అప్పుడాయన నాతో ఇలా అన్నాడు. “ఖాళీ స్థలానికి ఎదురుగా ఉన్న ఉత్తరపు గదులు, దక్షిణపు గదులు పవిత్రమైన యాజకులవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధమైన ఆహారాన్ని తింటారు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను, అంటే నైవేద్యాన్ని, పాప పరిహారార్థ బలి పశుమాంసాన్ని, అపరాధ పరిహారార్థ బలి పశుమాంసాన్ని ఉంచుతారు. ఆ స్థలం అతి పరిశుద్ధం.