Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 9:20 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 స్త్రీలారా, యెహోవా మాట వినండి. ఆయన నోటి నుండి వచ్చే సందేశాలను జాగ్రత్తగా ఆలకించండి. మీ కూతుళ్ళకు విలాప గీతం నేర్పండి. ఒకరికొకరు అంగలార్పు గీతాలు నేర్పండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 స్త్రీలారా, యెహోవా మాట వినుడి–మీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

20 యూదా స్త్రీలారా, యెహోవా వర్తమానం మీరిప్పుడు వినండి. యెహోవా వాక్కు వినటానికి మీ చెవులనివ్వండి. యెహోవా ఇలా అంటున్నాడు, మీ కుమార్తెలకు గగ్గోలుగా విలపించటం ఎలానో నేర్పండి. ప్రతీ స్త్రీ ఈ విలాపగీతం పాడటం నేర్చుకోవాలి:

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 స్త్రీలారా, యెహోవా మాట వినండి; ఆయన నోటి మాటలకు మీ చెవులు తెరవండి. ఏడ్వడం ఎలాగో మీ కుమార్తెలకు నేర్పండి; ఒకరికొకరు ఎలా విలపించాలో బోధించండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 స్త్రీలారా, యెహోవా మాట వినండి; ఆయన నోటి మాటలకు మీ చెవులు తెరవండి. ఏడ్వడం ఎలాగో మీ కుమార్తెలకు నేర్పండి; ఒకరికొకరు ఎలా విలపించాలో బోధించండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 9:20
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆయన నోటి నుండి వచ్చే ఉపదేశాన్ని అవలంబించు. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకో.


యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమార్తెలు పోగరుబోతులు. మెడ చాచి నడుస్తూ, ఓర చూపులు చూస్తూ, కులుకుతో నడుస్తూ, తమ కాళ్ల గజ్జెలు మోగిస్తున్నారు.


“నేను పిల్లలను వాళ్లకు నాయకులుగా నియమిస్తాను. పసివాళ్ళు వాళ్ళ మీద పెత్తనం చేస్తారు.


“వాళ్ళెవరితో అలాంటి ప్రవచనాలు చెబుతారో ఆ ప్రజలు కరువుకూ కత్తికీ గురై, యెరూషలేము వీధుల్లో కూలుతారు. నేను వాళ్ళ దుర్మార్గాన్ని వాళ్ళ మీదికి రప్పిస్తాను. వాళ్ళనూ వాళ్ళ భార్యలనూ వాళ్ళ కొడుకులనూ కూతుళ్ళనూ పాతిపెట్టడానికి ఎవడూ ఉండడు.”


సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. “మీకు ప్రవచనాలు ప్రకటించే ప్రవక్తల మాటలు వినవద్దు. వాళ్ళు మిమ్మల్ని భ్రమపెట్టారు! వాళ్ళు యెహోవా నోటి నుంచి వచ్చినవి కాక తమ సొంత మనస్సులోని దర్శనాలను ప్రకటిస్తున్నారు.”


కల కనిన ప్రవక్త ఆ కలను చెప్పవచ్చు. అయితే ఎవడికి నేను నా వాక్కు వెల్లడించానో అతడు దాన్ని నమ్మకంగా చెప్పవచ్చు. ధాన్యంతో పొట్టుకు ఏం సంబంధం? ఇదే యెహోవా వాక్కు.


కాబట్టి నేను యెహోవా కోపంతో నిండిపోయాను. దాన్ని నాలోనే అణచుకోలేక నేను విసిగిపోయాను. వీధుల్లో తిరిగే పసిపిల్లలు, యువకులు, ఇలా ప్రతి ఒక్కరి మీదా దాన్ని కుమ్మరించాల్సి వస్తున్నది. భార్యతో బాటు భర్తనూ, వయస్సు మీరిన ప్రతి వాడితో కలిపి వృద్ధులందరినీ పట్టుకుంటారు.


తనకు కోపం తెప్పించిన తరం ప్రజలను యెహోవా విసర్జించి వెళ్లగొట్టాడు. నీ తలవెండ్రుకలు కత్తిరించుకో. వాటిని పారవెయ్యి. చెట్లు లేని ఉన్నత స్థలాల్లో రోదన చెయ్యి.


వాటిని తెచ్చి వారు వేటినైతే ప్రేమిస్తున్నారో, పూజిస్తున్నారో, వేటి ఎదుట విచారణ చేస్తున్నారో, నమస్కరిస్తున్నారో ఆ సూర్య చంద్ర నక్షత్రాల ఎదుట వాటిని పరుస్తారు. వాటిని పోగు చేసి పాతిపెట్టడం జరగదు. భూమి మీద పెంటలాగా అవి పడి ఉంటాయి.


ఈ సంగతిని అర్థం చేసుకోగల జ్ఞానం ఎవరికుంది? దాన్ని వివరించడానికి యెహోవా ఎవరికి తన నోటి మాట ఇచ్చాడు? ఎవరూ ప్రయాణం చేయలేకుండా ఆ దేశం ఎందుకు ఎడారిలా మారిపోయింది?


రాత్రి పూట నువ్వు లేచి మొర్ర పెట్టు. నీళ్లు కుమ్మరించినట్టు ప్రభువు సన్నిధిలో నీ హృదయం కుమ్మరించు. ప్రతి వీధి మొదట్లో ఆకలితో సతమతమౌతున్న నీ పసిపిల్లల ప్రాణం కోసం నీ చేతులు ఆయన వైపు ఎత్తు.”


యువకులూ, వృద్ధులూ వీధుల్లో నేల మీద పడి ఉన్నారు. నా కన్యకలూ, నా యోధులూ కత్తి చేత కూలి పోయారు. నీ ఉగ్రత దినాన నువ్వు వాళ్ళను హతం చేశావు. జాలి లేకుండా వాళ్ళందరినీ నువ్వు చంపావు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ