లేవీయకాండము 19:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 మీలో ప్రతివాడూ తన తల్లిని తన తండ్రిని గౌరవించాలి. నేను నియమించిన విశ్రాంతి దినాలను ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 “మీలో ప్రతి ఒక్కరూ తన తల్లిని, తండ్రిని గౌరవించాలి, నా ప్రత్యేక విశ్రాంతి దినాలను పాటించాలి. నేను మీ దేవుడైన యెహోవాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 “ ‘మీలో ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులను గౌరవించాలి, నా సబ్బాతులను ఆచరించాలి. నేను మీ దేవుడనైన యెహోవాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 “ ‘మీలో ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రులను గౌరవించాలి, నా సబ్బాతులను ఆచరించాలి. నేను మీ దేవుడనైన యెహోవాను. အခန်းကိုကြည့်ပါ။ |
విశ్రాంతి దినాన ప్రయాణం చేయకుండా, నా ప్రతిష్ఠిత దినాన్ని నీ సొంత ఆహ్లాదం కోసం వాడకుండా ఉన్నావనుకో. విశ్రాంతి దినాన్ని మనోహరమైనదిగా భావిస్తూ యెహోవాకు చెందిన విషయాలను పవిత్రంగా గౌరవంగా చేస్తున్నావనుకో. నీ సొంత వ్యాపారం వదిలేసి విశ్రాంతి దినాన్ని సొంత ఆహ్లాదం కోసం వాడకుండా నీ సొంత మాటలు మాట్లాడకుండా గౌరవిస్తున్నావనుకో.
“కుమారుడు తన తండ్రిని గొప్ప చేస్తాడు గదా, దాసుడు తన యజమానుని ఘనపరుస్తాడు గదా. నా గొప్పదనాన్ని నిర్లక్ష్యం చేసే యాజకులారా, నేను మీకు తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయింది? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు?” అని సేనల ప్రభువైన యెహోవా మిమ్మల్ని అడిగినప్పుడు “నీ నామాన్ని మేము ఏ విధంగా నిర్లక్ష్యం చేశాం?” అని మీరు అంటారు.