Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 8:7 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 ప్రజలు ఇలా నిలబడి ఉన్న సమయంలో యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా, లేవీయులు ధర్మశాస్త్రం అర్థాన్ని, భావాలను వారికి తెలియజేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 జనులు ఈలాగు నిలువబడియుండగా యేషూవ బానీ షేరేబ్యా యామీను అక్కూబు షబ్బెతై హోదీయా మయశేయా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాయును లేవీయులును ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును తెలియ జెప్పిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 జనం అక్కడ నిలబడి వుండగా లేవీయులు ధర్మశాస్త్ర నియమాలను జనానికి బోధించారు. అలా బోధించిన లేవీయులు: యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హూదీయా, మయశాయా, కెలీటా, అజర్యా, యెజాబాదు, హానాను, పెలాయా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 ప్రజలందరు నిలబడి ఉండగా లేవీయులైన యెషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలిథా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా మొదలగు వారందరు కలిసి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 ప్రజలందరు నిలబడి ఉండగా లేవీయులైన యెషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలిథా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా మొదలగు వారందరు కలిసి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 8:7
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

తరవాత అతడు ప్రజల వైపు తిరిగి, ఇశ్రాయేలీయుల సమాజమంతా నిలబడి ఉండగా వారిని ఈ విధంగా దీవించాడు,


యెహోవా సేవను అర్థం చేసుకున్న లేవీయులందరితో హిజ్కియా ప్రోత్సాహకరమైన మాటలు పలికాడు. ఏడురోజులపాటు వారు సమాధాన బలులు అర్పిస్తూ, తమ పూర్వీకుల దేవుడైన యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఏడు రోజులు పస్కా పండగ సమయమంతా తమ నియమిత భాగం తింటూ ఆచరించారు.


ఇశ్రాయేలీయులందరికి బోధిస్తూ, యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఇలా ఆజ్ఞాపించాడు “పరిశుద్ధ మందసాన్ని మీరిక మీ భుజాల మీద మోయకుండా, ఇశ్రాయేలీయుల రాజు దావీదు కొడుకు సొలొమోను కట్టించిన మందిరంలో దాన్ని ఉంచండి. మీ దేవుడైన యెహోవాకు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులకు సేవ చేయండి.


మన దేవుని కరుణా హస్తం మాకు కాపుదలగా ఉన్నందువల్ల వారు షేరేబ్యాను, అతని కుమారులు, సహోదరులతో కలిపి మొత్తం 18 మందిని వెంటబెట్టుకు వచ్చారు. ఈ షేరేబ్యా గొప్ప మేధావి. ఇతడు ఇశ్రాయేలుకు పుట్టిన లేవి వంశస్థుడైన మహలి కొడుకుల్లో ఒకడు.


హోదీయా, హాషుము, బేజయి,


శెరాయా, అజర్యా, యిర్మీయా,


లేవీయుల్లో ప్రముఖులైన షబ్బెతై, యోజాబాదులకు దేవుని మందిరం బయటి పనుల నిర్వహించే అధికారం ఇచ్చారు.


ద్వారపాలకులు అక్కూబు, టల్మోను. ద్వారాల దగ్గర కాపలా ఉండేవారు 172 మంది.


ఇంకా అజర్యా, ఎజ్రా, మెషుల్లాము,


దాని పక్కన లేవీయులు బాగుచేశారు. వారిలో బానీ కొడుకు రెహూము ఉన్నాడు. దాన్ని ఆనుకుని అధికారి హషబ్యా తన భాగం నుండి కెయిలాకు చెందిన సగభాగం దాకా బాగు చేశాడు.


దాని పక్కన మిస్పాకు అధిపతి అయిన యేషూవ కొడుకు ఏజెరు ఆయుధాగారం దారికి ఎదురుగా ఉన్న గోడ మలుపు ప్రక్కన, మరో భాగం బాగు చేశాడు.


దాని పక్కన తమ యింటికి ఎదురుగా బెన్యామీను, హష్షూబు అనేవారు బాగు చేశారు. దాన్ని ఆనుకుని అనన్యా మనవడు, మయశేయా కొడుకు అజర్యా తన యింటి దగ్గర బాగు చేశాడు.


ఆ తరువాత ప్రజలు తాము విన్న మాటలన్నీ గ్రహించి, తినడానికీ, తాగడానికీ, లేని వారికి వాటాలు పంపించడానికీ, సంతోషంగా గడపడానికీ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లారు.


ఆ పని కోసం చెక్కతో చేసిన ఎత్తయిన వేదిక మీద ఎజ్రా నిలబడ్డాడు. అతని కుడివైపు మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవాళ్ళు. ఎడమవైపు పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవాళ్ళు నిలబడ్డారు.


ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించినప్పుడు ప్రజలంతా తమ చేతులు పైకెత్తి ఆమేన్‌, ఆమేన్‌ అని కేకలు వేస్తూ, క్రిందికి నేల వైపుకు తమ తలలు వంచుకుని యెహోవాకు నమస్కరించారు.


ఆ విధంగా ప్రజలు మరింత స్పష్టంగా అర్థం చేసుకుని గ్రహించగలిగేలా గ్రంథాన్ని చదివి వినిపించి వాటి సారాంశం తెలియజేసారు.


వారు ఒక పూటంతా అక్కడే నిలబడి దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చదివించుకున్నారు. మరో పూట తమ పాపాలు ఒప్పుకొంటూ దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లిస్తూ వచ్చారు.


లేవీయులైన యేషూవ, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ అనేవాళ్ళు మెట్ల మీద నిలబడి, తమ తలలు పైకెత్తి దేవుడైన యెహోవాను వేడుకున్నారు.


యెహోవా మోషే ద్వారా ఆదేశించిన శాసనాలను ఇశ్రాయేలు ప్రజలందరికీ మీరు బోధించాలి.”


యాజకులు సైన్యాలకు అధిపతియైన యెహోవా వార్తాహరులు గనుక ప్రజలు వారి నోటనుండి వచ్చే ధర్మశాస్త్ర విధులు నేర్చుకొంటారు గనుక వారు జ్ఞానం కలిగి వాటిని బోధించాలి.


అతడు యాకోబుకు నీ విధులనూ, ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రాన్నీ నేర్పిస్తాడు. అతడు నీ ఎదుట సాంబ్రాణి వేస్తాడు. నీ బలిపీఠం మీద సర్వాంగబలి అర్పిస్తాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ