Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మీకా 2:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 కాబట్టి యెహోవా ఇలా చెబుతున్నాడు, “ఈ వంశం మీదికి విపత్తు పంపించబోతున్నాను. దాని కిందనుంచి మీ మెడలను వదిలించుకోలేరు. గర్వంగా నడవ లేనంతగా అపాయం రాబోతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 కాబట్టి యెహోవా సెలవిచ్చునదేమనగా– గొప్పఅపాయ కాలమువచ్చుచున్నది. దాని క్రిందనుండి తమ మెడలను తప్పించుకొనలేకుండునంతగాను, గర్వముగా నడువలేకుండునంతగాను ఈ వంశమునకు కీడుచేయనుద్దేశించుచున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 అందువల్ల యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “చూడండి, ఈ వంశం మీదికి ఆపద తీసుకురావటానికి నేను పథకం వేస్తున్నాను. మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. మీరు గర్వంగా నడవలేరు. ఎందుకంటే అది కీడుమూడే సమయం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: “నేను ఈ వంశం మీదికి విపత్తు రప్పించబోతున్నాను, దాని నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు. అది విపత్తు కాలం కాబట్టి మీరు ఇక ఎన్నడు గర్వంగా నడవలేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: “నేను ఈ వంశం మీదికి విపత్తు రప్పించబోతున్నాను, దాని నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు. అది విపత్తు కాలం కాబట్టి మీరు ఇక ఎన్నడు గర్వంగా నడవలేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మీకా 2:3
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

నిర్దయులు లేకుండా పోతారు. పరిహాసం చేసేవాళ్ళు అంతరిస్తారు.


యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమార్తెలు పోగరుబోతులు. మెడ చాచి నడుస్తూ, ఓర చూపులు చూస్తూ, కులుకుతో నడుస్తూ, తమ కాళ్ల గజ్జెలు మోగిస్తున్నారు.


“దేవుడు త్వరపడాలి. ఆయన వెంటనే పని జరిగించాలి, మేము ఆయన కార్యాలు చూడాలి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలిసేలా అది కార్యరూపం దాల్చాలి” అనే వారికి బాధ.


కాబట్టి నువ్వు వెళ్లి యూదావారితో యెరూషలేము నివాసులతో ఇలా చెప్పు. “యెహోవా ఇలా చెబుతున్నాడు, మీ మీదికి విపత్తు రప్పించబోతున్నాను. మీకు విరోధంగా ఒక ఆలోచన చేస్తున్నాను. మీరంతా ఒక్కొక్కరు మీ దుర్మార్గాన్ని విడిచి మీ విధానాలనూ ప్రవర్తననూ మార్చుకోండి.”


నేను యూదా రాజు సిద్కియాతో మాట్లాడి ఈ విషయం చెప్పాను. “బబులోను రాజు కాడిని మీ మెడ మీద పెట్టుకుని, అతనికీ అతని ప్రజలకూ సేవ చేస్తే మీరు బతుకుతారు.


కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు. “ఒక్కొక్కడు తన సహోదరులకూ, తన పొరుగువారికీ విడుదల ప్రకటించాలని నేను చెప్పిన మాట మీరు వినలేదు. కాబట్టి చూడండి, నేను మీకు విడుదల ప్రకటించబోతున్నాను. అది ఖడ్గంతో, తెగులుతో, కరువుతో మీరు నాశనం అవ్వడానికే నేను ప్రకటించే విడుదల. భూమి మీద ఉన్న ప్రతి రాజ్యాన్ని బట్టి మీరు గడగడా వణికేలా చేస్తాను.


యెహూది మూడు నాలుగు వరుసలు చదివిన తరువాత, రాజు చాకుతో దాన్ని కోసి, ఆ కుంపటిలో వేశాడు. అప్పుడు అది పూర్తిగా కాలిపోయింది.


అప్పుడు హోషేయా కొడుకు అజర్యా, కారేహ కొడుకు యోహానానూ ఇంకా అక్కడ ఆహంకారులందరూ యిర్మీయాతో “నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ‘మీరు నివసించడానికి ఐగుప్తుకు వెళ్ళవద్దు’ అని మా దేవుడు యెహోవా నీతో చెప్పి పంపలేదు.


ఈ దుర్మార్గ దేశంలో ఇంకా మిగిలి ఉన్నవారు నేను వారిని చెదర గొట్టిన స్థలాల్లో జీవానికి బదులు చావును కోరుకుంటారు. సేనల ప్రభువైన యెహోవా వాక్కు ఇదే.


నా అతిక్రమం అనే కాడి నాకు ఆయనే కట్టాడు. అవి మూటగా నా మెడ మీద ఉన్నాయి. నా బలం ఆయన విఫలం చేశాడు. శత్రువుల చేతికి ప్రభువు నన్ను అప్పగించాడు. నేను నిలబడ లేకపోతున్నాను.


తాను అనుకున్న పని యెహోవా ముగించాడు. తాను పూర్వం ప్రకటించిన మాట ఆయన నెరవేర్చాడు. నీ పట్ల కనికరం లేకుండా ఆయన నాశనం చేశాడు. నిన్ను బట్టి నీ శత్రువులు సంతోషించేలా చేశాడు. నీ విరోధుల బలం హెచ్చించాడు.


వాళ్ళు మమ్మల్ని తరిమారు. మేము అలసిపోయాం. మాకు విశ్రాంతి లేదు.


ఈ విధంగా నెబుకద్నెజరు అనే నేను, పరలోకపు రాజును స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఘనపరుస్తున్నాను. ఎందుకంటే ఆయన జరిగించే కార్యాలన్నీ సత్యం, ఆయన నడిపించే విధానాలు న్యాయం. ఆయన గర్వంతో ప్రవర్తించే వాళ్ళను అణిచివేసే శక్తి గలవాడు.


చురుకైన వారు సైతం తప్పించుకోలేరు. బలమైనవారు తమ బలాన్నిబట్టి ధైర్యం తెచ్చుకోలేకపోతారు. గొప్ప వీరుడు కూడా తన ప్రాణం కాపాడుకోలేడు.


ఇశ్రాయేలీయులారా! యెహోవా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఐగుప్తుదేశం నుంచి ఆయన రప్పించిన వంశమంతటి గురించి ఆయన తెలియజేసిన మాట వినండి.


లోకంలోని వంశాలన్నిటిలో మిమ్మల్ని మాత్రమే నేను ఎన్నుకున్నాను. కాబట్టి మీ పాపాలన్నిటికీ మిమ్మల్ని శిక్షిస్తాను.


అది గడ్డుకాలం గనక ఎలాంటి బుద్దిమంతుడైనా అప్పుడు ఊరుకుంటాడు.


మంచాల మీద పడుకుని మోసపు పనులు ఆలోచిస్తూ దుర్మార్గాలు చేసేవారికి బాధ తప్పదు. వాళ్లకు అధికారముంది కాబట్టి పగటి వెలుతురులో వాళ్ళు అలా చేస్తారు.


వారు నా ప్రాణం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి తెగించారు. వారి ఇంట్లో సమావేశమయ్యే సంఘానికి కూడా అభివందనాలు చెప్పండి. నేను ఒక్కడినే కాదు, యూదేతర సంఘాలన్నీ వీరి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాయి.


సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి.


కాబట్టి యెహోవా మీ మీదికి రప్పించే మీ శత్రువులకు మీరు బానిసలవుతారు. ఆకలితో, దాహంతో, దిగంబరులుగా, పేదరికం అనుభవిస్తూ వారికి సేవ చేస్తారు. మీరు నాశనం అయ్యే వరకూ యెహోవా మీ మెడ మీద ఇనుపకాడి ఉంచుతాడు.


కనికరం చూపించని వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది. కనికరం తీర్పును జయిస్తుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ