నెహెమ్యా 4:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
5 వారు ఆలయం కట్టే వారిని ఆటంకపరచి నీకు కోపం తెప్పించారు. కాబట్టి వారి దోషాన్ని బట్టి వారిని విడిచిపెట్టవద్దు. నీ దృష్టిలో నుంచి వారి పాపాన్ని తీసివేయ వద్దు.”
నేను అతనిపై దాడిచేసి అతణ్ణి బెదిరిస్తాను. అప్పుడు అతని దగ్గర ఉన్నవారంతా పారిపోతారు. అప్పుడు రాజును మాత్రం చంపివేసి ప్రజలందరినీ నీవైపు తిప్పుతాను. నువ్వు వెతుకుతున్న వ్యక్తిని నేను పట్టుకున్నప్పుడు ప్రజలంతా నీతో రాజీ పడిపోతారు. కాబట్టి నీకు అంగీకారమైతే నాకు 12,000 మంది సైన్యాన్ని సిద్ధం చేయించు. ఈ రాత్రే దావీదును తరిమి పట్టుకుంటాను” అన్నాడు.
యెహోవా, నన్ను చంపడానికి వాళ్ళు చేసిన కుట్ర అంతా నీకు తెలుసు. వాళ్ళ అపరాధాలనూ పాపాలనూ క్షమించవద్దు. వాళ్ళ పాపాలు నువ్వు తుడిచి వేయవద్దు. వాళ్ళు నీ ఎదుట కూలిపోవాలి. నీ ఉగ్రత కురిపించే సమయంలో వారికి తగిన శాస్తి చెయ్యి.
వాళ్ళు చేసిన చెడుతనం అంతా నీ ఎదుటికి వస్తుంది గాక. నా అతిక్రమాల కారణంగా నువ్వు నాకు కలిగించిన హింస వాళ్ళకు కూడా కలిగించు. నేను తీవ్రంగా మూలుగుతున్నాను. నా గుండె చెరువై పోయింది.