Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహోషువ 15:7 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకూ వాగుకి దక్షిణ తీరాన ఉన్న అదుమ్మీము కొండ ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. ఆ సరిహద్దు ఏన్‌షేమెషు నీళ్లవరకూ వ్యాపించింది. దాని కొన ఏన్‌రోగేలు దగ్గర ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 ఆ సరిహద్దు ఆకోరులోయనుండి దెబీరువరకును ఏటికి దక్షిణతీరముననున్న అదుమ్మీము నెక్కుచోటికి ఎదురుగా నున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తరదిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్‌షేమెషు నీళ్లవరకు వ్యాపించెను. దాని కొన ఏన్‌రోగేలునొద్ద నుండెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 ఆ తర్వాత ఉత్తర సరిహద్దు ఆకోరు లోయలోనుండి దెబీరు వరకు కొనసాగింది. అక్కడ ఆ సరిహద్దు ఉత్తరానికి, తిరిగి గిల్గాలు వరకు వ్యాపించింది. అదుమ్మీము పర్వతాల మధ్యగా పోయే మార్గం మీద ఉంది గిల్గాలు. అది ఏటికి దక్షిణాన ఉంది. ఎన్‌షెమెషు నీళ్ల వరకు సరిహద్దు వ్యాపించింది. ఎన్‌రోగెలు దగ్గర సరిహద్దు నిలిచిపోయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకు వెళ్లి కొండగట్టుకు దక్షిణాన అదుమ్మీము కనుమకు ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. అది ఎన్-షెమెషు నీళ్ల నుండి ఎన్-రోగేలు వరకు వ్యాపించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకు వెళ్లి కొండగట్టుకు దక్షిణాన అదుమ్మీము కనుమకు ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. అది ఎన్-షెమెషు నీళ్ల నుండి ఎన్-రోగేలు వరకు వ్యాపించింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహోషువ 15:7
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

యోనాతాను, అహిమయస్సు తాము పట్టణం హద్దుకు వచ్చిన సంగతి ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఏన్‌రోగేలు దగ్గెర నిలిబడి ఉన్నప్పుడు ఒక పనిమనిషి వచ్చి, హూషై చెప్పిన సంగతి వారికి చెప్పినప్పుడు వారు వెళ్లి రాజైన దావీదుకు ఆ సంగతి చెప్పారు.


అదోనీయా ఏన్‌రోగేలు దగ్గరలోని జోహెలేతు అనే బండ దగ్గర గొర్రెలనూ ఎడ్లనూ కొవ్విన దూడలనూ బలిగా అర్పించి, రాకుమారులైన తన సోదరులందరినీ, యూదావారైన రాజు సేవకులందరినీ పిలిపించాడు.


నన్ను వెతికిన నా ప్రజల కోసం షారోను గొర్రెల మేతభూమి అవుతుంది. ఆకోరు లోయ, పశువులకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది.


వారి తల్లి కులట. వారిని కన్నతల్లి సిగ్గు లేకుండా ప్రవర్తించింది. ఆమె “నా విటుల వెంట పోతాను. వాళ్ళు నాకు అన్నపానాలు, ఉన్ని, జనపనార, నూనె, పానీయం ఇస్తారు” అనుకుంది.


తరువాత యెహోషువ, అతనితో కూడా ఇశ్రాయేలీయులంతా గిల్గాలులోని శిబిరానికి తిరిగి వచ్చారు.


అక్కడనుండి అతడు దెబీరు నివాసుల మీదికి వెళ్ళాడు. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్ సేఫరు.


ఆ సరిహద్దు బేత్‌హోగ్లా వరకూ వెళ్లి బేత్ అరాబాకు ఉత్తరంగా వ్యాపించింది. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాయి వరకూ వ్యాపించింది.


అది ఉత్తరంగా ఏన్‌షేమెషు వరకూ వ్యాపించి అదుమ్మీముకు ఎక్కుచోటికి ఎదురుగా ఉన్న గెలీలోతు వరకూ సాగి రూబేనీయుడైన బోహను రాతి దగ్గర దిగింది.


మొదటి నెల పదో తేదీన ప్రజలు యొర్దాను నదిలో నుండి వచ్చి యెరికో తూర్పు ప్రాంతంలోని గిల్గాలులో దిగగానే


తరువాత యెహోషువ, ఇశ్రాయేలీయులు అందరూ జెరహు కుమారుడు ఆకానునూ, ఆ వెండినీ పైవస్త్రాన్నీ, బంగారు కమ్మీనీ, ఆకాను కుమారులనూ, కుమార్తెలనూ, ఎద్దులనూ, గాడిదలనూ, మందనూ, డేరానూ, అతనికి కలిగిన సమస్తాన్నీ పట్టుకుని ఆకోరు లోయలోకి తీసుకొచ్చారు.


తరువాత ఆ వస్తువులనూ రాళ్ళతో కొట్టి అగ్నితో కాల్చి వాటి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు. అది ఈ రోజు వరకూ ఉంది. అప్పుడు యెహోవా తన కోపోద్రేకాన్ని విడిచిపెట్టాడు. అందుచేత ఇప్పటి వరకూ ఆ చోటికి “ఆకోరు లోయ” అని పేరు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ