మీకా 1:7 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
7 దాని చెక్కుడు బొమ్మలు ముక్కలు ముక్కలవుతాయి. దాని కానుకలు మంటల్లో కాలిపోతాయి. దాని విగ్రహాలన్నిటినీ నేను పాడు చేస్తాను. అది వేశ్యగా సంపాదించుకున్న కానుకలతో వాటిని తెచ్చుకుంది, కాబట్టి అవి వేశ్య జీతంగా మళ్ళీ వెళ్ళిపోతాయి.
7 దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును, దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును, అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడుచేతును, అది వేశ్యయై సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయగుదాని జీతముగా మరల ఇయ్యబడును.
7 దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరుగగొట్టబడతాయి. అది సంపాదించిన ధనం అగ్నికి ఆహుతి అవుతుంది. దానియొక్క బూటకపు దేవుళ్ల విగ్రహాలన్నిటినీ నేను నాశనం చేస్తాను. ఎందుకంటే, సమరయ నా పట్ల అవిశ్వాసంగా ఉండి అవన్నీ కూడబెట్టింది. కావున ఈ వస్తువులన్నీ నాపట్ల అవిశ్వాసంగా ఉన్న ఇతర ప్రజలకు వెళ్లిపోతాయి.
7 దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరగ్గొట్టబడతాయి; దాని గుడి కానుకలన్ని అగ్నితో కాల్చబడతాయి; నేను దాని ప్రతిమలన్నిటినీ నాశనం చేస్తాను. అది వేశ్య సంపాదనతో తన బహుమానాలను పోగుచేసింది కాబట్టి అవి మళ్ళీ వేశ్య జీతంగా ఇవ్వబడతాయి.”
7 దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరగ్గొట్టబడతాయి; దాని గుడి కానుకలన్ని అగ్నితో కాల్చబడతాయి; నేను దాని ప్రతిమలన్నిటినీ నాశనం చేస్తాను. అది వేశ్య సంపాదనతో తన బహుమానాలను పోగుచేసింది కాబట్టి అవి మళ్ళీ వేశ్య జీతంగా ఇవ్వబడతాయి.”
ఇదంతా అయిపోయిన తరువాత అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలంతా యూదా పట్టణాలకు వెళ్లి, విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి, అషేరా దేవతాస్తంభాలను విరగగొట్టి, యూదా బెన్యామీను దేశాలంతటా ఉన్నఉన్నత పూజా స్థలాలను, బలిపీఠాలను, పడగొట్టారు. తరువాత ఎఫ్రాయిమూ, మనష్షే ప్రాంతాల్లో కూడా ఇలానే పూర్తిగా నాశనం చేశారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా తమ తమ పట్టణాలకూ, గ్రామాలకూ తిరిగి వెళ్లిపోయారు.
డెబ్భై సంవత్సరాలు ముగిసిన తర్వాత యెహోవా తూరుకు సహాయం చేస్తాడు. అది తిరిగి తన జీతం సంపాదించుకోడానికి భూమి పైన ఉన్న అన్ని రాజ్యాలతో వేశ్యలాగా వ్యవహరిస్తుంది.
యాకోబు చేసిన పాపానికి ఈ విధంగా పరిహారం జరుగుతుంది. అది అతడు చేసిన పాప పరిహారానికి కలిగే ఫలం. సున్నపురాతిని చూర్ణం చేసినట్టు అతడు బలిపీఠపు రాళ్ళను చిన్నాభిన్నం చేస్తాడు. అషేరా దేవతా స్తంభాలూ, ధూపం వేసే వేదికలూ ఇక నిలిచి ఉండవు.
మీరు ఏ పట్టణంలో నివసించినా ఆ పట్టణాలు నాశనం అవుతాయి. మీ బలిపీఠాలు నాశనం, నిర్జనం అవుతాయి. తరువాత అవి పగిలి పోతాయి. మాయమై పోతాయి. మీ దేవతా స్తంభాలు విరిగిపోతాయి. మీరు చేసినవన్నీ తుడిచిపెట్టుకు పోతాయి.
“ఇవి నా విటులు నాకిచ్చిన జీతం” అని వేటిని గురించి చెప్పిందో ఆ ద్రాక్ష చెట్లను అంజూరపు చెట్లను ధ్వంసం చేస్తాను. అడవి జంతువులు వాటిని తినివేసేలా వాటిని కారడవిలాగా చేస్తాను.
వారి తల్లి కులట. వారిని కన్నతల్లి సిగ్గు లేకుండా ప్రవర్తించింది. ఆమె “నా విటుల వెంట పోతాను. వాళ్ళు నాకు అన్నపానాలు, ఉన్ని, జనపనార, నూనె, పానీయం ఇస్తారు” అనుకుంది.
ప్రవక్త ఇలా అంటున్నాడు “షోమ్రోనూ, ఆయన నీ దూడను విసిరి పారేశాడు.” యెహోవా ఇలా అంటున్నాడు. నా కోపం ఈ ప్రజల మీద మండుతూ ఉంది. ఎంత కాలం వారు అపవిత్రంగా ఉంటారు?
నేను మీ ఉన్నత స్థలాలను పాడు చేస్తాను. మీ విగ్రహాలను ధ్వంసం చేస్తాను. మీ విగ్రహాల శవాలపై మీ శవాలను పడవేయిస్తాను. నా మనస్సులో మిమ్మల్ని అసహ్యించు కుంటాను.
పురుష సంపర్కం వల్ల గానీ పడుపు సొమ్ము వల్ల గానీ వచ్చే ధనాన్ని మొక్కుబడిగా మీ దేవుడైన యెహోవా ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే ఆ రెండూ మీ దేవుడైన యెహోవాకు అసహ్యం.
ఎందుకంటే దేవుని కోపాన్ని తెచ్చే దాని లైంగిక విశృంఖలతా మద్యాన్ని జనమంతా తాగి మత్తెక్కి పడిపోయారు. భూమి మీద రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. లోకంలో వ్యాపారులు ఆమె అధిక సుఖభోగాల ప్రభావం వల్ల సంపన్నులయ్యారు.”
ఆమెతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకుని సుఖభోగాలు అనుభవించిన భూరాజులు అందరూ ఆమెకు కలుగుతున్న వేదన చూసి భయంతో దూరంగా నిలబడతారు. ఆమె తగలబడి పోతుంటే వచ్చే పొగను చూస్తూ రోదిస్తారు. “అయ్యో, అయ్యో, బబులోను మహానగరమా, శక్తివంతమైన నగరమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చి పడిందా” అంటూ ఏడుస్తారు.
ఆ తరువాతి రోజు ఉదయం కూడా దాగోను యెహోవా మందసం ఎదురుగా నేలపై బోర్లా పడి ఉంది. దాగోను విగ్రహం తల, రెండు అరచేతులు నరికివేసి గుమ్మం దగ్గర పడి ఉన్నాయి. దాని మొండెం మాత్రం దానికి మిగిలి ఉంది.