విలాపవాక్యములు 1:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 దాని చెంగులకు మురికి అంటింది. దాని ఎదుట ఉన్న శిక్ష అది గుర్తు చేసుకోలేదు. అది ఎంతో వింతగా పతనం అయ్యింది. దాన్ని ఆదరించేవాడు ఒక్కడూ లేడు. యెహోవా, నాకు కలిగిన బాధ చూడు. శత్రువులు ఎంత బలంగా ఉన్నారో చూడు! အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 దాని యపవిత్రత దాని చెంగులమీద నున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసికొనక యుండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దాని నాదరించువాడొకడును లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుటచేత నాకు కలిగినశ్రమను దృష్టించుము. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 యెరూషలేము చీర చెంగులు మురికి అయ్యాయి. తనకు జరుగబోయే విషయాలను గూర్చి ఆమె ఆలోచించలేదు. ఆమె పతనం విస్మయం కలుగజేస్తుంది. ఆమెను ఓదార్చటానికి ఆమెకు ఎవ్వరూలేరు. “ఓ ప్రభూ, నేనెలా బాధపడ్డానో చూడు! తనెంత గొప్పవాడినని నా శత్రువు అనుకొంటున్నాడో చూడు!” అని ఆమె అంటూ ఉంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ఆమె అపవిత్రత ఆమె దుస్తులకు అంటుకుంది; ఆమె తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఆమె పతనం ఆశ్చర్యకరంగా ఉంది; ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. “యెహోవా, నా బాధను చూడు, ఎందుకంటే శత్రువు నా మీద విజయం సాధించాడు.” အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ఆమె అపవిత్రత ఆమె దుస్తులకు అంటుకుంది; ఆమె తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఆమె పతనం ఆశ్చర్యకరంగా ఉంది; ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. “యెహోవా, నా బాధను చూడు, ఎందుకంటే శత్రువు నా మీద విజయం సాధించాడు.” အခန်းကိုကြည့်ပါ။ |
ఆమె ఒక ప్రమాణం చేస్తూ “సైన్యాలకు అధిపతి అయిన యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన బాధను చూసి నన్ను మరచిపోకుండా జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలనైన నాకు ఒక కుమారుణ్ణి దయచేస్తే వాడు బతికే కాలమంతా వాణ్ణి యెహోవాకు సమర్పిస్తాను. వాడి తలకు ఎన్నటికీ మంగలి కత్తి తగలనియ్యను” అని చెప్పింది. ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ఏలీ ఆమె నోటి కదలికలు కనిపెడుతున్నాడు.