Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 7:31 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

31 యాజకుడు బలిపీఠం పైన ఆ కొవ్వుని దహించాలి. కానీ రొమ్ము భాగం అహరోనుకీ అతని వారసులకీ చెందుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

31 యాజకుడు బలిపీఠముమీద ఆ క్రొవ్వును దహింపవలెను గాని, బోర అహరోనుకును అతని సంతతివారికిని చెందును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

31 అప్పుడు యాజకుడు బలిపీఠం మీద కొవ్వును దహించాలి. అయితే ఆ జంతువు బోర అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

31 యాజకుడు ఆ క్రొవ్వును బలిపీఠం మీద దహించాలి, కాని రొమ్ము భాగం అహరోను, అతని కుమారులకు చెందుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

31 యాజకుడు ఆ క్రొవ్వును బలిపీఠం మీద దహించాలి, కాని రొమ్ము భాగం అహరోను, అతని కుమారులకు చెందుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 7:31
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

అహరోను సేవా ప్రతిష్ట కోసం నియమించిన ఆ పొట్టేలు బోరను తీసుకుని యెహోవా సన్నిధిలో కదిలించే అర్పణగా దాన్ని కదిలించాలి. ఆ భాగం నీది అవుతుంది.


వీటన్నిటినీ యాజకుడు బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. ఇది యెహోవాకి అర్పించే దహనబలి.


వీటన్నిటినీ యాజకుడు కమ్మని సువాసన వచ్చేలా బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. కొవ్వు అంతా యెహోవాకే చెందుతుంది.


అహరోను కొడుకులు వాటిని బలిపీఠం మీద నిప్పులపై పేర్చిన కట్టెల పైన ఉన్న దహనబలి తో పాటు దహిస్తారు. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది. అది అగ్నితో చేసిన అర్పణగా ఉంటుంది.


పైన చెప్పిన వాటిలో అతడు చేసిన పాపాన్ని యాజకుడు కప్పివేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది. నైవేద్యం అర్పణలో మిగిలినది యాజకునికి చెందినట్టుగా ఇక్కడ కూడా అర్పణ చేయగా మిగిలినది యాజకునికి చెందుతుంది.”


అర్పించగా మిగిలిన దాన్ని అహరోనూ, అతని కుమారులూ భుజించాలి. పరిశుద్ధ స్థలం లో దాన్ని తినాలి. పొంగజేసే పదార్ధం లేకుండా దాన్ని తినాలి. ప్రత్యక్ష గుడారం ఆవరణలో దాన్ని తినాలి.


ప్రత్యక్ష గుడారం ఆవరణలోని పరిశుద్ధ స్థలం లో దాన్ని తినాలి.


ఎందుకంటే నా ఎదుట పైకి లేపి కదిలించిన రొమ్ము భాగాన్నీ, తొడనూ నేను స్వీకరించాను. వాటిని నేను యాజకుడైన అహరోనుకీ, అతని వారసులకీ ఇచ్చాను. ఇశ్రాయేలు ప్రజలు అర్పించే శాంతి బలులన్నిటిలో ఇవి వారి వంతుగా ఉంటాయి. ఇది నా ప్రజలైన ఇశ్రాయేల్ వారు అనుసరించవలసిన శాశ్వత నియమం.


తరువాత మోషే దాని రొమ్ము భాగాన్ని తీసుకుని దాన్ని కదలిక అర్పణగా యెహోవా సమక్షంలో పైకెత్తి కదిలించాడు. యాజకుణ్ణి ప్రతిష్టించే పనిలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పొట్టేలులో అది మోషే వంతు.


ఇంకా వారి దానాల్లో ప్రతిష్టించిందీ, ఇశ్రాయేలీయులు అల్లాడించే అర్పణలన్నీ నీకు చెందుతాయి. నీకూ, నీ కొడుకులకూ, నీ కూతుళ్ళకూ శాశ్వతమైన భాగంగా నేను మీకిచ్చాను. నీ ఇంట్లో ఆచారరీతిగా శుచిగా ఉన్నవారు ఈ అర్పణల్లో దేనినైనా తినొచ్చు.


అల్లాడించే అర్పణగా ఉన్న బోర, కుడి జబ్బ, నీదైనట్టు అది కూడా నీకు చెందుతుంది.


దేవాలయంలో పని చేసేవారు తమ జీవనోపాధిని ఆలయం నుండే పొందుతారు. బలిపీఠం దగ్గర కనిపెట్టుకుని ఉండేవారు ఆ బలిపీఠం మీద అర్పించిన వస్తువుల్లో పాలిభాగస్తులు అని మీకు తెలియదా?


ఎవరైనా ఎద్దును గానీ, గొర్రెను గానీ, మేకను గానీ బలిగా అర్పించినప్పుడు అర్పించిన వాటి కుడి జబ్బ, రెండు దవడలు, పొట్ట భాగం యాజకులకు ఇవ్వాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ