నెహెమ్యా 13:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 నైవేద్యాలను, ధూప ద్రవ్యాలను, పాత్రలను, లేవీయులకు, గాయకులకు, ద్వారపాలకులకు కేటాయించిన ధాన్యంలో, కొత్త ద్రాక్షారసంలో, నూనెలో యాజకులకు ఇవ్వవలసిన ప్రతిష్ఠిత వస్తువులను ఉంచే గది పక్కన టోబీయాకు ఒక పెద్ద గదిని సిద్ధం చేశాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పదియవభాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పరచబడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద, అతనికి ఒక గొప్ప గదిని సిద్ధముచేసి యుంచెను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అంతేకాదు, అతడు గతంలో భోజనార్పణలు, ధూపద్రవ్యాలు, ఆలయ వస్తువులను, లేవీయులు, సంగీతకారులు ద్వారపాలకుల కోసం కేటాయించిన ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో, ఒలీవ నూనెలో పదవ వంతును, అలాగే యాజకులకు ఇవ్వవలసిన విరాళాలను నిల్వ ఉంచే స్థలం దగ్గర ఒక పెద్ద గదిని టోబీయాకు ఏర్పాటు చేశాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అంతేకాదు, అతడు గతంలో భోజనార్పణలు, ధూపద్రవ్యాలు, ఆలయ వస్తువులను, లేవీయులు, సంగీతకారులు ద్వారపాలకుల కోసం కేటాయించిన ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో, ఒలీవ నూనెలో పదవ వంతును, అలాగే యాజకులకు ఇవ్వవలసిన విరాళాలను నిల్వ ఉంచే స్థలం దగ్గర ఒక పెద్ద గదిని టోబీయాకు ఏర్పాటు చేశాడు. အခန်းကိုကြည့်ပါ။ |
అంతేకాక, మా పిండిలో ప్రథమ ఫలం, ప్రతిష్టితమైన అర్పణలు, అన్ని రకాల చెట్ల పళ్ళూ, ద్రాక్షారసం, నూనె మొదలైనవాటిని మా దేవుని మందిరపు గదుల్లోకి యాజకుల దగ్గరికి తీసుకురావాలనీ, మా భూమి సాగులో పదవ వంతు లేవీయుల దగ్గరికి తీసుకురావాలనీ, అన్ని పట్టణాల్లో ఉన్న మా పంట సాగులో పదవ భాగాన్ని లేవీయులకు ఇవ్వాలనీ నిర్ణయించుకున్నాం.
ఆ కాలంలో పదార్థాలను, ప్రతిష్టిత వస్తువులను, ప్రథమ ఫలాలను, దశమ భాగాలను ఉంచే గిడ్డంగులను కాపలా కాయడానికి కొందర్ని నియమించారు. యాజకుల, లేవీయుల కోసం, ధర్మశాస్త్రం ప్రకారం నిర్ణయించిన భాగాలను పట్టణాల నుండి, పొలాల నుండి సమకూర్చడానికి వీరిని నియమించారు. పరిచర్య చేయడానికి యాజకులు, లేవీయులను నియమించగా యూదులు సంతోషించారు.