడం వల్ల మందిరం యెహోవా తేజస్సుతో నిండిపోయింది. అందువల్ల మోషే యెహోవా సన్నిధి గుడారం లోపలి వెళ్ళలేక పోయాడు.


ఇశ్రాయేలు ప్రజలందరి సమక్షంలో పగటివేళ యెహోవా మేఘం దైవనివాసం మీద ఉండేది. రాత్రి సమయాల్లో మేఘంలో అగ్ని స్థంభం ఉండేది. ప్రజల ప్రయాణాలన్నిటిలో ఈ విధంగా జరిగింది.


సీయోను కొండలోని ప్రతి నివాస స్థలం మీద, దాని సమావేశ ప్రాంగణాల మీద పగలు మేఘం, పొగ, రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశం ఒక మహిమ పందిరిలా యెహోవా కలగజేస్తాడు.


వారు తాము మజిలీ చేసిన స్థలం నుండి ప్రయాణం చేసినప్పుడు యెహోవా మేఘం పగటివేళ వారి మీద ఉంది.


యెహోవా అనే నువ్వు ఈ ప్రజల మధ్య ఉన్నావనీ, యెహోవా అనే నువ్వు ముఖాముఖిగా కనిపించినవాడివనీ, నీ మేఘం వారి మీద నిలిచి ఉన్నదనీ, నువ్వు పగలు మేఘస్తంభంలోనూ, రాత్రి అగ్నిస్తంభంలోనూ వారి ముందు నడుస్తున్నావనీ, వారు విని ఉన్నారు గదా.


మోషే, వారి కర్రలను నిబంధన శాసనాల గుడారంలో యెహోవా సన్నిధిలో పెట్టాడు.


సొదరీ సోదరులారా, మన పితరులు మేఘం కిందుగా ప్రయాణాలు చేశారు. వారంతా సముద్రంలో గుండా నడిచి వెళ్ళారు.


రాత్రి అగ్నిలో, పగలు మేఘంలో మీ ముందు నడిచిన మీ యెహోవా దేవుని మీద మీరు విశ్వాసముంచలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ