Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 29:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 ఆ తరవాత ఏడో నెల 15 వ రోజున మీరు పరిశుద్ధ సమాజంగా సమావేశం కావాలి. అప్పుడు మీరు జీవనోపాధి కోసం పనులేమీ చేయకూడదు. ఏడు రోజులు యెహోవాకు పండగ జరపాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 మరియు ఏడవ నెల పదునయిదవదినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనో పాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 “ఏడోనెల పదిహేనవ రోజున ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. ఏడు రోజులు యెహోవాకు ప్రత్యేక పండుగ రోజులుగా మీరు జరుపుకోవాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 “ ‘ఏడవ నెల పదిహేనవ రోజున పరిశుద్ధ సభగా కూడుకోవాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. యెహోవా కోసం ఏడు రోజులు పండుగ ఆచరించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 “ ‘ఏడవ నెల పదిహేనవ రోజున పరిశుద్ధ సభగా కూడుకోవాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. యెహోవా కోసం ఏడు రోజులు పండుగ ఆచరించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 29:12
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

యరొబాము యూదా దేశంలో జరిగే మహోత్సవం లాంటి ఉత్సవాన్ని ఎనిమిదవ నెల పదిహేనవ రోజున జరపడానికి నిర్ణయించి, బలిపీఠం మీద బలులు అర్పిస్తూ వచ్చాడు. ఈ విధంగా బేతేలులో కూడా తాను చేయించిన దూడలకు బలులు అర్పిస్తూ వచ్చాడు. తాను చేయించిన ఉన్నత స్థలాలకు యాజకులను బేతేలులో ఉంచాడు.


ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు పర్ణశాలల పండగ ఆచరించి, ఏ రోజు ఆచరించాల్సిన నియమాలను లెక్క ప్రకారం ఆ రోజుల్లో ఆచరిస్తూ దహనబలులు అర్పిస్తూ వచ్చారు.


యెహోవా మోషేకు అనుగ్రహించిన గ్రంథం పరిశీలించినప్పుడు ఏడవ నెలలో జరిగే పండగ సమయంలో పర్ణశాలల్లో గడపాలని రాసి ఉన్నట్టు వారు కనుగొన్నారు.


అంతే కాకుండా, మొదటి రోజు నుండి ఏడవ రోజు వరకూ ప్రతిరోజూ ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథం చదివి, వినిపిస్తూ వచ్చాడు. వాళ్ళు ఇలా వారం పాటు ఈ పండగ రోజులు ఆచరించారు. తరువాత ఎనిమిదవ రోజున నిర్ణయించిన క్రమం ప్రకారం పవిత్ర సమావేశంలో సమకూడారు.


మీ పొలాల్లో పండిన తొలి పంటల కోత సమయంలో పండగ ఆచరించాలి. సంవత్సరం చివరలో పొలాల నుండి నీ వ్యవసాయ ఫలాలన్నీ సమకూర్చుకుని జనమంతా సమావేశమై పండగ ఆచరించాలి.


మీ పొలాల్లో పండిన గోదుమల తొలి పంటల కోత సమయంలో వారాల పండగ ఆచరించాలి. సంవత్సరం ముగింపులో పొలాలనుండి నీ వ్యవసాయ ఫలాన్ని కూర్చుకుని జనమంతా సమకూడి పండగ ఆచరించాలి.


ఏడో నెల 15 వ రోజున పండగ జరుగుతూ ఉండగా యాజకుడు ఏడు రోజులు పాప పరిహారార్థబలి విషయంలో, దహనబలి విషయంలో, నైవేద్యం విషయంలో, నూనె విషయంలో ఆ ప్రకారమే చేయాలి.”


మొదటి రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పనీ చేయకూడదు.


ఏడో నెల మొదటి రోజు మీరు పరిశుద్ధ సమాజంగా సమావేశం కావాలి.


దహనబలి, దాని నైవేద్యం, దాని పానార్పణ, కాకుండా, యెహోవాకు ఇష్టమైన సువాసనగల దహనబలిగా 13 కోడెలూ రెండు పొట్టేళ్ళు, ఒక సంవత్సరం వయసున్న 14 గొర్రె పిల్లలను అర్పించాలి. వాటిలో ఏ లోపమూ ఉండకూడదు.


ఎనిమిదో రోజు మీకు ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు.


ఆ వాక్కు శరీరంతో మన మధ్య కృపా సత్యాల సంపూర్ణ స్వరూపంగా నివసించాడు. తండ్రి నుండి వచ్చిన ఏకైక కుమారునికి ఉండే మహిమలాగా ఉన్న ఆయన మహిమను మేము చూశాము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ