Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 4:23 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 ఈ విధంగా నేను గానీ, నా బంధువులు గానీ, నా సేవకులు గానీ, నా వెంట ఉన్న కాపలావాళ్ళు గానీ బట్టలు విప్పలేదు. దాహం తీర్చుకోవడానికి వెళ్ళినా సరే, ఆయుధం వదిలి పెట్టలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 ఈలాగున నేనుగాని నా బంధువులుగాని నా పనివారుగాని నా వెంబడియున్న పారావారుగాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

23 సరే, నేనుగాని, నా సోదరులుగాని, నా మనుష్యులు గాని, కాపలావాళ్లుగాని, మాలో ఎవ్వరం మా దుస్తులు విప్పలేదు. మాలో ప్రతిఒక్కరూ అన్ని సమయాల్లో, చివరకు నీళ్లకు వెళ్లినప్పుడూ సైతం, ఆయుధాలు ధరించేవున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 ఈ విధంగా నేను గాని నా బంధువులు గాని నా సేవకులు గాని, నా వెంట ఉన్న కావలివారు గాని బట్టలు విప్పలేదు. నీరు త్రాగడానికి వెళ్లినప్పుడు కూడా ఎవరూ ఆయుధాన్ని వదిలిపెట్టలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 ఈ విధంగా నేను గాని నా బంధువులు గాని నా సేవకులు గాని, నా వెంట ఉన్న కావలివారు గాని బట్టలు విప్పలేదు. నీరు త్రాగడానికి వెళ్లినప్పుడు కూడా ఎవరూ ఆయుధాన్ని వదిలిపెట్టలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 4:23
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ సమయంలో నేను ప్రజలతో “ప్రతి వ్యక్తీ తన పనివాళ్ళతో కలసి యెరూషలేంలోనే బస చెయ్యాలి. అప్పుడు వాళ్ళు రాత్రి సమయంలో మాకు కావలిగా ఉంటారు, పగటి సమయంలో పని చేస్తారు” అని చెప్పాను.


తరువాత ప్రజలు, వారి భార్యలు తమ సాటి యూదుల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు.


నేను ఈ గోడ కట్టే పనిలో నిమగ్నమయ్యాను. నా పనివాళ్ళు కూడా నాతో కలసి పని చేస్తూ వచ్చారు. మేము భూములు ఏమీ సంపాదించుకోలేదు.


తరువాత నా సహోదరుడు హనానీ, కోట అధికారి హనన్యాలకు యెరూషలేం బాధ్యతలు అప్పగించాను. హనన్యా అందరికంటే ఎక్కువగా దేవుడంటే భయం గల నమ్మకమైన వ్యక్తి.


ఒకదానినొకటి తోసుకోకుండా తమ దారిలో చక్కగా పోతున్నాయి. ఆయుధాలు ఎదుర్కొన్నా వరుస తప్పవు.


అయినా నేనేమిటో అది దేవుని కృప వల్లనే. నాకు ఆయన అనుగ్రహించిన కృప వృధాగా పోలేదు. ఎందుకంటే వారందరికంటే నేను ఎక్కువగా కష్టపడ్డాను.


పశువులు నీళ్ళు తాగే చోట విల్లుకాండ్రు చేసే స్వరాలు వినండి. యెహోవా నీతిక్రియల గురించి వాళ్ళు చెబుతున్నారు. ఇశ్రాయేలీయుల యుద్ధశూరులకు తమ శత్రువుల మీద ఆయన జయం ఇచ్చాడని వాళ్ళు చెబుతున్నారు. “యెహోవా ప్రజలు పట్టణ ద్వారాల దగ్గరికి కవాతుగా వెళ్ళారు.


అతడు, అతనితో ఉన్న మనుషులందరూ, సల్మోను కొండ ఎక్కారు. అబీమెలెకు గొడ్డలి చేత పట్టుకుని ఒక పెద్ద చెట్టు కొమ్మ నరికి, యెత్తి భుజంపై పెట్టుకుని “నేనేం చేస్తున్నానో అదే మీరు కూడా చెయ్యండి” అని తనతో ఉన్న మనుషులతో చెప్పాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ