Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 10:36 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

36 ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్నట్టు మా కొడుకుల్లో మొదటి వారిని, మా పశువుల్లో, మందల్లో తొలిచూలు పిల్లలను మన దేవుని మందిరంలో పరిచర్య చేసే యాజకుల దగ్గరికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

36 మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

36 “ధర్మశాస్త్రంలో సరిగ్గా లిఖించబడినట్లే, మేమిలా చేస్తాము: మా తొలిచూలు కొడుకుల్నీ, అలాగే, మొదటి ఈత ఆవుల దూడల్నీ, గొర్రెల, మేకల పిల్లల్నీ మన దేవుని ఆలయానికి, మన యాజకుల దగ్గరికి తెస్తాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

36 “అలాగే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం మా కుమారులలో మొదట పుట్టినవాన్ని, మా పశువుల్లో, మందలలో గొర్రెలలో మొదట పుట్టిన వాటిని యెహోవా ఆలయానికి అక్కడ పరిచర్య చేస్తున్న యాజకుని దగ్గరకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

36 “అలాగే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం మా కుమారులలో మొదట పుట్టినవాన్ని, మా పశువుల్లో, మందలలో గొర్రెలలో మొదట పుట్టిన వాటిని యెహోవా ఆలయానికి అక్కడ పరిచర్య చేస్తున్న యాజకుని దగ్గరకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 10:36
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ ఆజ్ఞ జారీ అయిన వెంటనే ఇశ్రాయేలీయులు తమ మొదటి పంట ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె, తేనె, పొలంలోని పంటనూ విస్తారంగా తీసుకు వచ్చారు. అంతే కాక అన్నిటిలోనుంచి పదవ వంతును విస్తారంగా తెచ్చారు.


ఆ కాలంలో పదార్థాలను, ప్రతిష్టిత వస్తువులను, ప్రథమ ఫలాలను, దశమ భాగాలను ఉంచే గిడ్డంగులను కాపలా కాయడానికి కొందర్ని నియమించారు. యాజకుల, లేవీయుల కోసం, ధర్మశాస్త్రం ప్రకారం నిర్ణయించిన భాగాలను పట్టణాల నుండి, పొలాల నుండి సమకూర్చడానికి వీరిని నియమించారు. పరిచర్య చేయడానికి యాజకులు, లేవీయులను నియమించగా యూదులు సంతోషించారు.


నైవేద్యాలను, ధూప ద్రవ్యాలను, పాత్రలను, లేవీయులకు, గాయకులకు, ద్వారపాలకులకు కేటాయించిన ధాన్యంలో, కొత్త ద్రాక్షారసంలో, నూనెలో యాజకులకు ఇవ్వవలసిన ప్రతిష్ఠిత వస్తువులను ఉంచే గది పక్కన టోబీయాకు ఒక పెద్ద గదిని సిద్ధం చేశాడు.


“ఇశ్రాయేలు ప్రజల్లో మొదట పుట్టిన సంతానాన్ని నాకు ప్రతిష్టించాలి. మనుషుల, పశువుల ప్రతి తొలిచూలు నాది.”


నీ భూమిలో పండే వాటిలో ప్రథమ ఫలాలు యెహోవా దేవుని మందిరానికి తీసుకురావాలి. మేకపిల్ల మాంసం దాని తల్లిపాలలో కలిపి ఉడకబెట్ట కూడదు.


జంతువుల్లో మొదట పుట్టిన ప్రతి పిల్ల నాది. నీ పశువుల్లో మొదటిగా పుట్టిన ప్రతి మగది, అది దూడ గానీ, గొర్రెపిల్ల గానీ అది నాకు చెందుతుంది.


నా ఆలయంలో ఆహారం ఉండేలా మీ దశమ భాగం నా ఆలయం గిడ్డంగిలోనికి తీసుకురండి. ఇలా తీసుకువచ్చి నన్ను శోధించండి, నేను పరలోక ద్వారాలు విప్పి, పట్టలేనంత దీవెనలు విస్తారంగా కుమ్మరిస్తాను” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.


మొదటి సంతానం నాకు చెందుతుంది. ఐగుప్తు దేశంలో నేను వారి మొదటి సంతానాన్ని సంహరించినప్పుడు ఇశ్రాయేలులో మనుషుల్లోనూ, పశువుల్లోనూ మొదటి సంతానాన్ని నా కోసం నేను ప్రత్యేక పరచుకున్నాను. వారు నా వారు. అవి నావి. నేనే యెహోవాను.”


వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్ధాలన్నిటిలో భాగమివ్వాలి.


మీ హోమ బలులు, అర్పణ బలులు, మీ దశమభాగాలు, ప్రతిష్టిత నైవేద్యాలు, మొక్కుబడి అర్పణలు, స్వేచ్ఛార్పణలు, పశువులు, మేకల్లో తొలిచూలు పిల్లలు, వీటన్నిటినీ అక్కడికే తీసుకురావాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ