Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 18:2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 “నేను మీ దేవుడైన యెహోవాను అని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 –నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను యెహోవాను, మీ దేవుణ్ణి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 “నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి, ‘నేను మీ దేవుడనైన యెహోవాను అని చెప్పు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 “నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి, ‘నేను మీ దేవుడనైన యెహోవాను అని చెప్పు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 18:2
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను నీకూ నీ తరువాత నీ సంతానానికీ దేవుడిగా ఉండే విధంగా నాకూ నీకూ మధ్యన, నీ తరువాత నాకూ నీ సంతానానికీ మధ్యన నా నిబంధనను స్థిరం చేస్తాను. అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది.


యెహోవా ఏ ప్రజలకు దేవుడుగా ఉన్నాడో ఆ ప్రజలు ధన్యజీవులు. తనకు సొత్తుగా ఆయన ఎంచుకున్న జనం ధన్యజీవులు.


నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన దేవుణ్ణి నేనే.


మిమ్మల్ని నా సొంత ప్రజగా నా చెంత చేర్చుకుని మీకు దేవుడైన యెహోవాగా ఉంటాను. అప్పుడు ఐగుప్తీయుల బానిసత్వం కింద నుండి మిమ్మల్ని విడిపించి బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.


వాళ్ళతో చెప్పు, ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలును ఎంపిక చేసుకున్న రోజు, యాకోబు సంతానానికి ప్రమాణం చేసిన రోజు, ఐగుప్తుదేశంలో నన్ను వాళ్లకు ప్రత్యక్షం చేసుకుని ప్రమాణం చేసి, నేను మీ దేవుడైన యెహోవానని నేను ప్రకటించిన కాలంలో,


అప్పుడు నేను వాళ్ళతో, నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడూ అసహ్యమైన పనులు విడిచిపెట్టాలి, ఐగుప్తీయుల విగ్రహాలు విసిరేసి, వాటిని పూజించడం వల్ల మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకుండా ఉండాలి, అన్నాను.


ఎందుకంటే నేను యెహోవాని. మీ దేవుణ్ణి. నేను పరిశుద్ధుణ్ణి. కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండేలా శుద్ధీకరణ చేసుకోండి. నేలపైన పాకే జీవుల మూలంగా మిమ్మల్ని మీరు మలినం చేసుకోవద్దు.


యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.


కాబట్టి మీకంటే ముందుగా అక్కడ నివసించిన వాళ్ళు పాటించిన అసహ్యమైన ఆచారాల్లో దేనినైనా పాటించి అపవిత్రులై పోకుండా నేను మీకు విధించిన నియమాలను అనుసరించి నడుచుకోవాలి. నేను మీ దేవుణ్ణి. యెహోవాను.”


మీరు నా విధులను పాటించాలి. నా చట్టాల ప్రకారం నడుచుకుంటూ వాటిని ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.


నీ ద్రాక్ష తోటలో పండ్లన్నిటినీ సేకరించుకో కూడదు. ద్రాక్ష తోటలో రాలిన పండ్లను ఏరుకోకూడదు. పేదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి.


మీ మధ్య నివసించే పరదేశిని మీలో పుట్టినవాడి లాగానే ఎంచాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే అతణ్ణి ప్రేమించాలి. ఐగుప్తులో మీరు పరదేశులుగా ఉన్నారు గదా. నేను మీ దేవుడైన యెహోవాను.


నేను మీ ఎదుట నుండి వెళ్లగొడుతున్న జాతుల ఆచారాల ప్రకారం నడుచుకోకూడదు. వారు అలాటి క్రియలన్నీ చేశారు కాబట్టి నేను వారిని అసహ్యించుకున్నాను.


కాబట్టి మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్టించుకుని పవిత్రంగా ఉండండి. నేను మీ దేవుడైన యెహోవాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ