Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మీకా 5:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 యెరూషలేము ప్రజలారా, యుద్ధ సేనలతో ఇప్పుడు కలిసి రండి. నీ పట్టణం చుట్టూ గోడ ఉంది. అయితే శత్రువులు ఇశ్రాయేలీయుల నాయకుణ్ణి బెత్తంతో చెంప మీద కొడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము; శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు, వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కఱ్ఱతో చెంపమీద కొట్టుచున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 కావున, బలమైన నగరమా, నీ సైన్యాలను సమీకరించు. నీ శత్రువులు ముట్టడించటానికి కూడుకుంటున్నారు. వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని చెంపమీద కొడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 సైన్య సమూహాలు గల నగరమా, సమూహాలను సమకూర్చు, శత్రువులు మనల్ని ముట్టడించారు. వారు ఇశ్రాయేలు ప్రజల పాలకున్ని బెత్తంతో చెంపమీద కొడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 సైన్య సమూహాలు గల నగరమా, సమూహాలను సమకూర్చు, శత్రువులు మనల్ని ముట్టడించారు. వారు ఇశ్రాయేలు ప్రజల పాలకున్ని బెత్తంతో చెంపమీద కొడతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మీకా 5:1
35 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ విధంగా రాహేలు చనిపోయినప్పుడు ఆమెను బేత్లెహేము అని పిలిచే ఎఫ్రాతా మార్గంలో సమాధి చేశారు.


షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు. అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు. రాజ్యాలు అతనికి లోబడతాయి.


కెనయనా కొడుకు సిద్కియా అతని దగ్గరికి వచ్చి “నీతో మాట్లాడడానికి యెహోవా ఆత్మ నా దగ్గర నుంచి ఏ వైపు పోయాడు” అని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టాడు.


యెహోవా అతని మీదకి, తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను చెప్పిన మాట ప్రకారం యూదాదేశాన్ని నాశనం చెయ్యడానికి దాని మీదకి కల్దీయుల సైన్యాలను, సిరియనుల సైన్యాలను, మోయాబీయుల సైన్యాలను, అమ్మోనీయుల సైన్యాలను రప్పించాడు.


మనుషులు నన్ను ఎత్తి పొడవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ తిట్లు నాకు చెంపపెట్టులాంటివి. వాళ్ళంతా ఏకమై నాకు వ్యతిరేకంగా సమకూడుతున్నారు.


అనాది కాలంలోనే ఆరంభం నుండి సృష్టి జరగకముందే ఆయన నన్ను నియమించాడు.


భక్తిహీనులైన ప్రజల మీదకి నేను వాళ్ళను పంపిస్తాను. కొల్లసొమ్ము దోచుకోడానికీ, వేటాడింది తెచ్చుకోడానికీ, వాళ్ళను వీధుల్లో మట్టి తొక్కినట్టు తొక్కడానికీ, నా ఉగ్రతకు పాత్రులైన అహంకార ప్రజలకు విరోధంగా అతన్ని పంపిస్తాను.


ఎందుకంటే యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు.


ప్రజలారా, మీరు ముక్కలు చెక్కలై పోతారు. దూరదేశాల్లారా, మీరందరూ వినండి. మీరు యుద్ధానికి సన్నద్ధులు కండి, ముక్కలు చెక్కలైపొండి. యుద్ధానికి సన్నద్ధులు కండి, ముక్కలు చెక్కలై పొండి.


యుద్ధ శబ్దం చేసే పాద రక్షలు, రక్తంలో పొర్లించిన వస్త్రాలు అగ్నిలో కాలి, ఆ అగ్నికి ఇంధనం ఔతాయి.


ఈ దేశం మీదికి, దీని నివాసుల మీదికి, చుట్టూ ఉన్న ఈ ప్రజలందరి మీదికీ వారిని రప్పిస్తున్నాను. ఈ ప్రజలను నాశనం చేస్తాను. వాళ్ళను అసహ్యకారణంగా, అపహాస్యంగా ఎప్పటికి పాడుగా ఉంచుతాను.


పొదల్లో నుండి సింహం బయలుదేరింది. జాతుల వినాశకుడు బయలు దేరాడు. నీ దేశాన్ని నాశనం చేయడానికి, నీ పట్టణాలను శిథిలాలుగా మార్చి ఎవరూ నివసించకుండా చేయడానికి అతడు తన చోటు నుండి బయలు దేరాడు.


అతడు తనను కొట్టేవాడివైపు తన చెంపను తిప్పాలి. అతడు పూర్తిగా అవమానంతో నిండి ఉండాలి.


ఆ అగ్నికి నువ్వు ఇంధనం ఔతావు. దేశంలో నీ రక్తం కారుతుంది. నువ్వు ఎప్పటికీ జ్ఞాపకానికి రావు. యెహోవానైన నేనే ఇది ప్రకటించాను.”


“నరపుత్రుడా, ఈ రోజు పేరు రాసి ఉంచుకో. కచ్చితంగా ఈ రోజే బబులోను రాజు యెరూషలేమును ముట్టడి వేశాడు.


యెరూషలేమును మళ్ళీ కట్టించవచ్చని ఆజ్ఞ బయలు దేరిన సమయం మొదలుకుని అభిషిక్తుడైన నాయకుడు వచ్చే దాకా ఏడు ఏడులు, 62 ఏడులు పడుతుందని గ్రహించి అర్థం చేసుకో. దురవస్థ గల కాలం అయినప్పటికీ పట్టణం రాచవీధులను కందకాలను మళ్ళీ కడతారు.


రాజ్యాల్లో ఈ విషయం చాటించండి, యుద్ధానికి సిద్ధపడండి. శూరులను రేపండి. వారిని దగ్గరికి రమ్మనండి. సైనికులంతా రావాలి.


దానిలోని న్యాయమూర్తిని నిర్మూలం చేస్తాను. అతనితోపాటు వారి అధిపతులందరిని నేను చంపేస్తాను” అని యెహోవా చెబుతున్నాడు.


కల్దీయులను నేను రేపుతున్నాను. వినండి. వారు తమవి కాని ఉనికిపట్టులను ఆక్రమించాలని భూదిగంతాలదాకా సంచరించే ఉద్రేకం గల క్రూరులు.


నేను వింటుంటే నా అంతరంగం కలవరపడుతున్నది. ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి. నా ఎముకలు కుళ్లిపోతున్నాయి. నా కాళ్లు వణకుతున్నాయి. జనాలపై దాడి చేసే వారు సమీపించే దాకా నేను ఊరుకుని బాధ దినం కోసం కనిపెట్టవలసి ఉంది.


అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయనను గుద్దారు.


ఆయన మీద ఉమ్మి వేసి, ఆ రెల్లు కర్రతో ఆయన తలమీద కొట్టారు.


కానీ నేను మీతో చెప్పేదేమిటంటే దుష్టుణ్ణి ఎదిరించవద్దు. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి.


యేసు ఇలా అన్నప్పుడు, అక్కడ నిలుచుని ఉన్న అధికారుల్లో ఒకడు, యేసును తన అరచేతితో చెంప మీద కొట్టి, “ప్రధాన యాజకుడికి నువ్వు జవాబిచ్చే విధానం ఇదేనా?” అన్నాడు.


అందుకు ప్రధాన యాజకుడు అననీయ, “అతన్ని నోటి మీద కొట్టండి” అని దగ్గర నిలబడిన వారికి ఆజ్ఞాపించాడు.


ఎవరైనా మిమ్మల్ని బానిసలుగా చేసినా, మీలో విభేదాలు కలిగించినా, మిమ్మల్ని వశం చేసుకున్నా, తన గురించి గొప్పలు చెప్పుకుంటున్నా, చెంప దెబ్బ కొట్టినా మీరు సహిస్తున్నారు.


దేవుడైన యెహోవా చాలా దూరంలో ఉన్న ఒక దేశం మీ మీదికి దండెత్తేలా చేస్తాడు. వారి భాష మీకు తెలియదు. గద్ద తన ఎర దగ్గరికి ఎగిరి వచ్చినట్టు వాళ్ళు వస్తారు.


నిత్య దేవుడు నీకు ఆశ్రయం, శాశ్వతమైన హస్తాలు నీ కింద ఉన్నాయి. శత్రువును ఆయన నీ ఎదుట నుంచి గెంటి వేస్తాడు. నాశనం చెయ్యి! అంటాడు.


అక్కడ యూదా గోత్రంలో చేరిన ఒక లేవీ యువకుడు ఉండేవాడు. ఇతడు యూదా ప్రాంతానికి చెందిన బేత్లెహేము నుండి వచ్చాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ