Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 25:10 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 మీరు ఆ సంవత్సరాన్ని, అంటే ఏభైయవ సంవత్సరాన్ని పరిశుద్ధ పరచి మీ దేశంలో ఉన్న వారందరికి విడుదల కలిగిందని చాటించాలి. అది మీకు సునాదం. అప్పుడు మీలో ప్రతివాడూ తన ఆస్తిని తిరిగి సొంతం చేసుకోవాలి. ప్రతివాడూ తన కుటుంబానికి తిరిగి రావాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగా నుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 50వ సంత్సరాన్ని మీరు ఒక ప్రత్యేక సంవత్సరంగా చేయాలి. మీ దేశంలో నివసించే మనుష్యులందరికీ మీరు స్వతంత్రం ప్రకటించాలి. ఇది బూరధ్వని చేసే మహోత్సవ కాలం అని పిలువబడుతుంది. మీలో ప్రతి ఒక్కరూ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి. మరియు మీలో ప్రతి ఒక్కరూ తన కుటుంబానికి తిరిగి వెళ్లాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 యాభైయవ సంవత్సరాన్ని ప్రతిష్ఠితం చేసి, దేశమంతటా దాని నివాసులందరికి స్వేచ్ఛను ప్రకటించండి. ఇది మీకు యాభైయవ వార్షికోత్సవం అవుతుంది; మీలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబ స్వాస్థ్యానికి, మీ సొంత కుటుంబానికి తిరిగి వెళ్లాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 యాభైయవ సంవత్సరాన్ని ప్రతిష్ఠితం చేసి, దేశమంతటా దాని నివాసులందరికి స్వేచ్ఛను ప్రకటించండి. ఇది మీకు యాభైయవ వార్షికోత్సవం అవుతుంది; మీలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబ స్వాస్థ్యానికి, మీ సొంత కుటుంబానికి తిరిగి వెళ్లాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 25:10
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీలో ఆయన ప్రజలందరికీ దేవుడు తోడుగా ఉంటాడు గాక. వారు యూదా దేశంలోని యెరూషలేముకు బయలుదేరి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టాలి.


దోపిడీకి గురైన వాళ్లకు ఆయన న్యాయం చేకూరుస్తాడు. ఆకలిగొన్న వాళ్లకు ఆహారం అనుగ్రహిస్తాడు. ఖైదీలకు విడుదల కలిగిస్తాడు.


నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన దేవుణ్ణి నేనే.


నువ్వు బందీలతో, ‘బయలుదేరండి’ అనీ చీకట్లో ఉన్నవారితో, ‘బయటికి రండి’ అనీ చెబుతావు. వాళ్ళు దారిలో మేస్తారు. చెట్లు లేని కొండలమీద వారికి మేత దొరుకుతుంది.


పగ తీర్చుకునే రోజు కోసం చూశాను. నా విడుదల సంవత్సరం వచ్చింది.


ఆ ఒప్పందాన్నిబట్టి అందరూ తమకు దాసదాసీలుగా ఉన్న వాళ్ళను విడిపిస్తామనీ, ఇకముందు ఎవరూ వాళ్ళచేత దాస్యం చేయించుకోమనీ ఒప్పుకుని, ఆ నిబంధనలో చేరిన నాయకులు, ప్రజలు దానికి విధేయులై, వాళ్ళను విడిపించారు.


యూదాలో తన తోటి ఇశ్రాయేలీయుణ్ణి ఎవరూ దాస్యానికి పెట్టుకోకూడదనీ, తమ దాస్యంలో ఉన్న ఇశ్రాయేలు స్త్రీలను, పురుషులను ప్రతివాడూ విడుదల చెయ్యాలనీ,


అయితే అతడు తన పనివారిలో ఎవరికైనా భూమి ఇస్తే అది విడుదల సంవత్సరం వరకే అది అతనికి హక్కుగా ఉంది తరువాత పాలకునికి తిరిగి వస్తుంది. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యానికి హక్కుదారులవుతారు.


ఆ సంవత్సరం, అంటే ఏభైయవ సంవత్సరం మీకు సునాద కాలం. ఆ సంవత్సరంలో మీరు విత్తనాలు చల్ల కూడదు, కోత ఏర్పాట్లు చేసుకోకూడదు. బీడుగా వదిలిన చేలో దానంతట అదే పండిన పంట తినవచ్చు. బాగు చేయని ద్రాక్ష తోటలో పండ్లు ఏరుకోవచ్చు.


ఆ సునాద సంవత్సరం మీలో ప్రతి వాడు తన ఆస్తిని తిరిగి పొందాలి.


అప్పుడతడు తన పూర్వీకుల ఆస్తిని మళ్లీ అనుభవించేలా తన పిల్లలతో సహా నీ దగ్గర నుండి బయలు దేరి తన వంశం వారి దగ్గరికి తిరిగి వెళ్ళాలి.


అతడు ఈ విధంగా విడుదల పొందకపోతే సునాద సంవత్సరంలో అతడు తన పిల్లలతో సహా విడుదల పొందుతాడు.


మనం మన శత్రువుల చేతిలోనుంచి విడుదల పొంది, పరిశుద్ధంగా బతికినన్నాళ్ళు ఆయన సన్నిధానంలో, పవిత్రతతోను న్యాయప్రవర్తనతోను ఉంటూ, భయం లేకుండా ఆయనకు సేవ చేస్తాము అన్నదే, మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన చేసిన ప్రమాణం.


ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది.


ఈ హాగరు అరేబియా ప్రాంతంలో ఉన్న సీనాయి కొండ. ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడ బానిసత్వంలో ఉంది.


సోదరులారా, స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వాతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి.


స్వేచ్ఛ పొందిన వారుగా దుర్మార్గాన్ని కప్పి పెట్టడానికి మీ స్వేచ్ఛను వినియోగించక, దేవుని సేవకులుగా ఉండండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ