Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మలాకీ 2:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ధర్మశాస్త్ర ఉపదేశంలో మీరు జరిగించిన పక్షపాతం వల్ల ప్రజలందరి ఎదుట మిమ్మల్ని తిరస్కారానికి గురైన వారుగా, అణగారి పోయిన వారుగా చేశాను అని సేనల ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 నా మార్గములను అనుస రింపక ధర్మశాస్త్రమునుబట్టి విమర్శించుటలో మీరు పక్ష పాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింప దగినవారినిగాను నీచులనుగాను చేసియున్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 “నేను మీతో చెప్పిన విధంగా మీరు జీవించరు! మీరు నా ప్రబోధాలు అంగీకరించలేదు! కనుక నేను మిమ్మల్ని ప్రాముఖ్యం లేనివారినిగా చేస్తాను. ప్రజలు మిమ్మల్ని బహిష్కరిస్తారు!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 “నా మార్గాలను అనుసరించక, ధర్మశాస్త్ర విషయాల్లో పక్షపాతం చూపుతూ వచ్చారు, కాబట్టి ప్రజలందరి కళ్లెదుటే మిమ్మల్ని అణచివేసి తృణీకారానికి గురిచేస్తాను” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 “నా మార్గాలను అనుసరించక, ధర్మశాస్త్ర విషయాల్లో పక్షపాతం చూపుతూ వచ్చారు, కాబట్టి ప్రజలందరి కళ్లెదుటే మిమ్మల్ని అణచివేసి తృణీకారానికి గురిచేస్తాను” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మలాకీ 2:9
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు మీకాయా “నీవు క్షేమంగా తిరిగి వస్తే యెహోవా నాద్వారా మాట్లాడలేదన్నట్టే. ఓ ప్రజలారా, ఈ విషయం వినండి” అన్నాడు.


మీరు దయచేసి వినండి. నేను ఎవరి విషయంలోనూ పక్షపాతం చూపించను. నేను ముఖస్తుతి కోసం ఎవరికీ బిరుదులు తగిలించను.


నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే దీవెనలు కలుగుతాయి. భక్తిహీనుల జ్ఞాపకం అసహ్యం కలిగిస్తుంది.


ఒక్కొక్క మనిషి తన బుద్ధి కుశలతను బట్టి ఘనత పొందుతాడు. కపట వర్తనుడు తిరస్కారానికి గురౌతాడు.


వాళ్ళు ఇకపై మీ చేతుల్లో బందీలుగా ఉండకుండాా నేను మీ ముసుగులను చింపి వాళ్ళని విడిపిస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.


నాశనం తరువాత నాశనం కలుగుతుంది. పుకార్ల తరువాత పుకార్లు పుట్టుకొస్తాయి. వాళ్ళు ప్రవక్తల దగ్గరికి దర్శనం కోసం వెళ్తారు. యాజకులకు ధర్మశాస్త్ర జ్ఞానం లేకుండా పోతుంది. సలహా ఇచ్చే పెద్దలకు తెలివి ఉండదు.


ప్రజల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తారు. వారి యాజకులు కూలికి బోధిస్తారు. ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెబుతారు. అయినా వాళ్ళు యెహోవాను ఆధారం చేసుకుని “యెహోవా మన మధ్య ఉన్నాడు గదా, ఏ కీడూ మనకు రాదు” అనుకుంటారు.


నీ ముఖంపై పెంట విసిరి చూసేవారు నిన్ను ఏవగించుకునేలా చేస్తాను.


మిమ్మల్ని బట్టి మీ సంతానాన్ని పెకలించి వేస్తాను. మీ పండగల్లో మీరు అర్పించే పశువుల పేడ మీ ముఖాలపై వేయిస్తాను. పేడ ఊడ్చి వేసే స్థలానికి మీరు ఊడ్చి వేయబడేలా చేస్తాను.


అయితే మీరు దారి తప్పారు. మీరు చేసిన ఉపదేశం వల్ల చాలా మంది దారి తప్పారు. నేను లేవీయులతో చేసిన నిబంధనను వమ్ము చేశారు.


అయితే తనను నీతిమంతుడిగా చూపించుకోడానికి అతడు, “అది సరే గానీ, నా పొరుగువాడు ఎవడు?” అని యేసును అడిగాడు.


అయ్యో పరిసయ్యులారా, మీకు యాతన. మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి ఆకు కూరలోనూ పదోభాగం దేవునికి చెల్లిస్తారు గానీ దేవుని ప్రేమనూ, న్యాయాన్నీ వదిలేస్తున్నారు. మిగిలిన వాటిని చేస్తూనే న్యాయంగా నడుచుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి.


ఇతరులు నాయకులుగా ఎంచిన వారు నేను చెప్పిన సందేశానికి ఏ మార్పులు చేర్పులు చేయలేదు. ఆ నాయకులు గొప్పవారే కానీ వారు నాకంత ప్రధానం కాదు. దేవుడు మనిషి పైరూపం చూడడు.


అలా చేసేటప్పుడు తక్కువ, ఎక్కువ అనే పక్షపాతం లేకుండా వినాలి. న్యాయపు తీర్పు దేవునిది కాబట్టి మీరు మనుషుల ముఖం చూసి భయపడవద్దు. మీకు కష్టమైన వివాదాన్ని నా దగ్గరికి తీసుకు రండి. దాన్ని నేను విచారిస్తాను” అని ఆజ్ఞాపించాను.


నీ ఇంటివారు, నీ పూర్వికుని ఇంటివారు నా సన్నిధిలో యాజకత్వం జరిగిస్తారని నేను వాగ్దానం చేశాను. కానీ ఇప్పుడు అలా కొనసాగించడం నాకు దూరం అగు గాక.’ అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి యెహోవా మాట ఏమిటంటే, ‘నన్ను గొప్ప చేసేవారిని నేను గొప్పచేస్తాను. నన్ను తిరస్కరించేవారిని తోసిపుచ్చుతాను.’


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ