సంఖ్యా 18:7 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 కాని నువ్వూ, నీ కొడుకులు మాత్రమే బలిపీఠానికీ, అడ్డతెర లోపల ఉన్న వాటికీ సంబంధించిన పనులన్నిటి విషయంలో యాజకత్వం జరుపుతూ సేవ చెయ్యగలరు. కేవలం మీరు మాత్రమే ఈ బాధ్యతలు చేపట్టగలరు. ఈ యాజకత్వాన్ని మీకు ఒక బహుమానంగా ఇస్తున్నాను. వేరే ఎవరైనా దాన్ని సమీపిస్తే అతనికి మరణ శిక్ష విధించాలి” అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించినయెడల మరణశిక్ష నొందును. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 అయితే నీవు, నీ కుమారులు మాత్రమే యాజకులుగా పని చేయవచ్చు. బలిపీఠం దగ్గరకు వెళ్లగలిగేది మీరు మాత్రమే. మీరు మాత్రమే తెర లోపలకు వెళ్లగలవారు. యాజకునిగా మీ సేవ అనేది నేను మీకు కానుకగా ఇస్తున్నాను. అతి పవిత్ర స్థలాన్ని ఇంకెవరు సమీపించినా వారిని చంపెయ్యాలి.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 అయితే నీవు, నీ కుమారులు మాత్రమే బలిపీఠం దగ్గర, తెర వెనుక ఉన్న ప్రతిదానికీ సంబంధించి యాజకులుగా పని చేయవచ్చు. యాజక ధర్మాన్ని మీకు ప్రత్యేకమైన వరంగా ఇస్తున్నాను. వేరే ఎవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే, వారికి మరణశిక్ష విధించబడుతుంది.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 అయితే నీవు, నీ కుమారులు మాత్రమే బలిపీఠం దగ్గర, తెర వెనుక ఉన్న ప్రతిదానికీ సంబంధించి యాజకులుగా పని చేయవచ్చు. యాజక ధర్మాన్ని మీకు ప్రత్యేకమైన వరంగా ఇస్తున్నాను. వేరే ఎవరైనా పరిశుద్ధాలయాన్ని సమీపిస్తే, వారికి మరణశిక్ష విధించబడుతుంది.” အခန်းကိုကြည့်ပါ။ |