Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోవేలు 3:5 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 మీరు నా వెండి, నా బంగారాలను తీసుకుపోయారు. నా విలువైన వస్తువులను పట్టుకుపోయి మీ గుళ్లలో ఉంచుకున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొనిపోతిరి; నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొనిపోయి మీ గుళ్లలో ఉంచుకొంటిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 నా వెండి, బంగారం మీరు తీసుకొన్నారు. నా ప్రశస్త ఐశ్వర్యాలు మీరు తీసుకొని మీమీ ఆలయాల్లో పెట్టుకొన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 ఎందుకంటే మీరు నా వెండి బంగారాలను తీసుకెళ్లారు, నా శ్రేష్ఠమైన వస్తువులను మీ గుళ్ళకు తీసుకెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 ఎందుకంటే మీరు నా వెండి బంగారాలను తీసుకెళ్లారు, నా శ్రేష్ఠమైన వస్తువులను మీ గుళ్ళకు తీసుకెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోవేలు 3:5
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

యూదా రాజు యోవాషు తన పూర్వీకులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా మొదలైన యూదా రాజులు యెహోవాకు ప్రతిష్ఠించిన పవిత్ర వస్తువులనూ తాను ప్రతిష్ఠించిన వస్తువులనూ, యెహోవా మందిరం గిడ్డంగుల్లో, రాజ భవనంలో కనిపించిన బంగారమంతా పోగు చేసి సిరియా రాజు హజాయేలుకు పంపాడు. అప్పుడు హజాయేలు యెరూషలేము నుండి వెళ్ళిపోయాడు.


“నేను నీ సేవకుణ్ణి, నీ కొడుకులాంటి వాణ్ణి గనుక నీవు వచ్చి, నా మీద దండెత్తిన సిరియా రాజు చేతిలో నుంచి, ఇశ్రాయేలురాజు చేతిలో నుంచి నన్ను రక్షించాలి” అని అష్షూరు రాజు తిగ్లతు పిలేసెరు దగ్గరికి వార్తాహరులను పంపాడు.


ఇంకా అతడు యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న వస్తువులు, రాజు ఖజానాలో ఉన్న సొమ్ము పట్టుకుని ఇశ్రాయేలు రాజు సొలొమోను యెహోవా ఆలయానికి చేయించిన బంగారపు ఉపకరణాలన్నీ, యెహోవా చెప్పిన విధంగా ముక్కలుగా చేయించి తీసుకెళ్ళిపోయాడు.


ఆ రోజున మిగిలిన తన ప్రజలను అష్షూరులో నుంచీ. ఐగుప్తులో నుంచీ, పత్రోసులో నుంచీ, కూషులో నుంచీ, ఏలాములో నుంచీ, షీనారులో నుంచీ, హమాతులో నుంచీ, సముద్రద్వీపాల్లో నుంచీ విడిపించి రప్పించడానికి యెహోవా రెండోసారి తన చెయ్యి చాపుతాడు.


కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు “ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి రప్పించిన యెహోవా జీవం తోడు” అని ఇకపై ప్రమాణం చెయ్యరు.


వినండి. బబులోనులో నుండి తప్పించుకుని పారిపోతున్న వాళ్ళ శబ్దం వినిపిస్తుంది. సీయోను విషయంలోనూ, తన మందిరం విషయంలోనూ మన దేవుడైన యెహోవా చేస్తున్న ప్రతీకారాన్ని ప్రకటించండి.


బాణాలు పదును పెట్టండి. డాళ్ళు చేత పట్టుకోండి. బబులోనును నాశనం చేయడానికి యెహోవా మాదీయుల రాజు మనస్సును రేపుతున్నాడు. అది యెహోవా తీర్చుకుంటున్న ప్రతీకారం. తన మందిరాన్ని కూలగొట్టినందుకు ఆయన చేస్తున్న ప్రతిదండన.


కాబట్టి ప్రవచనాత్మకంగా వాళ్ళతో ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నా ప్రజలారా, మీ సమాధులను నేను తెరుస్తాను. సమాధుల్లో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశానికి తీసుకు వస్తాను.


అతడు కోట గోడల దేవుణ్ణి ఘన పరుస్తాడు. అతడు తన పితరులకు తెలియని దేవుణ్ణి వెండి బంగారాలను, వెలగల రాళ్ళను అర్పించి కొలుస్తాడు.


అయితే సీయోను కొండ మీద తప్పించుకున్న వారు నివసిస్తారు. అది పవిత్రంగా ఉంటుంది. యాకోబు వంశం వాళ్ళు తమ వారసత్వం పొందుతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ