Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 7:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 మోషే దేవుని మందిర నిర్మాణం ముగించిన రోజునే దాన్ని దానిలోని అలంకరణలతో సహా యెహోవా సేవ కోసం అభిషేకించి పవిత్ర పరిచాడు. బలిపీఠాన్ని, అక్కడ పాత్రలను అభిషేకించి పవిత్ర పరిచాడు. వాటన్నిటినీ అభిషేకించి పవిత్ర పరిచాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 పవిత్ర గుడారాన్ని నిలబెట్టడం మోషే ముగించిన రోజే దానిని అతడు యెహోవాకు ప్రతిష్ఠించాడు. గుడారం మీద, దానిలో ప్రయోగించే పరికరాలన్నింటి మీద ప్రత్యేక తైలం పోసాడు. బలిపీఠం మీద, దానితో ఉపయోగించే వాటన్నింటి మీద మోషే ఆ తైలంపోసాడు. ఇది వీటన్నింటినీ పవిత్రం చేసింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 మోషే సమావేశ గుడారాన్ని సిద్ధం చేసినప్పుడు దాన్ని అభిషేకించి, దాన్ని, దాని సామాగ్రినంతటిని ప్రతిష్ఠించాడు. అతడు బలిపీఠాన్ని, దాని వస్తువులను కూడా ప్రతిష్ఠించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 మోషే సమావేశ గుడారాన్ని సిద్ధం చేసినప్పుడు దాన్ని అభిషేకించి, దాన్ని, దాని సామాగ్రినంతటిని ప్రతిష్ఠించాడు. అతడు బలిపీఠాన్ని, దాని వస్తువులను కూడా ప్రతిష్ఠించాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 7:1
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవుడు ఆ ఏడవ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటినుంచీ విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు.


ఆ రోజు ఆ దహనబలులు, నైవేద్యాలు, సమాధాన బలి పశువుల కొవ్వుని అర్పించడానికి యెహోవా సన్నిధిలో ఉన్న ఇత్తడి బలిపీఠం సరిపోలేదు. కాబట్టి రాజు యెహోవా మందిరం ఎదుట ఉన్న ఆవరణ మధ్య ఉన్న స్థలాన్ని ప్రతిష్ఠించి అక్కడ దహన బలులు నైవేద్యాలు, సమాధానబలి పశువుల కొవ్వు అర్పించాడు.


“ఇశ్రాయేలు ప్రజల్లో మొదట పుట్టిన సంతానాన్ని నాకు ప్రతిష్టించాలి. మనుషుల, పశువుల ప్రతి తొలిచూలు నాది.”


వారి పాపాలను కప్పివేయడానికి ప్రతిరోజూ ఒక కోడెదూడను పరిహార బలిగా అర్పించాలి. బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేయడానికి దానికి పాపపరిహార బలి అర్పించి దానికి అభిషేకం చేసి తిరిగి ప్రతిష్ఠించాలి.


గంగాళాన్ని, దాని పీటను అభిషేకించి, వాటిని ప్రతిష్ఠించాలి.


“నువ్వు ఇశ్రాయేలీయులతో మాట్లాడు, వారి దగ్గర ఒక్కొక్క పితరుల వంశానికి ఒక్కొక్క చేతికర్ర చొప్పున, అంటే ప్రతి వంశానికి చెందిన వారి నాయకుని దగ్గరనుంచి తమ తమ వంశాల ప్రకారం 12 చేతికర్రలు తీసుకుని ఎవరి చేతికర్ర మీద వారి పేరు రాయి.


మోషే బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఆ నాయకులు బలిపీఠాన్ని ప్రతిష్టించడానికి సామగ్రిని తీసుకు వచ్చారు. బలిపీఠం ఎదుట తాము తెచ్చిన అర్పణలను సమర్పించారు.


మోషే బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఇశ్రాయేలు నాయకులు వీటన్నిటినీ ప్రతిష్టించారు. వారు పన్నెండు వెండి గిన్నెలను, పన్నెండు వెండి పాత్రలను, పన్నెండు బంగారు పాత్రలను ప్రతిష్టించారు. ప్రతి ప్రోక్షణపాత్ర డెబ్భై తులాల బరువున్నది. ఆ ఉపకరణాల వెండి అంతా పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం రెండు వేల నాలుగువందల తులాల బరువు.


వారి పశువులన్నిటిలో నుండి 24 ఎద్దులను, 60 పొట్టేళ్లనూ 60 మేకపోతులను, ఒక సంవత్సరం వయసున్న 60 మగ గొర్రె పిల్లలను శాంతిబలిగా అర్పించారు.


అంధులారా! ఏది గొప్పది? అర్పించిన వస్తువా, దాన్ని పవిత్రపరిచే బలిపీఠమా?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ