Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 2:10 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 హోరోనీ జాతివాడు సన్బల్లటు, అమ్మోను జాతి వాడు టోబీయా అనే సేవకులు ఇదంతా విన్నారు. ఇశ్రాయేలీయులకు ఆసరాగా ఒకడు రావడం వారికి ఎంతమాత్రం నచ్చలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 నేను చేస్తున్నదేమిటో చూసినవాళ్లు ఇద్దరు, సన్బల్లటు, టోబీయా. వాళ్లు కలత చెందారు. ఇశ్రాయేలు ప్రజలకి తోడ్పడేందుకు ఎవరో వచ్చినందుకు వాళ్లకి కోపం కలిగింది. సన్బల్లటు హారోనీయుడు, టోబీయా అమ్మోనీయుడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ అధికారియైన టోబీయా అనేవాడు ఇది విని ఇశ్రాయేలు ప్రజలకు ప్రయోజనం కలిగించడానికి ఎవరో వచ్చారని తెలిసి వారు చాలా కలవరపడ్డారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ అధికారియైన టోబీయా అనేవాడు ఇది విని ఇశ్రాయేలు ప్రజలకు ప్రయోజనం కలిగించడానికి ఎవరో వచ్చారని తెలిసి వారు చాలా కలవరపడ్డారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 2:10
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ రోజు వాళ్ళు మోషే గ్రంథం ప్రజలకు చదివి వినిపించారు. ఆ గ్రంథంలో “అమ్మోనీయులు గానీ, మోయాబీయులు గానీ దేవుని సమాజంలో ఎప్పటికీ ప్రవేశించకూడదు.


ప్రధాన యాజకుడు ఎల్యాషీబు కొడుకు యోయాదా కొడుకుల్లో ఒకడు హోరోను గ్రామవాసి సన్బల్లటు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. దీన్ని బట్టి నేను అతణ్ణి నా దగ్గర నుండి వెళ్ళగొట్టాను.


ఇంతకుముందు మన దేవుని మందిరానికి చెందిన గిడ్డంగిపై అధికారిగా ఉన్న యాజకుడు ఎల్యాషీబు టోబీయాతో బంధుత్వం కలుపుకున్నాడు.


అయితే హోరోనీ జాతివాడు సన్బల్లటు, అమ్మోనీ జాతివాడు టోబీయా అనే దాసుడు, అరబీయుడు గెషెము ఆ మాట విని మమ్మల్ని ఎగతాళి చేశారు. మా పనిని హేళన చేశారు. “మీరు చేస్తున్నదేమిటి? రాజు మీద తిరుగుబాటు చేస్తున్నారా?” అన్నారు.


యెరూషలేం గోడల నిర్మాణం జరుగుతూ ఉందని, కూలిన గోడలను సరిగా కడుతున్నారని, సన్బల్లటు, టోబీయా, అరబ్బులు, అమ్మోను వారు, అష్డోదు వారు తెలుసుకుని మండిపడ్డారు.


నేను పగుళ్ళు ఏవీ లేకుండా గోడలు కట్టే పని పూర్తి చేశాను. ఇంకా తలుపులు నిలబెట్టలేదు. ఈ విషయం సన్బల్లటుకూ, టోబీయాకూ, అరబ్బు వాడు గెషెంకూ, ఇంకా మా శత్రువుల్లో మిగతా వారికి తెలిసింది.


అయితే మా శత్రువులూ చుట్టూ ఉన్న ఇతర రాజ్యాల ప్రజలూ జరిగిన పని చూసి ఎంతో భయపడ్డారు. మా దేవుని సహాయం వల్లనే ఈ పని మొత్తం జరిగిందని వాళ్ళు తెలుసుకున్నారు.


యూదుడైన మొర్దెకై అహష్వేరోషు రాజు తరువాతి స్థానంలో ఉన్నాడు. అతడు యూదుల్లో గొప్పవాడుగా తన జాతి వారి మధ్య ప్రఖ్యాతి గాంచిన వాడయ్యాడు. అతడు తన ప్రజల క్షేమాన్ని పట్టించుకొంటూ తనవారందరితో శాంతిపూర్వకంగా మాట్లాడుతూ ఉండేవాడు.


భక్తిహీనులు అది చూసి కోపం తెచ్చుకుంటారు. వారు పళ్ళు కొరుకుతూ క్షీణించి పోతారు. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది.


క్రోధం క్రూరమైనది. కోపం వరదలాగా ముంచెత్తుతుంది. రోషం ఎదుట నిలవ గలిగేది ఎవరు?


అవి గద్దెనెక్కిన సేవకుడు, కడుపు నిండా అన్నం ఉన్న మూర్ఖుడు,


సేవకులు గుర్రాల మీద స్వారీ చేయడం, అధిపతులు సేవకుల్లా నేల మీద నడవడం నాకు కనిపించింది.


మోయాబు కోసం నా హృదయం అరుస్తూ ఉంది. దాని ప్రధానులు సోయరు వరకూ పారిపోతారు. లూహీతు ఎక్కుడు మార్గంలో ఏడుస్తూ ఎక్కుతారు. నాశనమై పోయామే అని పెద్దగా కేకలు వేస్తూ హొరొనయీము మార్గంలో వెళ్తారు.


అప్పుడు ఇష్మాయేలు, మిస్పాలో ఉన్న మిగిలిన జనమంతటినీ, రాజకుమార్తెలందరినీ, అంటే, రాజదేహ సంరక్షకుల అధికారి నెబూజరదాను అహీకాము కొడుకు గెదల్యాకు అప్పగించిన ప్రజలందరినీ, బందీలుగా తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళను తీసుకెళ్ళి అమ్మోనీయుల దగ్గర చేరాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు,


నిమ్రీములో నీళ్ళు కూడా ఎండిపోయాయి. కాబట్టి ప్రజల కేకలు హెష్బోను నుండి ఏలాలే వరకూ, ఇంకా యాహసు వరకూ, సోయరు నుండి హొరొనయీము వరకూ, ఎగ్లాత్షాలిషా వరకూ వినిపిస్తున్నాయి.


ప్రజలు లూహీతు కొండ ఎక్కుతూ ఏడుస్తున్నారు. హొరొనయీము వెళ్ళే దారిలో జరిగిన విధ్వంసాన్ని బట్టి ప్రజల పెడబొబ్బలు వినిపిస్తునాయి.


వారు యేసుని గూర్చి బోధిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించడం విని కలవరపడ్డారు.


దేవాలయం అధికారీ, ప్రధాన యాజకులూ ఆ మాట విని ‘ఇది ఏమవుతుందో’ అని వారి విషయమై అయోమయంలో పడిపోయారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ