యెహోషువ 19:47 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 దాను గోత్రం వారి భూభాగం ఈ సరిహద్దుల నుండి అవతలకు వ్యాపించింది. దాను గోత్రంవారు బయలుదేరి లెషెము మీద యుద్ధం చేసి దాన్ని జయించి కత్తితో దాని నివాసులను చంపి దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించి తమ పూర్వీకుడు దాను పేరుతో లెషెముకు దాను అనే పేరు పెట్టారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 దానీయుల సరిహద్దు వారియొద్దనుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమపితరుడైన దాను పేరునుబట్టి ఆ లెషెమునకు దానను పేరుపెట్టిరి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్47 అయితే దాను ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవటంలో కష్టం వచ్చింది. అక్కడ బలమైన శత్రువులు ఉన్నారు, వారిని దాను ప్రజలు తేలికగా ఓడించలేకపోయారు. కనుక దాను ప్రజలు వెళ్లి లెషెము మీద యుద్ధం చేసారు. లెషెమును వారు ఓడించి, అక్కడ నివసించిన మనుష్యులను చంపివేసారు. కనుక దాను ప్రజలు లెషెము పట్టణంలో నివసించారు. దాని పేరును వారు దానుగా మార్చి వేసారు, ఎందుకంటే అది ఆ వంశం పితరుని పేరు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 కానీ దాను గోత్రం వారి భూమిని స్వాధీనం చేసుకోవడంలో ఇబ్బంది పడింది, కాబట్టి వారు లెషెము పట్టణంపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకుని, దాని ప్రజలను చంపి అక్కడ స్థిరపడ్డారు. వారు తమ పూర్వికుల పేరు మీదుగా పట్టణానికి దాను అని పేరు పెట్టారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 కానీ దాను గోత్రం వారి భూమిని స్వాధీనం చేసుకోవడంలో ఇబ్బంది పడింది, కాబట్టి వారు లెషెము పట్టణంపై దాడి చేసి దానిని స్వాధీనం చేసుకుని, దాని ప్రజలను చంపి అక్కడ స్థిరపడ్డారు. వారు తమ పూర్వికుల పేరు మీదుగా పట్టణానికి దాను అని పేరు పెట్టారు. အခန်းကိုကြည့်ပါ။ |