Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 11:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ప్రజల అధికారులు యెరూషలేంలో నివాసం ఏర్పరచుకున్నారు. మిగిలిన ప్రజల్లో పదిమందిలో ఒకడు పరిశుద్ధ పట్టణం యెరూషలేంలో నివసించాలనీ, మిగిలిన తొమ్మిదిమంది వేరు వేరు పట్టణాల్లో నివసించాలనీ చీట్లు వేసి నిర్ణయించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధపట్టణమగు యెరూషలేమునందు పదిమందిలో ఒకడు నివసించునట్లును, మిగిలిన తొమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 ఇశ్రాయేలు ప్రజల నాయకులు అప్పుడు యెరూషలేము నగరంలోకి నివాసం మార్చారు. మిగిలిన ఇశ్రాయేలీయులు నగరంలోకి ఇంకెవరు రావాలో నిర్ణయించవలసి వచ్చింది. అందుకని వాళ్లు చీట్లు వేశారు. ఇశ్రాయేలీయులు పదిమందిలో ఒకరు పవిత్ర నగరమైన యెరూషలేములో నివసించాలన్నది నిర్ణయం. మిగిలిన తొమ్మండుగురూ తమతమ పట్టణాల్లో నివసించవచ్చు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ప్రజల నాయకులు యెరూషలేములో స్థిరపడ్డారు. మిగిలిన ప్రజల్లో పదిమందిలో ఒకరు మాత్రమే పరిశుద్ధ యెరూషలేములో నివసించేలా మిగతా తొమ్మిదిమంది తమ సొంత పట్టణాల్లోనే నివసించేలా చీట్లు వేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ప్రజల నాయకులు యెరూషలేములో స్థిరపడ్డారు. మిగిలిన ప్రజల్లో పదిమందిలో ఒకరు మాత్రమే పరిశుద్ధ యెరూషలేములో నివసించేలా మిగతా తొమ్మిదిమంది తమ సొంత పట్టణాల్లోనే నివసించేలా చీట్లు వేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 11:1
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

చిన్నలకైనా పెద్దలకైనా పూర్వీకుల ఇంటి వరసనుబట్టి ఒక్కొక్క ద్వారం దగ్గర కావలి ఉండడానికి వాళ్ళు చీట్లు వేశారు.


వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులు. వీళ్ళు యెరూషలేములో నివసిస్తూ ప్రముఖులయ్యారు.


ఈ విధంగా ఇశ్రాయేలీయులందరి పేర్లూ తమ వంశాల ప్రకారం ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో నమోదయ్యాయి. యూదావాళ్ళు చేసిన పాపం కారణంగా వాళ్ళు బబులోనుకి బందీలుగా కునిపోబడ్డారు.


తరువాత మొదటగా కొందరు ఇశ్రాయేలీయులూ, యాజకులూ, లేవీయులూ, దేవాలయ సేవకులూ తమ సొంత పట్టణాల్లో తిరిగి నివాసం ఏర్పరచుకున్నారు.


అలాగే కొందరు యూదావాళ్ళూ, బెన్యామీనీయులూ, ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలకు చెందిన వాళ్ళూ యెరూషలేములో నివాసమున్నారు.


ఇంకా, మా పూర్వీకుల వంశాచారం ప్రకారం ప్రతి ఏడూ నిర్ణయించిన సమయాల్లో ధర్మశాస్త్ర గ్రంథంలో రాసినట్టు దేవుడైన యెహోవా బలిపీఠంపై దహించడానికి దేవుని మందిరానికి కట్టెలు, అర్పణలు యాజకుల నుండి, లేవీయుల నుండి, ప్రజలనుండి ఎవరెవరు తీసుకు రావాలో చీట్లు వేసి నిర్ణయించుకొన్నాం.


పరిశుద్ధ పట్టణంలో నివాసమున్న లేవీయుల సంఖ్య 284 మంది.


ఆ సమయంలో నేను ప్రజలతో “ప్రతి వ్యక్తీ తన పనివాళ్ళతో కలసి యెరూషలేంలోనే బస చెయ్యాలి. అప్పుడు వాళ్ళు రాత్రి సమయంలో మాకు కావలిగా ఉంటారు, పగటి సమయంలో పని చేస్తారు” అని చెప్పాను.


నాయకులు అక్కడ సింహాసనాలపై కూర్చుంటారు. అవి దావీదు రాజవంశం సింహాసనాలు.


యెరూషలేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవాళ్ళు వృద్ది చెందుతారు.


చీట్లు ఒడిలో వేస్తారు. నిర్ణయం యెహోవాదే.


మేము పరిశుద్ధ పట్టణవాసులం అనే పేరు పెట్టుకుని, వాళ్ళు ఇశ్రాయేలు దేవుని ఆశ్రయిస్తారు. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా.


సీయోనూ! లే! నీ బలం తెచ్చుకో. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా! నీ అందమైన బట్టలు వేసుకో. ఇక ఎన్నటికీ సున్నతి పొందని వాడొకడైనా, అపవిత్రుడొకడైనా నీ లోపలికి రాడు.


వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన పునరుత్థానం చెందిన తరువాత పవిత్ర నగరంలో ప్రవేశించి చాలామందికి కనిపించారు.


అప్పుడు అపవాది ఆయనను పవిత్ర నగరంలోకి తీసుకు పోయి, దేవాలయ శిఖరంపై నిలబెట్టి,


ఈ విధంగా ప్రార్థించారు. “అందరి హృదయాలను ఎరిగిన ప్రభూ,


తరువాత శిష్యులు వారిద్దరి మీదా చీట్లు వేస్తే మత్తీయ పేరుతో చీటి వచ్చింది కాబట్టి అతనిని పదకొండుమంది అపొస్తలులతో కలిపి లెక్కించారు.


వారి కోసం యెహోషువ షిలోహులో యెహోవా సమక్షంలో చీట్లు వేశాడు. వారి వాటాల ప్రకారం ఇశ్రాయేలీయులకు ఆ దేశాన్ని పంచిపెట్టాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ