లేవీయకాండము 6:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 తాను దేని గురించైతే అబద్ధ ప్రమాణం చేసాడో దాన్ని పూర్తిగా చెల్లించాలి. ఇంకా అది ఎవరికి చెందుతుందో వారికి దానిలో ఐదో వంతు తప్పక చెల్లించాలి. దాన్ని అపరాధ బలి అర్పించే రోజున చెల్లించాలి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఆ మూలధనము నిచ్చుకొని, దానితో దానిలో అయిదవ వంతును తాను అపరాధ పరిహారార్థబలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 దేన్ని గూర్చి అతడు అబద్ధ ప్రమాణం చేసాడో దాన్ని అతడు తిరిగి ఇచ్చివేయాలి. దాని పూర్తివిలువను అతడు చెల్లించాలి. తర్వాత దాని విలువలో అయిదోవంతు అదనంగా అతడు చెల్లించాలి. దాని అసలైన సొంతదారునికి అతడు ఆ మొత్తాన్ని ఇవ్వాలి. అతడు తన అపరాధ పరిహారార్థ బలి తెచ్చిననాడే దీన్ని చెల్లించాలి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 లేదా వారు అబద్ధ ప్రమాణం చేసినదైనా, వారు తప్పక పూర్తి నష్టపరిహారం చెల్లించాలి, దానికి దాని వెలలో అయిదవ వంతు కలిపి వారు తమ అపరాధపరిహారబలి సమర్పించే రోజున దానినంతటిని యజమానికి ఇవ్వాలి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 లేదా వారు అబద్ధ ప్రమాణం చేసినదైనా, వారు తప్పక పూర్తి నష్టపరిహారం చెల్లించాలి, దానికి దాని వెలలో అయిదవ వంతు కలిపి వారు తమ అపరాధపరిహారబలి సమర్పించే రోజున దానినంతటిని యజమానికి ఇవ్వాలి. အခန်းကိုကြည့်ပါ။ |
ఇదిగో నన్ను చూడండి, నేను ఎవరి ఎద్దునైనా అక్రమంగా తీసుకొన్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకొన్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధపెట్టానా? న్యాయం దాచిపెట్టడానికి ఎవరి దగ్గరైనా ముడుపులు తీసుకున్నానా? అలా చేసి ఉంటే, యెహోవా ముందూ యెహోవా చేత అభిషేకం పొందినవాని ముందూ నామీద సాక్ష్యం చెప్పించండి. అప్పుడు నేను మీ సమక్షంలో వాటన్నిటినీ తిరిగి ఇచ్చివేస్తాను.”